అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

వచ్చే పదేళ్లలో కాకినాడ, భీమవరం, పాలకొల్లు సముద్రంలో మునిగిపోతాయా ?

Written by: Venkatakarunasri
Updated: Thursday, June 15, 2017, 11:52 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఒక్క రాత్రిలో ఊరు మొత్తం ఖాళీ...

కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ చేత పరిరక్షింపబడుతున్నది. కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం.

ఇది కూడా చదవండి:ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి బీచ్ లు కూడా ఉన్నాయా?

కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది.

వచ్చే పదేళ్లలో కాకినాడ, భీమవరం, పాలకొల్లు సముద్రంలో మునిగిపోతాయా ?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

కాకినాడ

ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి. కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు.

pc:youtube

 

త్రేతాయుగం

స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది. త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు.

pc:youtube

 

సీత

వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనం వెలిసినది. ఇక్కడకి మొదట డచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత ఆంగ్లేయులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.

pc:youtube

 

క్రైస్తవ మిషనరీలు

తరువాత కెనడియన్‌ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతో వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.

pc:youtube

 

భీమవరం పశ్చిమ గోదావరిజిల్లా

భీమవరం లో ప్రధాన ఆదాయవనరు వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. చేపలు/రొయ్యల చెరువులు ఈ పట్టణం పరిసరాలలో కానవస్తాయి. ఇవే ఈ పట్టణానికి ప్రధాన ఆదాయవనరు కూడా. భీమవరం పశ్చిమ గోదావరిజిల్లా లో రెండవ పెద్ద పట్టణం (మొదటిది - జిల్లా కేంద్రం ఏలూరు).

pc:youtube

 

క్రీ.శ. 890 - 918

తూర్పు చాళుక్య రాజైన భీమ పేరుమీదుగా ఈ పట్టణానికి భీమవరం అన్న పేరువచ్చింది. భీమవరంలో ఈయన సోమేశ్వర ఆలయాన్ని క్రీ.శ. 890 - 918 మధ్యకాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ భీమవరం నగరానికి 'రెండవ బార్డోలీ' అనే బిరుదును ఇచ్చాడు.

pc:youtube

 

ప్రధాన వాణిజ్య రాజధాని

భీమవరం లో ప్రధాన ఆదాయవనరు వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. చేపలు/రొయ్యల చెరువులు ఈ పట్టణం పరిసరాలలో కానవస్తాయి. ఇవే ఈ పట్టణానికి ప్రధాన ఆదాయవనరు కూడా. దాదాపు చుట్టుప్రక్కల 150 -200 గ్రామాలకు భీమవరం ప్రధాన వాణిజ్య రాజధాని.

pc:youtube

 

నివాసానికి అనుకూలంగా

పట్టణంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, గుళ్ళు - గోపురాలు, పార్కులు ... ఎలా ఎన్నో సదుపాయాలూ ఉండి, నివాసానికి అనుకూలంగా ఉన్నది.

pc:youtube

 

ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో క్రీ.శ. 10 -11 వ శతాబ్దంలో నిర్మించారు.

pc:youtube

 

చోళ రాజులు

ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.

pc:youtube

 

శ్రీ రామలింగేశ్వరుడు

పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది.

pc:youtube

 

ఆదిశంకరాచార్యులవారు

శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు.

కాకినాడలో మీరు చూడని శివలింగం !

pc:youtube

 

సముద్ర తీర ప్రాంతాలు

ప్రకృతి అందాలను తన ఒడిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలు,విదేశీ పర్యాటకులకు ప్రకృతి అందాలతో ఆకర్షిస్తున్న సముద్ర తీర ప్రాంతాలు కాకినాడ, భీమవరం, పాలకొల్లు.ఇక్కడ ప్రజలు దాదాపుగా పర్యాటకరంగంపైన ఆధారపడి జీవిస్తారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

pc:youtube

 

పర్యావరణ నిపుణులు

మరి ప్రకృతి నిలయంగా మారిన అలాంటి ప్రదేశాలు మరో పదేళ్లల్లో సముద్రగర్భంలో కలసిపోనున్నాయా? అంటే అవుననే అంటున్నారు పర్యావరణ నిపుణులు. దీనికి కారణం ఏ గ్లోబల్ వార్మింగో,సముద్ర నీటి మట్టం పెరగటమో అనుకుంటే పొరపాటే.

pc:youtube

 

స్థానికులు

కాకినాడలో పాగావేసిన చమురు వెలికితీసే సంస్థల అడ్డగోలు త్రవ్వకాలే దీనికి ప్రధానకారణమని స్థానికులు చెపుతున్నారు. అడ్డగోలుగా సహజవాయువు నిక్షేపాలు త్రవ్వుకుని తీసుకుపోతూ వుండటంతో దాని ప్రభావం తనపై పడుతోందని, తమ జీవనాధారం కొంప, గూడు, గొడ్డు, గోడ మొత్తం అదృశ్యమయ్యే ప్రమాదం వుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

PC:Gopal vemu

 

చమురు నిక్షేపాలు

సముద్ర తీర ప్రాంతాలలో చమురు నిక్షేపాలు అధికంగా వుండటంతో చమురు నిక్షేపాల అవసరం కూడా ప్రజలకు అత్యవసరంగా మారడంతో తప్పనిసరి పరిస్థితులలోనైనా తవ్వకాలు జరపక తప్పటం లేదు.

pc:youtube

 

గోదావరి జిల్లాలు

విశాఖపట్నంలో ఏడాదికి 0.65 సెం.మీ లు సముద్రమట్టం పెరుగుతుండడంతో గత నాలుగైదేళ్ళల్లో తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఈ మూడు ప్రాంతాలు మాత్రం 5 అడుగులు భూమి లోనికి దిగబడిపోయాయని వారు చెపుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఏర్పాటుచేసిన కృష్ణాగోదావరి పరిరక్షణ సమితి ఈ విషయంపై తీవ్ర ఆందోళనం వ్యక్తం చేస్తోంది.


pc:youtube

 

జీవనోపాధి

రాజకీయ పార్టీలన్నీ కలిపి దీనిపై పోరాడితేనే ఇక్కడి ప్రజల మనుగడ వుంటుందని లేని పక్షంతో వివిధ ప్రాంతాలకు వలసపోయి జీవనోపాధిని వెతుక్కోవటమే అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

కాకినాడలో మీరు చూడని శివలింగం !

pc:youtube

 

English summary

Kakinada, Bhimavaram & Palakollu Will Vanish In 10 Years?

Kakinada, Bhimavaram & Palakollu Will Vanish In 10 Years?
Please Wait while comments are loading...