Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు.

By Venkatakarunasri

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.

ఓం నమో వేంకటేశాయ నమః

తిరుమల తిరుపతి,ఆ 7కొండల పేరువింటేనే భక్త జనం ఒళ్ళు పులకరిస్తుంది.భక్తి ఆవహిస్తుంది.శ్రీ మహావిష్ణువైన వేంకటేశ్వరుడైన ఆదిశేషుని ఏడు పడగలే,ఈ ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత వుందో ఆయన నివసించిన ఏడుకొండలకి కూడా అంతే ప్రాముఖ్యతవుంది.

పచ్చని లోయలు, జలపాతాలు,అపార ఔషదాలు, కోటితీర్ధాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులే ఈ శేషాచల కొండలు.తిరుమల వెంకన్నకు శేషాచల కొండలంటే చాలా ఇష్టం.ఈ ఏడు కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర వుంది.వైకుంటంలో అలిగివచ్చిన లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడు కొండలపై కొలువైవున్నాడని స్థలపురాణం చెబుతుంది.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

వైకుంటంలో నిత్యం శ్రీవారి చుట్టూ వుండే అనుచరులే నిత్యం భూలోకం వచ్చి ఏడుకొండలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన సప్తగిరి వాసుడైనాడు.నంది వృషభాద్రి అయ్యాడు. హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకొంటున్నాడు.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

స్వామివారికి తొలిసారిగా తల నీలాలు సమర్పించిన నీల నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవ చేస్తున్నాడు.ఇక నారాయణాద్రి,వెంకటాద్రులు స్వామివారి రూపాలే.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఈ రెండు కొండలు జయవిజయములకు ప్రతిరూపాలు అంటారు.అలాంటి చరిత్ర కలిగిన ఈ ఏడు కొండలు ఒకటి కాదు, వంద కాదు.ఏకంగా 150కోట్ల ఏళ్ల చరిత్రవుంది ఈ ఏడుకొండలకి.ఇలాంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్ర గిరుల్లో ఆ వెంకటేశ్వర స్వామి తిరుగుతున్నాడు అంటేతప్పక నమ్మాలి.ఇందుగలడు అందు లేడు అనే సందేహం లేకుండా ఎందెందు చూస్తే అందందే కనిపిస్తాడు ఆ కలియుగదైవం.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

శ్రీ వారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములుగా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకుల చే తెరువబడుతాయి.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయంలో అశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఇది శ్రీ వారి లీల మాత్రమే గాని మరియొకటి కాదు. ఈ పిల్లి (లేక పిల్లులు)సుమారుగా 100 సంవత్సరముల(ఈ గుడితో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు) నుండి శ్రీ వారి గర్భాలయంలో వున్నట్టు తెలుస్తోంది.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

మాములుగా రాత్రి శ్రీ వారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీ వారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఇది అనుచానంగా శ్రీ వారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలో నే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఈ పిల్లి శ్రీ వారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది.అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీ వారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

శ్రీ వారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా శ్రీ వారు మనుష్యులతో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారు!

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఎలా వెళ్ళాలి

రోడ్డు మార్గం

తిరుమల బస్టాండు

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషను. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టేషను‌కు వస్తాయి.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టేషను (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషను వెనకవైపు శ్రీ పద్మావతీ బస్‌స్టేషను ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

రైలు మార్గం

తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషను నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషను నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు.

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

విమాన మార్గం

తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X