Search
  • Follow NativePlanet
Share
» »కంబాలకొండ ఎకో టూరిజం పార్క్, వైజాగ్ !

కంబాలకొండ ఎకో టూరిజం పార్క్, వైజాగ్ !

"కంబాలకొండ" విశాఖ ప్రాంతానికి మునిమాణిక్యం వంటిది. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.

By Mohammad

కాంక్రీట్ జీవితం నుండి ఎటైనా వెళ్ళి హాయిగా గడపటానికి ప్రకృతితో సంబంధం ఉన్న ప్రదేశాలు దోహదపడతాయి. అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ .. అధిక చెట్ల సంపదను కలిగి ఉంటాయి. చెట్లు అధికంగా ఉంటె మరి అక్కడ పక్షులు కూడా అధికంగా ఉంటాయి కదా ! వాటిని చూస్తూ .. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ... మనసుకు హాయిని ఇచ్చే అటువంటి ప్రదేశాలను వెతుక్కొని మరీ వెళుతుంటారు పర్యాటకులు.

మరి అటువంటి ప్రదేశమే ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నది. అదెక్కడో కాదు వైజాగ్ లోనే ఉంది. ఆ ప్రకృతి ప్రదేశం "కంబాలకొండ". కంబాలకొండ వైజాగ్ సమీపంలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ ప్రాంతం ఎక్కువగా ఉష్ణమండల సతత హరితారణ్యాలు, పచ్చిక బయళ్ళు, లోయలు, కొండలు వంటి వాటితో కూడుకొని ఉన్నది.

అడవి అందాలు

అడవి అందాలు

చిత్రకృప : oneindia telugu

కంబాలకొండ వన్యప్రాణి కేంద్రం 1970 నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వరంలో నడుస్తుంది. అంతకు పూర్వం ఇది విజయనగరం రాజుల అధీనంలో ఉండేది. వారు ఈ ప్రాంతంలో వేట సాగించేవారట. ఇక్కడ చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం దీనిని ఒక ఎకో టూరిజం పార్క్ గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

అద్భుత ఆలయ సముదాయం - దేవిపురం !

ఎక్కడ ఉంది ?

జాతీయ రహదారి 5 మీద వైజాగ్ - శ్రీకాకుళం రహదారి పై, విశాఖకు ఉత్తరదిక్కున 20 కిలోమీటర్ల దూరంలో మరియు విజయనగరం జిల్లా పెందుర్తికి దగ్గరలో కంబాలకొండ వన్యప్రాణి కేంద్రం కలదు. కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ 71 చ.కి.మీ ల వైశాల్యంలో విస్తరించబడి ఉన్నది. అందులో 0.8 చ.కి.మీ ల స్యాంక్చురీని ఎకో టూరిజం ప్రాజెక్టు గా మార్క్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. గిరిజనుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టూరిజం స్పాట్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లేదా వైజాగ్ జూ కు అతి చేరువలో కలదు.

ఎకో టూరిజం ప్రవేశం

ఎకో టూరిజం ప్రవేశం

చిత్రకృప : oneindia telugu

కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గురించి ...

"కంబాలకొండ" విశాఖ ప్రాంతానికి మునిమాణిక్యం వంటిది. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ అటవీ ప్రాంతంలో 80 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన ఎకో టూరిజం ప్రదేశం పర్యాటకులకు అసలుసిసలైన అనుభూతిని అందిస్తూ ఉంది.

వర్షాకాలంలో వచ్చే నీటిని ఒక ట్యాంక్ లో స్టోర్ చేసి, అందులో బోటింగ్ కు అవకాశం కల్పిస్తారు. బోటింగ్ లో విహరిస్తూ అటవీ అందాలను, ఎలుగుబంట్లను చూస్తూ ఆనందించవచ్చు.

అడవి గుండా ప్రవహించే నది

అడవి గుండా ప్రవహించే నది

చిత్రకృప : oneindia telugu

ట్రెక్కింగ్

ఎకో టూరిజం పార్క్ లో రకరకాల ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుండి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ట్రెక్కింగ్ కొరకు ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఇందులో 10 మంది సభ్యులు ఉంటారు మరియు ఫీజు 150 రూపాయలు. లోకల్ గైడ్ గ్రూప్ కు సారధ్యం వహిస్తాడు. ట్రెక్కింగ్ కు ఒకరోజు ముందే రెసెప్షన్ వారు గ్రూప్ సభ్యులకు వివరాలు తెలియజేస్తారు.

నాట్యం చేస్తున్న మయూరం

నాట్యం చేస్తున్న మయూరం

చిత్రకృప : oneindia telugu

ఈ ప్రదేశంలో చేయవలసినవి

ఈ టూరిజం ప్రదేశంలో ఉన్న నెమళ్ళు, కుందేళ్లు, ఉడుతలు, పాలపిట్టల, అరుదుగా కనిపించే చిరుతలు లాంటివి పర్యాటకులు చూసి ఆనందించవచ్చు. అంతేకాక ఈ ప్రదేశంలో తనివితీరా ఆనందించాలనుకొనేవారికి రివర్ క్రాసింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశ రుసుము

ఎకో పార్క్ లోని ప్రవేశించాలనుకొనేవారు లోనికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. పెద్దవారికి రూ.10/-, పిల్లలకు రూ.5/- రూపాయలు టికెట్ ధరలు ఉంటాయి. వాహనాలను కూడా లోని అనుమతిస్తారు (రూ. 200/-).

వసతి కాటేజీలు

వసతి కాటేజీలు

చిత్రకృప : oneindia telugu

వసతి

ఎకో పార్క్ లో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రూ. 250/- అద్దెతో ఇక్కడి కాటేజీలలో వసతి సదుపాయాన్ని పొందవచ్చు. పార్క్ లో క్యాంటీన్ సదుపాయం కూడా కలదు.

సందర్శించు సమయం

కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 : 30 వరకు పర్యాటకులను అనుమతిస్తారు. సంవత్సరం పొడవునా పార్క్ ను తెరిచే ఉంచుతారు.

వారాంతంలో, సెలవు దినాలలో ... ముఖ్యంగా శీతాకాలంలో వైజాగ్ కు వచ్చే పర్యాటకులు మరియు స్థానికులు ఇక్కడికి వచ్చి జంగిల్ వాక్, సఫారీ వంటివి చేస్తూ అడవితల్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ గడుపుతారు.

అడవి అందాలను వీక్షించే వాచ్ టవర్

అడవి అందాలను వీక్షించే వాచ్ టవర్

చిత్రకృప : oneindia telugu

సంప్రదించు చిరునామా :

కంబాలకొండ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ, విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ : 530 001.
టెలిఫోన్ నెంబర్ : 0891- 6452143

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : స్యాంక్చురీ కి 20 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ విమానాశ్రయం కలదు. టాక్సీ లేదా బస్సులలో ప్రయాణించి స్యాంక్చురీ చేరుకోవచ్చు. వైజాగ్ చేరుకోవడం ఎలా ?

రైలు మార్గం : 10 కి.మీ ల దూరంలో వైజాగ్ రైల్వే స్టేషన్ కలదు. స్థానిక బస్సులలో ప్రయాణించి స్యాంక్చురీ చేరుకోవచ్చు.

రోడ్డు/ బస్సు మార్గం : వైల్డ్ లైఫ్ స్యాంక్చురీకి చక్కటి రోడ్డు మార్గం కలదు. 25 కి. మీ ల దూరంలో ఉన్న వైజాగ్ బస్ స్టాండ్ నుండి లోకల్, సిటీ బస్సులలో ప్రయాణించి పర్యాటకులు స్యాంక్చురీ వెళ్ళవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X