Search
  • Follow NativePlanet
Share
» »కాంచీపురం - దేవాలయాలు,పట్టు వైభవం !

కాంచీపురం - దేవాలయాలు,పట్టు వైభవం !

కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ కల పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. ఇక్కడ కల దేవాలయాలలో కొన్ని వేయి సంవత్సరాల నాటివి కూడా కలవు. ఇంతటి పురాతన చరిత్ర కల ఈ పట్టణం ఆధ్యాత్మికులకే కాదు చారిత్రకులకు, షాపింగ్ ప్రియులకు కూడా దర్శించ తగినదే. నాలగవ శతాబ్దం నాటి పల్లవుల నుండి తొమ్మిదవ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యం పాలకుల వరకు, బ్రిటిష్ రాజ్ తో సహా అందరు పాలకులూ కాంచీపురం పట్ల ఎంతో శ్రద్ధ చూపి దానిని కళాత్మకంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ కల స్థానికులు ఆ సంస్కృతి ని ఎప్పటికపుడు నిలుపు కుంటూ కన్చిపురానికి ఒక ప్రసిద్ధ నగరంగా కూడా పేరు తెచ్చారు.

ఆధ్యాత్మికంగా, విశిష్ట అద్వైతం బోధ్లించిన ప్రచారకులు కంచి పురం పట్టణం నుండి వచ్చిన వారే. ఈ వేదాంత పర స్కూల్ కంచి మాత నుండి పుట్టింది. ఇంతే కాక, ఇక్కడ అనేక కళాత్మక, మంచి శిల్ప శైలి కల టెంపుల్స్, ఆహ్లాద కర ప్రకృతి కూడా కంచి పట్టణానికి శోభను తెచ్చాయి.

కంఛి పురం దేవాలయాలు

కంఛి పురం దేవాలయాలు

ఎంతో పురాతన చారిత్రక విశిష్టత ల నుండి ఆధునిక కాల చరిత్రల వరకు ఈ పట్టణం విశిష్ట త కలిగి అక్కడ కల చిన్న, పెద్ద దేవాలయాలతో శోభిల్లు తోంది. వీటిలో కొన్ని దేవాలయాలను పరిశీలిద్దాం.

Photo Courtesy: seeveeaar

ఎకామ్బరేస్వర్ టెంపుల్

ఎకామ్బరేస్వర్ టెంపుల్

ఎకంబరేస్వర్ టెంపుల్ 1400 సంవత్సరాల పురాతనమైనది. ఇది పంచ భూత స్థలాలలో ఒకటి. ఈ టెంపుల్ కంచ్లిపురానికి ఉత్తరంగా వుంది. నగరంలో ఇది అతి పురాతనమైనది మరియు పెద్దది కూడాను. ఈ దేవాలయ గోపురం ఇండియాలోని అన్ని దేవాలయ గోపురాల కన్నీటి కంటే పొడవైనది.

కామాక్ష్లి అమ్మన్ టెంపుల్

కామాక్ష్లి అమ్మన్ టెంపుల్

కామాక్షి టెంపుల్ లో మాత పార్వతి రూపమైన కామాక్షి ప్రధాన దైవం. ఈ టెంపుల్ 6 వ శతాబ్దం నాటిది. మాత పద్మాసనం లో ఒక యోగ ముద్రలో కూర్చుని వుంటుంది. ఈ శక్తి పీతం జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారిచే స్థాపించబడినది.

Photo Courtesy: Satz007

వైకుంట పెరుమాళ్ టెంపుల్

వైకుంట పెరుమాళ్ టెంపుల్

వైకుంట పెరుమాళ్ టెంపుల్ ను పల్ల్వుల్ నిర్మించారు. చోళులు దీనిని అభివృద్ధి చేసారు. ఈ టెంపుల్ లో ప్రధాన దైవం విష్ణు మూర్తి. తమిల్ కాలెండర్ మేరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ లేదా జనవరి లలో వచ్చే వైకుంట ఏకాదశి పండుగ వేడుకలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. Photo Courtesy: Sridhar.selvaraj

కైలాష నాథర్ టెంపుల్

కైలాష నాథర్ టెంపుల్

కైలాష నాథర్ టెంపుల్ ను 7 వ శతాబ్దంలో నిర్మించారు. తమిళనాడులో ఈ టెంపుల్ అతి సుందరమైనది. వేదావతి ఒడ్డున కల ఈ టెంపుల్ ను పల్లవ రాజులూ, చాలావరకు సున్నం ఉపయోగించి నిర్మాణం చేసారు. ఎత్తైన గోడలు, విశాల ప్రాకారం అన్నీ ఎంతో ఆకర్షణీయంగా వుంది పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి.

Photo Courtesy: Keshav Mukund

వరదరాజ పెరుమాళ్ టెంపుల్

వరదరాజ పెరుమాళ్ టెంపుల్

విశిష్టా అద్వైత మతాన్ని ప్రచారం చేసిన వరద రాజ పేరుమల్ ఈ టెంపుల్ లో నివసించారని చెపుతారు. కనుక ఈ టెంపుల్ శ్రీ వైష్ణవ తెగ కు చెందినా వారికి చాలా ప్రాధాన్యత కలిగి వుంది.

Photo Courtesy: H. Grobe

కాంచీపురం లేదా కంజీవరం సిల్క్

కాంచీపురం లేదా కంజీవరం సిల్క్

ఇక్కడ కల టెంపుల్స్, శిల్ప శైలి మాత్రమే కాక ఇండియా లోనే అతి ఉత్తమమైన సిల్క్ ఉత్పత్తి కూడా కలదు. సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందటి కొంతమంది నేత పని వారు ఇక్కడకు వచ్చి ఈ పట్టు పరిశ్రమ స్థాపించి ఇక్కడే వారు స్థిరపడి, తార తరాలుగా తమ వృత్తి కొనసాగిస్తున్నారు. అద్భుతమైన నాణ్యత కల చీరలను, పట్టు వస్త్రాలను ఖచ్చితమైన బంగారు, మరియు వెండి దారాలతో తయారు చేస్తారు.

Photo Courtesy: Sudhamshu Hebbar

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

కాంచీపురం బెంగుళూరు కు 280 కి. మీ. ల దూరంలోను, చెన్నై కి 72 కి. మీ. ల దూరంలోను కలదు. రోడ్డు మార్గంలో ఈ పట్టణం అతి తేలికగా చేరవచ్చు.

photo kredit : Ashok Prabhakaran

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X