Search
  • Follow NativePlanet
Share
» »కాణిపాకం వినాయకుడి గుడి రహస్యం ఇదే .. !!

కాణిపాకం వినాయకుడి గుడి రహస్యం ఇదే .. !!

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు.

By Mohammad

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.

కాణిపాకం ఆ పేరెలా వచ్చింది ?

కాణిపాకం లో స్వామివారు స్వయంభూవునిగా వెలిశాడని చెప్పటానికి, ఊరి వెనక ఆ పేరు రావటానికి ఒక చరిత్ర ప్రచారంలో ఉంది. అదేమిటంటే అవిటితనం ఉన్న ముగ్గురు అన్నదమ్ములకు కాణిపాకంలో పొలం ఉండేది. ముగ్గురూ కలిసి ఆ పొలాన్ని సాగుచేసేవారు. నూతి నుండి నీరు తోడేవారు. కొన్నాళ్లకు ఆ నీరు ఇంకిపోయేసరికి గడ్డపారతో తవ్వటం మొదలుపెట్టారు. అలా తవ్వుతుండగా గడ్డపారకు ఒక రాతి తగిలి, అందులోంచి రక్తం రావటం మొదలయ్యింది. ఆ రాయి మహత్యంతో ముగ్గురికీ అవిటితనం పోగా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు.

ఇది కూడా చదవండి : ప్రపంచంలో ఇలాంటి శివాలయం వుందని తెలుసా ?

విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండోపతండాలుగా వచ్చి స్వయంభూ స్వామి వారికి కొబ్బరికాయల నీటితో అభిషేకించారు. ఆ కొబ్బరికాయల నీరు పొలంలో పావు ఎకరం ప్రవహించింది. దాంతో కానిపరకం అని పిలువసాగారు. అదే కాణిపాకం గా నేడు పిలువబడుతుంది. (కాణి - పావు ఎకరం మాగాణి భూమి, పారకం - నీళ్ళు పొలంలోకి పారటం అని అర్థం)

స్వామి వినాయకుడు

స్వామి వినాయకుడు

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు.

చిత్రకృప : Adityamadhav83

స్వామివారు పెరగటానికి నిదర్శనాలు

స్వామివారు పెరగటానికి నిదర్శనాలు

స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

నీటిలో మునిగి ఉంటుంది

నీటిలో మునిగి ఉంటుంది

స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

చిత్రకృప : Murali Reddy

కాణిపాకం లో ప్రయాణం చేస్తావా?

కాణిపాకం లో ప్రయాణం చేస్తావా?

సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.

చిత్రకృప : Dareavii

మరకతాంబిక సమేత మణికంఠేశ్వర దేవాలయం

మరకతాంబిక సమేత మణికంఠేశ్వర దేవాలయం

శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం వుంది. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక నాగుపాము తిరుగుతూ వుంటుంది. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగ పై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించారు.

చిత్రకృప : Adityamadhav83

వరదరాజ స్వామి ఆలయం

వరదరాజ స్వామి ఆలయం

స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

చిత్రకృప : Adityamadhav83

ఆలయ దర్శన వేళలు

ఆలయ దర్శన వేళలు

కాణిపాకం ఆలయ దర్శన వేళలు : ఉదయం 4:00 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి 9:30 గంటలకు ఏకాంతసేవ తో మోసేస్తారు.

చిత్రకృప : Adityamadhav83

వసతి

వసతి

కాణిపాకం దేవస్థానం - 6 రూములు
తిరుమల తిరుపతి దేవస్థానం - 14 రూములు

100 రూముల ఏర్పాటు నిర్మాణ దశలో ఉన్నది.

చిత్రకృప : Adityamadhav83

రవాణా సౌకర్యాలు

రవాణా సౌకర్యాలు

బస్సు సౌకర్యములు

తిరుపతి నుండి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.

రైలు సౌకర్యములు

ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు
ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.

విమాన సౌకర్యములు

తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.

చిత్రకృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X