Search
  • Follow NativePlanet
Share
» »కార్గిల్ విజయ్ దివాస్ : భారత సైన్యాన్ని గుర్తుకుతెచ్చుకొనే రోజు |

కార్గిల్ విజయ్ దివాస్ : భారత సైన్యాన్ని గుర్తుకుతెచ్చుకొనే రోజు |

By Mohammad

కార్గిల్ యుద్ధం జరిగి నేటికీ 17 ఏళ్ళు. 1999 జులై 26 న కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జులై 26ను 'కార్గిల్ విజయ్ దివాస్‌' గా జరుపుకోవడం జరుగుతోంది. భారత సైనికుల త్యాగాలను, సాహసాలను, వీరత్వాన్ని, ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తుకు తెచ్చుకుంటూ భారత ప్రభుత్వం మరియు భారత సైనిక దళం ఆ రోజున (జులై 26 న) వారికి అంజలి ఘటిస్తుంది.

కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది ?

అది 1999 వ సంవత్సరం, మే 8. పాకిస్థాన్ సైనికులు మరియు కాశ్మీర్ తీవ్రవాదులు వాస్తవాధీన రేఖ ను దాటి భారతదేశంలో అడుగుపెట్టిన యుద్దానికి కాలుదువ్వింది. దీంతో భారత్ యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. ఈ యుద్ధం సుమారు మూడు నెలలపాటు సాగింది. 1999, జులై 4న 11 గంటలపాటు సుదీర్ఘ యుద్ధం చేసిన అనంతరం భారత్ తిరిగి టైగర్‌హిల్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలిగింది.

సియాచిన్ లో రెపరెపలాడుతున్న భారత మువ్వెన్నల జెండా

సియాచిన్ లో రెపరెపలాడుతున్న భారత మువ్వెన్నల జెండా

చిత్ర కృప : Sanjay Wadhwani

కార్గిల్ ప్రాముఖ్యం ఏమిటి?

కార్గిల్ లడఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడఖ్ ప్రాంతం భారత్ చేజారుతుంది. సియాచిన్ గ్లేసియర్ కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

కార్గిల్ యుద్ధం ప్రత్యేకత ఏమిటి?

కార్గిల్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తు మీద జరిగిన యుద్ధం. పూర్తిగా మంచు కొండల్లో జరిగిన హిమ యుద్ధం. శత్రువు కొండ మీద పాతుకుపోయి ఉన్నాడు. మన సైన్యం కింద ఉంది. కింద నుంచి పైకి ఎగబాకి యుద్ధం చేయడం చాలా క్లిష్టమైనది. ఆ యుద్ధంలో మనం ఘన విజయం సాధించాం. అదీ దీని ప్రత్యేకత. నెల రోజుల పోరాటంలో టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా కొండ కొనలపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి పాకిస్తాన్ ను తరిమికొట్టాం.

అమర వీరుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుంటూ ..

అమర వీరుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకుంటూ ..

చిత్ర కృప : imran_nissar

వార్ మెమోరియల్, ద్రాస్

శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారి 1డి తోలోలింగ్ హిల్స్ పాదాల వద్ద ఏర్పాటు చేసిన ద్రాస్ వార్ మెమోరియల్‌ను విజయ్‌పథ్ అని కూడా పిలుస్తారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికుల గౌరవసూచకంగా ఈ మెమోరియల్‌ను నిర్మించడం జరిగింది.

ఇది కూడా చదవండి : ద్రాస్ - ప్రపంచంలోనే రెండవ శీతల ప్రదేశం !

వార్ మెమోరియల్

వార్ మెమోరియల్. ద్రాస్

చిత్ర కృప : Daily Excelsior

బింబట్ యుద్ధ స్మృతి చిహ్నం అని కూడా పిలవబడే ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం ద్రాస్ పట్టణ ప్రధాన ఆకర్షణ. నగర కేంద్ర భాగానికి "టైగర్ హిల్" కి మీదుగా 5 కి. మీ దూరంలో ఉన్న స్మృతి చిహ్నం, కార్గిల్ యుద్ధ అమరవీరులను జ్ఞప్తికి తెస్తుంది. స్మృతి చిహ్నం గోడపై చెక్కబడి ఉన్న, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లను సందర్శకులు చదవవచ్చు.

అమర్ జ్యోతి, ద్రాస్

భారత సైనికుల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అమర్ జ్యోతి జవాన్ నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సైనికులే దీని నిర్వహణ చూస్తారు. కార్గిల్ విజయ్ దివాస్ రోజున భారత సైన్యం, రక్షణ మంత్రి ఘన నివాళి అర్పిస్తారు.

ఇండియా గేట్ వద్ద

ఇండియా గేట్ వద్ద

చిత్ర కృప : Parag Sharma

ఇండియా గేట్, న్యూఢిల్లీ

కార్గిల్ అమరవీరులను గుర్తుకుతెచ్చుకుంటూ భారత ప్రభుత్వం నివాళులు అర్పించే ప్రదేశం ఇండియా గేట్. భారత రాష్ట్రపతి, దేశ ప్రధాని, రక్షణ మంత్రి, ఇతర రాజకీయ ప్రముఖులు, త్రివిధ దళాల అధికారులు మరియు భారత ప్రజలు ఇక్కడికి వచ్చి వారికి ఘన నివాళి అర్పిస్తారు. యుద్ధంలో సాహసోపేత పోరాటం చేసి అశువులు బాసిన సైన్యాన్ని గుర్తుకుతెచ్చుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X