Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తరప్రదేశ్ లోని భయంకరమైన ఖర్కోడ కోట

ఉత్తరప్రదేశ్ లోని భయంకరమైన ఖర్కోడ కోట

ఈ కోట ఎంత భయంకరంగా కనిపిస్తుందో ఇలాంటి కోటలు ఈ నిర్మాణశైలి ఎక్కువగా మన ఉత్తరభారతదేశంలోనే కనిపిస్తాయి. అలాగే ఈ కోట గూడా ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీకి 70కి.మీ ల దూరంలో వున్న ఖర్కోడ కోట ఇది.

By Venkatakarunasri

ఈ కోట ఎంత భయంకరంగా కనిపిస్తుందో ఇలాంటి కోటలు ఈ నిర్మాణశైలి ఎక్కువగా మన ఉత్తరభారతదేశంలోనే కనిపిస్తాయి. అలాగే ఈ కోట గూడా ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీకి 70కి.మీ ల దూరంలో వున్న ఖర్కోడ కోట ఇది.ఇది చాలా పురాతనమైన కోట.

ఈ కోట గురించి మిస్టరీగా జనాలు ఏం చెప్పుకుంటున్నారంటే ఈ కోట లోకి వెళ్ళేవారు తిరిగిరారని ఆ కోట లోపలే ఎవరికీ తెలీకుండా మాయమయిపోతున్నారని ఒక మిస్టరీగా చెప్పుకుంటున్నారు.

అసలీ కోటెంటీ?దీని యొక్క రహస్యాలేంటో ఒకసారి చూద్దాం.

మనదేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాలు పురాతన కట్టడాలలో, కోటల్లో, ఎన్నో మిస్టరీస్ వుంటాయి. అవి కొన్ని సార్లు తెలుస్తుంటే,కొన్ని సార్లు చాలామందికి తెలీని మిస్టరీలు ఎన్నో వుంటాయి. అందులోని రహస్యాలను కొంతమంది ఛేదిస్తే, ఇంకొన్ని మిస్టరీస్ ఎవ్వరు చెప్పలేని స్థితిలో వుంటాయి.

అలాంటి మిస్టరీస్ గురించి తెలుసుకోవాలంటే చాలామందికి ఇంటరెస్ట్ వుంటుంది. అలాంటి మిస్టరీస్ లో ఒకటే ఈ కోట. ఈ కోటలోకి వెళ్ళిన వారు మాయమయిపోతూ వున్నారట. తిరిగిమాత్రం రావట్లేదట.అసలాకోటలో లోపల ఏముందో ఆ అంతుచిక్కని రహస్యమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు.

ఆ కోటలోకి వెళ్ళేవారు మాయం అవుతారు ఖర్కోడ కోట రహస్యం

 కోట ఎక్కడ వుంది?

కోట ఎక్కడ వుంది?

ఈ పురాతన కోట ఉత్తరప్రదేశ్ లో వుంది.

PC:youtube

ఈ కోటను ఏమని పిలుస్తారు?

ఈ కోటను ఏమని పిలుస్తారు?

దీనికుండే పేరు గూడా భయంకరంగా ఖర్కోడ అనే పేరుతో ఈ కోటను పిలుస్తుంటారు.

PC:youtube

కోట రహస్యం

కోట రహస్యం

ఈ కోటలో ఎవరికీ తెలీని ఏదో రహస్యం వుందని ఆ రహస్యం కనిపెట్టడానికి ప్రయత్నం కూడా ఎవరూ ఎక్కువగా చేయటంలేదు.

PC:youtube

 కోటలోకి వెళ్ళినవారు ఏమైపోతున్నారు?

కోటలోకి వెళ్ళినవారు ఏమైపోతున్నారు?

ఎందుకంటే ఈ కోట యొక్క రహస్యం తెలుసుకోవటానికి అందులోకి వెళ్ళేవారు కూడా తిరిగి రాకుండా మాయమైపోతున్నారంట.

PC:youtube

కోట యొక్క స్పెషాలిటీ

కోట యొక్క స్పెషాలిటీ

కోట ఈ కోట యొక్క స్పెషాలిటీ ఏంటంటే భూమి పైనే కనిపిస్తుంది.కానీ ఈ కోట నుంచి 2 అంతస్తులు మాత్రం భూమి అంతర్భాగంలోకి వుంటాయి.

PC:youtube

చాలా రహస్యంగా నిర్మించిన కోట

చాలా రహస్యంగా నిర్మించిన కోట

ఈ రోజుల్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్ కి ఏవిధంగానైతే అపార్ట్మెంట్స్ క్రింద ప్లేసెస్ ని అలాట్ చేస్తున్నారో అంత పురాతనమైన రోజుల్లో కూడా భూమి క్రింద 2 అంతస్థుల భావనాలని చాలా రహస్యంగా ఆ రోజుల్లోనే నిర్మించారంట.

PC:youtube

నిధినిక్షేపాలు కలిగిన కోట

నిధినిక్షేపాలు కలిగిన కోట

ఈ అంతర్భాగంలో వుండే ఈ రెండంతస్థుల్లో వుండే రూముల్లో కొన్ని గోడలలోపల ఎన్నో వజ్రాలు, బంగారం, నిధినిక్షేపాలు గూడా వున్నాయని,ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో వుండే కొంతమంది ప్రజలు బలంగా నమ్ముతున్నారుకూడా.

PC:youtube

పెళ్లిబృందం ఏమైనారు?

పెళ్లిబృందం ఏమైనారు?

కానీ ఎవరుకూడా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ధైర్యాన్ని ప్రదర్శించుటలేదు. కొన్ని నెలలముందు పెళ్లి చేసుకొని వస్తున్న పెళ్లిబృందం మొత్తం ఈ కోట బాగుందని దీంట్లోపలికి వెళ్లి ఫోటోలు తీసుకుందామని ఆ బృందమంతా లోపలికి వెళ్లి తిరిగిరాకుండా మాయమయిపోయారంట.

PC:youtube

చుట్టుప్రక్కల గ్రామస్థులు చెప్పినావినకుండా

చుట్టుప్రక్కల గ్రామస్థులు చెప్పినావినకుండా

ఆ విధంగా పెళ్లి బృందం ఈ కోటను బయటనుండి చూసి ఎంతో ముచ్చటపడి ఆ చుట్టుప్రక్కల గ్రామస్థులు చెపుతున్నా వినకుండా ఆ కోటలోపలకి వెళ్లి ఆ కోట అంతర్భాగంలో వున్న రెండో అంతస్తులోపలికి వెళ్ళారంట. ఆ తర్వాత నుంచి వాళ్ళెవరూ కనిపించలేదట.

PC:youtube

ఎవరూ చెప్పలేని రహస్యం

ఎవరూ చెప్పలేని రహస్యం

వాళ్ళందరూ సుమారుగా 60మంది దాకా వున్నారట.వాళ్ళందరూ సుమారు 60 మంది వరకూ ఒకే గుంపుగా వుండికూడా అంతర్భాగంలో వుండే ఆ రెండో అంతస్తులోకి ఎందుకు వెళ్ళారో?వెళ్లి ఏవిధంగా మాయమైపోయారో ఎవరూచెప్పలేకపోతున్నారు.

PC:youtube

కోట యొక్క మిస్టరీ ఏంటి?

కోట యొక్క మిస్టరీ ఏంటి?

ఆ తర్వాత కూడా ఇలాటి సంఘటనలు చాలా ఆ కోటలో జరిగాయంట.ఒకరో ఇద్దరో అయితే పరవాలేదు.ఆ విధంగా గుంపుగా వెళ్ళిన పెళ్లి బృందమంతా మాయమైపోవడం వల్ల,వాళ్ళ అందరి ఆచూకి కూడా ఇప్పటి వరకు తెలీకపోవటం వల్ల ఆ కోట గురించి దాని మిస్టరీ గురించి అక్కడ వుండే వాళ్ళు నిజంగానే నమ్మి ఆ కోట లోపలి అప్పటినుంచి ఎవ్వరువెళ్ళకుండా ఆ కోటకి వుండే ఆ పురాతన ద్వారాలన్నీ మూసివేసారంట.

PC:youtube

కోట ద్వారాలను ఎందుకు మూసివేసారు?

కోట ద్వారాలను ఎందుకు మూసివేసారు?

ఈ కోటని మూసివేయటానికి ముందు ఈ కోట యొక్క అండర్ గ్రౌండ్ లో వుండే ఆ 2 అంతస్తులలోకి వెళ్ళే అన్ని ద్వారాలని కూడా పగడ్బందీగా మూసివేసి అక్కడ వుండే వాళ్ళు తాళాలు వేసారంట. ఆ తర్వాతా ఈ కోటకు బయట వుండే పెద్ద ద్వారాలని కూడా మొత్తం క్లోజ్ చేసేసారంట.

PC:youtube

కోట ఇప్పటిది కాదు

కోట ఇప్పటిది కాదు

ఈ కోట ఇప్పటిది కాదు.సుమారు 12 వ శతాబ్దంలో నిర్మించిందంట. ఈ కోటకి భూమి నుంచి పైకి 3 అంతస్థులు వుంటే మిగతా రెండంతస్థులు భూమి యొక్క అంతర్భాగంలో సీక్రెట్ గా ఆ రోజుల్లో నిర్మించారంట.

PC:youtube

ఈ కోటని ఎవరు నిర్మించారు?

ఈ కోటని ఎవరు నిర్మించారు?

ఈ కోటని ఎవరు నిర్మించారనేదానికి ఖచ్చితమైన ఆధారాలు గానీ,శిలా శాసనాలు గానీ,ఋజువులు గానీ అక్కడ ఇప్పటికి కూడా ఎవరికీ లభించలేదు.

PC:youtube

కోట లోపల ఎలా వుంటుంది?

కోట లోపల ఎలా వుంటుంది?

ఈ కోట సుమారుగా 1500 నుంచి 200 సంల పురాతనమైనదిగా భావిస్తారు. ఈ కోట బయట నుండి చూస్తే ఒకవిధంగా వుంటుంది గానీ లోపలికి వెళ్లి చూస్తే ఎటువంటి వెలుగు కూడా లేకుండా చాలా భయంకరంగా కన్పిస్తుందంట.

PC:youtube

బయటవాళ్ళకి తెలియకుండా ఉంచినది ఏమిటి?

బయటవాళ్ళకి తెలియకుండా ఉంచినది ఏమిటి?

ఈ కోట యొక్క అడుగుభాగంలో 2వ అంతస్థులో ఆ నిధుల కోసం ప్రయత్నించి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారట.ఆ విషయాలు కొన్ని బయటకు వస్తే కొన్ని బయటవాళ్ళకి తెలీకుండానే వుంచారట.

PC:youtube

మామూలు కోటలాగే కనిపించే ఈ కోట

మామూలు కోటలాగే కనిపించే ఈ కోట

మామూలు కోటలు కనిపించేటట్లే ఈ కోట భూమి పై నుండి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.కానీ దగ్గరకు వెళ్ళేకొలది కోట ఆ ప్రదేశంలో కనిపించకుండా మాయమైపోతుందంట.

PC:youtube

కోటను ఎలాంటి టెక్నాలజీతో నిర్మించారు?

కోటను ఎలాంటి టెక్నాలజీతో నిర్మించారు?

అంటే ఆ రోజుల్లో వుండే టెక్నాలజీ ప్రకారం కోట దూరం నుండి చూసే వారికి కోట కనిపిస్తుంది గానీ దగ్గరగా వెళ్లేవారికి కోట ఆ ప్రదేశంలో కాకుండా ఇంకొక ప్రాంతంలో వుండేటట్లు కోటకి వెళ్ళే దారిని ఆ రోజుల్లోనే నిర్మించారని కొందరు చెప్తూవుంటారు.

PC:youtube

అద్భుతమైన కోట

అద్భుతమైన కోట

ఎందుకంటే ఆ రోజుల్లో ఇతర శత్రువుల యొక్క దండయాత్రల నుంచి కాపాడుకోవటానికి ఆ కోటని ఆ రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించి నిర్మించివుంటారని ఇదో అద్భుతంగా కూడా చాలామంది చెప్పుకుంటూ వుంటారు.

PC:youtube

ఎలా కన్పిస్తుంది?

ఎలా కన్పిస్తుంది?

మనమెప్పుడు కూడా ఎడారుల్లోగానీ,రోడ్డుపైగానీ,మండుటెండల్లోకానీ చూస్తే మనకు కొంచెం దూరంలో నీరు వుండేటట్లు కనిపిస్తుంది. కానీ మనం దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఎటువంటి నీరుగానీ, చెరువులు గానీ కనిపించవు.

PC:youtube

శత్రువుల బారి నుండి రక్షణ

శత్రువుల బారి నుండి రక్షణ

ఇది మన చుట్టూ వుండే వాతావరణంలో భూమి పైనుండే కొన్ని మార్పుల వలన మన కళ్ళకి అలాంటి భ్రమ వస్తుంది. అదేవిధంగా అదే టెక్నాలజీ ని వుపయోగించి ఆ రోజుల్లో ఈ కోటని శత్రువుల బారి నుండి రక్షించుకోవటానికి ఈ విధంగా నిర్మించారని కొంతమంది చెప్తూవున్నారు.

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి లక్నో మీదుగా రోడ్డు మార్గం ద్వారా 27గంటలు పడుతుంది. విమానంలోనైతే 2గంటలు పడుతుంది.

హైదరాబాద్ నుండి జైపూర్ మీదుగా 29గం లు పడుతుంది.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X