Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక రుతుపవనాలు - స్వాగత చిరు జల్లులు

కర్నాటక రుతుపవనాలు - స్వాగత చిరు జల్లులు

కర్నాటక రాష్ట్రం అక్కడ కల ప్రదేశాలకు పర్యాటకులను వివిధ రీతులలో స్వాగతిస్తూనే వుంటుంది. పర్యాట కుడి ఇష్టం ఏమైనా కానీ ఇక్కడ అతడి కోరికలు తీర్చే ప్రదేశాలు అన్ని కాలాలలోనూ సిద్ధంగా వుంటాయి.

కర్ణాటకలోని ఏ పర్యాటక ప్రదేశం కూడా ఎవరినీ అసంతృప్తి పరచేది కాదు. కొన్ని ప్రదేశాల పట్ల చాలామందికి పూర్తిగా అంచనా లేకపోవచ్చు. కానీ ఈ ప్రదేశాలలో వెలికి తీయవలసిన అన్వేషణలు అనేకం కలవు.

మైసూరు హోటల్ వసతులకు క్లిక్ చేయండి

సకలేశ్ పూర్

సకలేశ్ పూర్

సకలేశ్ పూర్ అందమైన ఒక చిన్న హిల్ స్టేషన్. ఈ కాలంలో పడమట కనుమల లో కల ఈ హిల్ స్టేషన్ మీకు ఎంతో తాజా అనుభూతులు కలిగిస్తుంది. ఇది అందమైన హస్సన్ జిల్లాలో ఒక భాగం. ఇక్కడ కాఫీ, సుగంధ ద్రయాల తోటలు అధికంగా కలవు. సకలేశ్ పూర్ లో పుష్కల మైన జీవ వైవిధ్యత కలదు. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం వాలే వుంటుంది. బిస్లె రేసేర్వ్ ఫారెస్ట్ ట్రెక్ , కుమార పర్వత ట్రెక్ ఇక్కడి జీవ వై విద్యత ప్రదర్శనలో తప్పక చూడ దగినవి.

ఓం బీచ్

ఓం బీచ్

గోకర్ణ ప్రాంతంలో కల ఓం బీచ్ చాలా ప్రసిద్ధి. ఈ బీచ్ హిందువుల ఆధ్యాత్మిక గుర్తు అయిన 'ఓం' ఆకారంలో వుండటంచే దీనికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ పర్యాటకులు స్కై ఇంగ, సర్ఫింగ్, బననా బోటు రైడ్ వంటివి ఆనందించవచ్చు. కొత్తగా నీటి క్రీడలు అదే వారికి శిక్షలు కూడా వుంటారు. Photo Courtesy: Prem Shikhare

గుల్బర్గా

గుల్బర్గా

గుల్బర్గా కర్నాటక లో ఒక జ్లిల్లా. ఇక్కడ కల శరణ బసవేశ్వర దేవాలయం హిందువుల కు ఎంతో ప్రసిద్ధి. ఈ దేవాలయం గుల్బర్గా నగర నడిబొడ్డున కలదు. గుల్బర్గా లోని పురాతన కోట శిధిలం అవుతున్నప్పటికీ దానిలోని అనేక భాగాలు ఆకర్షణీయంగా ఉండి ఆసక్తి కలిగిస్తాయి. ప్రసిద్ధి చెందినా జామా మసీద్ సందర్సన ముస్లిం మతస్తులకు పరమ పవిత్రం.

Photo Courtesy: Matteo

పట్టదక్కల్

పట్టదక్కల్

పట్టదక్కల్ పర్యటన మనలను ఒక్కసారి పురాతన కాల చాళుక్యుల వైభవ పాలనకు తీసుకు వెళుతుంది. పట్టదక్కల్ పట్టణం కర్ణాటక లోని బాగల్ కోట్ జిల్లాలో కల మలప్రభ నది ఒడ్డున కలదు. ఈ పట్టణం అక్కడ కల తొమ్మిది హిందూ టెంపుల్స్ కు ప్రసిద్ధి. ఇక్కడ ఒక జైన్ సాన్క్చురి కూడా కలదు. అందమైన ఈ ప్రదేశానికి యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు నిచ్చింది.

Photo Courtesy: Manjunath nikt

చెన్నపట్న

చెన్నపట్న

చెన్నపట్న బెంగుళూరు కు నైరుతి దిశా లో 60 కి. మీ. ల దూరంలో కలదు. ఈ పట్నం ఇక్కడ తయారు అయ్యే కొయ్య బొమ్మలకు లక్క వస్తువులకు ప్రసిద్ధి. బెంగుళూరు - మైసూరు హై వే లో రామానగర జిల్లాలో ఈ ప్రదేశం కలదు. టూరిస్ట్ లు అందమైన కొయ్య బొమ్మలు, ఇతర కళాకృతులు ఇక్కడ కొనుగోలుకు ఇష్టపడతారు.

Photo Courtesy: Shuba

మెల్కోటే

మెల్కోటే

మెల్కోటే గురించి చాలా మందికి తెలియదు. ఇది బెంగుళూరు - మైసూరు రహదారిలో కలదు. ఇక్కడ అనేక అనేక దేవాలయాలు కలవు. వాటిలో రెండు దేవాలయాలు చాల అందమైనవి. అవి ఒకటి యోగనారసింహ కాగా మరొకటి చేలువనరాయన స్వామి దేవాలయం. పట్టణం లో ఇంకనూ ఇతర గుడులు, పవిత్ర కొలనులు కూడా కలవు.

Photo Courtesy: Pradeep Kumbhashi

మైసూరు పర్యాటక ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X