Search
  • Follow NativePlanet
Share
» » కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !

కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !

కేదార్ నాద్ ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం హిమాలయాల ఒడి లో హిందువులకు ఒక ప్రసిద్ధ, పవిత్ర యాత్రా స్థలంగా కూడా పేరు గాంచినది. వేసవి కాలంలో అనేక మంది హిందూ యాత్రికులు కేదార్ నాద్ సందర్శించి శివ భగవానుడి ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ కల కేదార్ నాద్ టెంపుల్ సుమారు వేయి సంవత్సరాల కిందట నిర్మించిన ఒక రాతి నిర్మాణం.

సముద్ర మట్టానికి సుమారు 3,584 మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం చేరటం, అక్కడ కల అన్ని చార్ ధాం లు సందర్శించటం అతి కష్టంగా వుంటుంది. కేదార్ నాద్ లో మీరు ఇంకనూ చూడవలసిన ఆకర్షణలు, అగస్త్య ముని, భైరవ్ నాథ్ టెంపుల్, చోరా భారి తాల్, గౌరీ కుండ్, కేదార్ మాసిఫ్, మందాకినీ నది, శంకరాచార్య సమాధి, వాసుకి సరస్సు వంటివి ఎన్నో కలవు.

కేదార్ నాద్ ఎలా చేరాలి ?

కేదార్ నాద్ ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం

కేదార్ నాద్ కు 239 కి. మీ. ల దూరంలో కల డెహ్రాడూన్ లో జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ దీనికి సమీప ఎయిర్ పోర్ట్. ఇక్కడ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు కలవు.

ట్రైన్ ప్రయాణం
కేదార్ నాద్ కు 221 కి. మీ. ల దూరంలో సమీప రైలు స్టేషన్ రిషి కేష్ లో కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.

రోడ్డు ప్రయాణం
కేదార్ నాద్ కు రోడు మార్గం కూడా కలదు. బస్సు లేదా జీప్ లలో ప్రయాణించవచ్చు. అయితే, రోడ్డు మార్గం సరిగా ఉండక ప్రయాణం కష్టతరం అవుతుంది. కాలి నడకన సుమారు 14 కి. మీ. లు నడక సాగించాలి.

Photo Courtesy: ASIM CHAUDHURI

కేదార్ నాద్ టెంపుల్

కేదార్ నాద్ టెంపుల్

కేదార్ నాద్ లో ప్రముఖంగా చూడవలసిన ప్రదేశం కేదార్ నాద్ దేవాలయం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు, ఇక్కడే ఒక నంది విగ్రహం కూడా దేవాలయం వెలుపలి భాగంలో చూడవచ్చు. ఈ దేవాలయం సుమారు 1000 సంవత్సరాల కిందటి దిగా చెపుతారు.

Photo Courtesy: Shaq774

అగస్త్య ముని

అగస్త్య ముని

సముద్ర మట్టానికి సుమారు 1000 మీ. ల ఎత్తులో మందాకినీ నది ఒడ్డున కల అగస్త్య ముని కేదార్ నాద్ లో మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది అగస్త్య ముని జన్మస్థలం గా భావిస్తారు. శివ భగవానుడి విగ్రహం కల అగస్తేశ్వర్ మహాదేవ దేవాలయం ఇక్కడ కలదు. ఇక్కడి రాతి గోడలపై చెక్కిన ఇతర హిందూ దేవతలను కూడా చూడవచ్చు.

Photo Courtesy: Kumar Chitrang

భైరవ్ నాద్ టెంపుల్

భైరవ్ నాద్ టెంపుల్

భైరవ్ నాద్ దేవాలయం కేదార్ నాద్ లో మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనిలో భైరవ విగ్రహం కలదు. ఇతడిని ఆత్మల యొక్క దేవుడు అని కూడా చెపుతారు. శివ రాత్రి సమయంలో ఇక్కడకు అనేక ఆత్మలు వస్తాయని ప్రతీతి. ఈ ప్రదేశంలో హిందీ చలన చిత్రం యే జవాని హాయ్ దివానీ షూట్ చేసారు.
Photo Courtesy: Kumar Chitrang

చోరాబారి సరస్సు

చోరాబారి సరస్సు

సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం నుండి అనేక అందమైన హిమాలయ శిఖరాలు చూడవచ్చు. ఈ సరస్సును గాంధి సరోవర్ అని కూడా అంటారు. దీనిలో మహాత్మ గాంధి అస్థికలు నిమజ్జనం చేసారు. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు.

Photo Courtesy: Kumar Chitrang

గౌరీ కుండ్

గౌరీ కుండ్

కేదార్ నాద్ లో గౌరీ కుండ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. కేదార్ నాద్ కు ట్రెక్కింగ్ లో వెళ్ళాలంటే, ఇది బేస్ ప్రదేశం. ఇక్కడ పార్వతి మాత దేవాలయం పురాతనమైనది ఒకటి కలదు. ఈ గౌరీ కుండ్ లో కల నీటిలో ఔషధ గుణాలు కలవని, స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని యాత్రికులు భావిస్తారు. Photo Courtesy: Kumar Chitrang

గుప్త కాశి

గుప్త కాశి

కేదార్ నాద్ లోని గుప్త కాశి లో విశ్వనాధ్ టెంపుల్, మనికర్నిక సరస్సు మరియు, శివ భగవానుడి విగ్రహం కల ఒక అర్ధ నారీశ్వర దేవాలయం కలవు. తమ పాపం ప్రక్షాళనం చేయమని వేడుకుంటూ యాత్రికులు ఈ దేవాలయానికి వస్తారు.
Photo Courtesy: Kumar Chitrang

కేదార్ మాసిఫ్

కేదార్ మాసిఫ్

కేదార్ నాద్ లోని కేదార్ మాసిఫ్ ఒక ప్రకృతి దృశ్యాల ప్రదేశం. ఇక్కడ మూడు పర్వతాలు, కేదార్ నాద్, కేదార్ డోమ్ మరియు భారత కుంట అనేవి కలవు. ఇది సముద్ర మట్టానికి సుమారు 6,000 మీ. ల ఎత్తున కలదు. ఇది ఒక అద్భుత ట్రెక్కింగ్ ప్రదేశం. పైకి ట్రెక్కింగ్ చేసే సమయంలో ఆక్సిజన్ అందటం కష్టంగా కూడా వుంటుంది. ఇక్కడ ఈ మేరకు హెచ్చరికలు కూడా చేస్తారు. Photo Courtesy: Paul Hamilton

మందాకినీ నది

మందాకినీ నది

మందాకినీ నది అలకనందా నది యొక్క ఉప నది. సోనా ప్రయాగ్ వద్ద ఈ నది వాసుకి గంగ నదిలో కలుస్తుంది. అలకానంద నది రుద్రా ప్రయాగ్ వద్ద మరియు భాగీరథి నది దేవ ప్రయాగ్ వద్ద కలసి పవిత్ర గంగా నది గా ఏర్పడ్డాయి. ఇది ఒక ప్రసిద్ధ నీటి క్రీడల కేంద్రం గా ఎంతో మంది అనేక రకాల నీటి క్రీడలు ఆనందిస్తారు.

Photo Courtesy: Kumar Chitrang

శంకరాచార్య సమాధి

శంకరాచార్య సమాధి

కేదార్ నాద్ టెంపుల్ సమీపంలో ఆది గురువు శంకరాచార్య సమాధి కలదు. ఈ ప్రాంతంలో యాత్రికులు ఒక వేడి నీటి బుగ్గ కనుగొనవచ్చు. ఈ వేడి నీటి బుగ్గను శంకరా చార్యుల వారు తన శిష్యుల కొరకు సృష్టించాడని భావిస్తారు.

Photo Courtesy: Priyanath

వాసుకి సరస్సు

వాసుకి సరస్సు

సముద్ర మట్టానికి సుమారు 4,135 మీ. ల ఎత్తున కల వాసుకి సరస్సు మరొక పర్యాటక ఆకర్షణ. ప్రకృతి ప్రియులు ఇక్కడ అనేక సుదర దృశ్యాలు చూడవచ్చు. చలి వాతావరణం కారణంగా, ఈ ప్రదేశం జూన్ మరియు అక్టోబర్ నెలల మధ్య మాత్రమే సందర్శించవలసినదిగా హెచ్చరిక చేస్తారు.

Photo Courtesy: Kumar Chitrang

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X