Search
  • Follow NativePlanet
Share
» »మానవ ఐక్యత పెంపొందించే కేండులి జాతర !

మానవ ఐక్యత పెంపొందించే కేండులి జాతర !

వీనుల విందైన మ్యూజిక్ లేదా సంగీతం ప్రేమను తెలియ చేస్తుంది. అయితే, అసలైన ప్రేమను మనం జానపదుల గీతాలలో కూడా చూస్తూ వుంటాం. ఈ నెల అంటే జనవరి 14 నుండి 16 వరకూ బీర్భం లో జరుగుతున్న ఒక జాతర ఇటువంటిదే. ఈ జాతరను బౌల్ తెగ నిర్వహిస్తుంది. వీరి ప్రధాన మతం సంగీతం. ఈ తెగలో చాలామంది హిందూ వైష్ణవ తెగకు చెందిన వారు గాను లేదా సూఫీ ముస్లిం ల తెగకు చెందిన వారి గాను అయివుంటారు. ఈ బౌల్ మ్యూజిక్ యొక్క ఉద్దేశ్యం ప్రపంచం లోని వివిధ జాతుల మధ్య కుల లేదా మత విబేధాలు లేక ఐక్యత సాధించటమే.

బౌల్ సంగీత పండుగ

 బౌల్ సంగీత పండుగ !

Photo Courtesy: Karthik Das Baul
మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ ప్రతి సంవత్సరం జనవరి నెలలో బీర్భం లో జరుగుతుంది. బీర్భం అంటే ఎర్రటి నేల కల భూమి అని అర్ధం. ఈ సంగీతకారులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మానవ ఐక్యతా గేయాలు , ఆధ్యాత్మిక అభివృద్ధి గేయాలు పాడుకుంటూ నగర సంకీర్తనలు చేస్తారు. బౌల్ సింగర్ లను తేలికగా గుర్తించవచ్చు. వీరు కాషాయ దుస్తులు ధరిస్తారు. తల వెంట్రుకలు కత్తిరించు కొనక జులపాలు కలిగి వుంటారు. తులసి పూసలను మేడలో ధరించి, తంబూరలను చేత పట్టి వాయిస్తూ తిరుగుతారు. వారి జానపద గేయాల వ్యాప్తి కొరకు మాత్రమే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరుగుతూంటారు.
బౌల్ సంగీత పండుగ

Photo Courtesy: Ajaiberwal
బౌల్ సంగీతం చెవులకు విన సొంపుగా వుంటుంది. ఈ బౌల్ సంగీత కారులలో పార్వతి బౌల్ దీనిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. అద్భుతమైన ఈ పండుగను వెస్ట్ బెంగాల్ లోని శాంతినికేతన్ కు 42 కి. మీ. ల దూరం లో కల జయదేవ్ కెండూలి అనే ప్రదేశంలో నిర్వహిస్తారు. ఈప్రదేశం జయ దేవుడి జన్మస్థలం. జయదేవుడు ఒక ప్రసిద్ధ బెంగాలి కవి. గతంలో బీర్భం బౌల్ ప్రోగ్రాం లకు కేంద్రంగా వుండేది.

కాల క్రమేణా, ఈ పండుగ నిర్వహణ త్రిపుర, బంగ్లాదేశ్, మరియు బీహార్ , ఒడిష రాష్ట్రా లలోని కొన్ని భాగాలకు విస్తరించింది. అయితే, బౌల్స్ లేని వెస్ట్ బెంగాల్ కల్చర్ ఊహించనలవి కాదు.

మరింక ఆలస్యం ఎందుకు, ఈ పండుగ జాతరను ఒక విభిన్న రీతిలో ఆనందించేందుకు బయలు దేరండి. వీనుల విందైన సంగీతాన్ని ప్రకృతి మాత ఒడిలో కల బీర్భం ప్రదేశంలో విని తనివి తీరా ఆనందించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X