Search
  • Follow NativePlanet
Share
» »అన్ని కాలాల పర్యటనకు అనువైన కేరళ!

అన్ని కాలాల పర్యటనకు అనువైన కేరళ!

కేరళ లో ఎక్కడికి వెళ్లి పర్యటించాలని ఆలోచిస్తున్నారా ? సీసన్ ఏదైనా సరే, పర్యాటకులకు అనుకూలంగా వుండే కొన్ని ఆకర్షణీయ ప్రదేశాలు గాడ్స్ ఓన్ కంట్రీ గా చెప్పబడే కేరళ లో కలవు.

ఈ వేసవిలో కుటుంబ సభ్యులతో కలసి ఈ పర్యటనా ప్రదేశాలలో తప్పక పర్యటించి ఆనందించవచ్చు. ఇక్కడ కల చాల ప్రదేశాలు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ కొన్ని ప్రదేశాలు సాహసికులు కోరే క్రీడలకు కూడా నిలయం గా వుండి మీలో కొత్త ఉత్సాహాలు నింపుతాయి.

మరి సంవత్సరం పొడవునా, సీజన్ ఏదైనప్పటికీ కేరళ రాష్ట్రంలో చూడదగిన ప్రదేశాలు ఏవి అనేది పరిశీలించండి.

చోట్టనిక్కర

చోట్టనిక్కర

చోట్టనిక్కర, కేరళ లోని ఎర్నాకులం జిల్లా లో కల ఒక అందమైన చిన్న గ్రామం. కేరళ లో ఒక ప్రసిద్ధ యాత్రా క్షేత్రం. ఇక్కడ కల చోట్టనిక్కర భగవతి టెంపుల్ ఒక ప్రధాన ఆకర్షణ. భక్తులు ప్రతి సీజన్లో అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ కల ఆర్కియోలాజికల్ మ్యూజియం కూడా పర్యాటకులు చూడవచ్చు.

Photo Courtesy: Roney Maxwell

గురువాయూర్

గురువాయూర్

ఆధ్యాత్మిక పట్టణం అయిన గురువాయూర్ కేరళ లోని త్రిస్సూర్ జిల్లాలో కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన దైవం శ్రీ కృష్ణుడు. దీనిని భూ లోక వైకుంటం అని కూడా అంటారు. సమీపంలోని పున్నట్టూర్ కొత్త లో కల ఎలిఫెంట్ కెంప్ కూడా సందర్శించవచ్చు.

Photo Courtesy: Aruna

గురువాయూర్

గురువాయూర్

ఆధ్యాత్మిక పట్టణం అయిన గురువాయూర్ కేరళ లోని త్రిస్సూర్ జిల్లాలో కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన దైవం శ్రీ కృష్ణుడు. దీనిని భూ లోక వైకుంటం అని కూడా అంటారు. సమీపంలోని పున్నట్టూర్ కొత్త లో కల ఎలిఫెంట్ కెంప్ కూడా సందర్శించవచ్చు.

Photo Courtesy: Aruna

ఇడుక్కి

ఇడుక్కి

ఇడుక్కి , కేరళ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. దట్టమైన పచ్చటి అడవులు, మరో వైపు ఎత్తైన పర్వత శ్రేణులు కల ఇడుక్కి ప్రదేశం ఒక ఆకర్షణీయ పెయింటింగ్ వాలే వుంటుంది. ఇక్కడ ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్చ్ డాం కలదు. తేక్కడి లోని పెరియార్ నేషనల్ పార్క్ ను చూసేందుకు వెళ్ళే పర్యాటకులు ఇడుక్కి సందర్శన తప్పక చేస్తారు.

కాసర్గోడ్

కాసర్గోడ్

కేరళ లో ఉత్తర భాగం చివరి లో కాసర్గోడ్ జిల్లా కలదు. ఈ జిల్లా శిల్ప శైలి కల దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ మీరు సముద్రం లో చొచ్చుకు పోయిన బెకాల్ కోట చూడవచ్చు. ఇంకనూ గోవింద్ పై మెమోరియల్, దీనా మాస్క్ వంటివి మరి కొన్ని పర్యాటక ఆకర్షణలు.

Photo Courtesy: Riju K

కొల్లం

కొల్లం

కొల్లం ఒక కోస్తా తీర పట్టణం. కేరళ లోని అష్టముది సరస్సు ఒడ్డున కలదు. కొల్లం లో జీడి పప్పు తోటలు అధికం కావటంతో దీనిని' సిటీ అఫ్ కేశూస్ ' అని కూడా పిలుస్తారు. జీడి పప్పు కు ఈ పట్టణం ప్రపంచ ప్రసిద్ధి. పర్యాటకులు ఇక్కడ కల అందమైన బీచ్ లలో విహరించవచ్చు. సరస్సులో బోటు విహారం చేయవచ్చు.

Photo Courtesy: Umasankarindia

మలంపూజ

మలంపూజ

కేరళ లోని పాలక్కాడ్ జిల్లాలో మలంపూజ ఒక చిన్న పట్టణం. వివిధ రుచులు కల పర్యాటకులు, ప్రకృతి ప్రియులు, విహారం కోరే వారు అన్ని సీసన్ లలో ఇక్కడకు వస్తారు. ఇక్కడ నిర్మించిన రిజర్వాయర్ అనేకమందిని ఆకర్షిస్తుంది. థ్రెడ్ గార్డెన్, రాక్ గార్డెన్, యక్షి విగ్రహం వంటివి ఇక్కడ కల మరికొన్ని ప్రసిద్ధ ఆకర్షణలు.

Photo Courtesy: Akhilsunnithan

మలయట్టూర్

మలయట్టూర్

మలయట్టూర్ , ఎర్నాకులం జిల్లాలో కల ఒక చిన్న పట్టణం. ఇది పడమటి కనుమలు మరియు పెరియార్ నది ల మధ్య కలదు. ఈ ప్రదేశం చర్చి లకు ప్రసిద్ధి. ఇక్కడే ఒక దుర్గ దేవి టెంపుల్ కలదు. మహాగని తొట్టం మరియు మూలంకూజి లు కూడా తప్పక సందర్శించ దగినవి.

Photo Courtesy: Aviva West

కేరళ హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X