అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఆంధ్రప్రదేశ్ భూతలస్వర్గం ఎక్కడుందో మీకు తెలుసా?

Written by: Venkata Karunasri Nalluru
Updated: Tuesday, April 18, 2017, 12:41 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ సందర్శించటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. కోనసీమ గౌతమి మరియు వశిష్ట నదులమధ్య డెల్టా, గోదావరి నదికి వెనుక ఉంది. కోనసీమ వద్ద గోదావరి లో పడవ ప్రయాణము చాలా బాగుంటుంది. పర్యావరణ టూరిజం కొరకు ప్రధాన కేంద్రంగా ఉంది. వాతావరణం కూడా రాజమండ్రి కంటే బాగుంటుంది., మరియు ప్రయాణము చేసి అలసిపోయిన పర్యాటకులకు విశ్రాంతి కోసం కోనసీమ బాగుంటుంది.

కోనసీమ ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇక్కడికి వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్కరికీ వుంటుంది. మన చుట్టుపక్కల ఎంతో రమణీయత పెట్టుకుని దేశావిదేశాలు చుట్టొస్తుంటారు చాలామంది.కారణం ఈ ప్రకృతి అందాలపై సరైన అవగాహన లేకపోవడమే.ప్రకృతి సోయగాలే అనుకుంటే ఆహ్లాదాన్ని పంచే రిసార్ట్ లు మరింత అందంగా ముస్తాబై కనిపిస్తాయి.
గలగల పారే గోదారిపై బోటు ప్రయాణం వినోదాలవిహారానికి పచ్చజండా వూపుతుంది.రారమ్మంటూ ఎర్రతివాచీలు పరుస్తుంది.ఆధ్యాత్మిక వైభవం కూడా కళ్ళకు కడుతుంది కోనసీమ.ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు పుణ్యం పురుషార్ధం రెండూ దక్కుతాయంటే అతిశయోక్తి కాదు.

కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరివాహ ప్రాంతంలోని త్రిభుజాకారప్రదేశం.ఉత్తరం వైపున గౌతమీనది.దక్షిణం వైపున వశిష్ట గోదావరి పాయల మధ్య బంగాళాఖాతంలో వున్న డెల్టా ప్రాంతం కోనసీమ.కోనసీమ అంటే మూలనవున్న ప్రదేశం అని అర్థం.ఇది వుండటానికి కొనలోనే వుంటుంది కానీ చూడటానికి కొత్త అందాలకు ఆనవాలమై నిలుస్తుంది. నిండు గోదారిపై బోటు ప్రయాణం పర్యాటకులకు తియ్యటిననుభూతినందిస్తుంది.నదీ తీరం పొడవునా ఎత్తైన కొబ్బరిచెట్లు.

కోనసీమ అందాలు వినోదాలవిహారానికి పచ్చజండా వూపుతుంది.

1. కోనసీమ చేరుకోవటం ఎలా ?

బస్సు / రోడ్డు మార్గం : హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు కలవు. రాజమండ్రి కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. రాజమండ్రి కి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి కోనసీమప్రాంతాలకు ఆర్డినరీ బస్సు సర్వీసుల ద్వారా చేరుకోవచ్చు.

pc:Praveen_Illa

 

2. వాయు మార్గం

కోనసీమ చేరుకోవటానికి సమీపాన రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు. రైలు మార్గం : కోనసీమ పరిసరాల్లో రాజమండ్రి, కాకినాడ, కోటిపల్లి, గంగవరం, పాలకొల్లు, నరసాపూర్ రైల్వే స్టేషన్ లు కలవు.

pc:Adityamadhav83

 

3.సినిమా షూటింగ్లు

కోనసీమ సినిమా షూటింగ్ లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నో టాలీవూడ్ సినిమాలు చిత్రీకరించారు.

pc:BSSKrishnaS

 

4. కోనసీమ పర్యాటకం

కోనసీమ పర్యాటకం పర్యాటకులను ఆకర్శించటానికి ఎన్నోయాత్రలను అందిస్తున్నది. పాపికొండలు, కొల్లేరు సరస్సు, మారేడుమిల్లి, మంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడి సమీప అందాలు.ఇక్కడికి వెళ్ళటానికి టూర్ ప్యాకేజీలను, వసతి కై రిసార్ట్ లు అనేకం కలవు.

pc: pranav

 

5. పాపికొండల ప్రయాణం

కోనసీమ నుండి పాపికొండల ప్రయాణం అనుభూతి వర్ణించలేనిది. బిజీ లైఫ్ నుండి రిలీఫ్ కాలావనుకొనేవారికి ఈ ప్రయాణం అనుకూలం.

pc:kiran kumar

 

6.గోదావరి అందాలు

గోదావరి నది పై వంతెనలు నిర్మించక ముందు ప్రజారవాణా అంతాకూడా లాంచీలు, పడవల మీదుగానే సాగిపోయేవి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. గోదావరి నదిలో సుమారు 10-20 నిమిషాల లాంచీ ప్రయాణం (కోనసీమ పరిసర ప్రాంతాలలో .. ) పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

pc:Phanindrawiki

 

7.కోనసీమ వంటలు

కోనసీమ వంటలు ఆహా ..! అనిపించకమానవు. కోడికూర, కోడి పలావ్ లకు కోనసీమ పెట్టింది పేరు. ఆంధ్రా చేపల పులుసు, రొయ్యల ఇగురు, వేపుడు కూడా రుచిగా వండుతారు. అట్లు, పెసరెట్టు టిఫిన్ కు బాగుంటాయి. మధ్యాహ్నం లంచ్ కి పిక్కల్(చట్నీలు) లేకుండా ఇక్కడి వారి భోజనం పూర్తికాదు. ఇక్కడికి వెళితే పూతరేకులు తప్పక తినండి.

pc: konaseema recipes

 

8.అమలాపురం

అమలాపురం కోనసీమలో ముఖ్యమైన ప్రదేశం. కాకినాడకు 65 కి. మీ ల దూరంలో కలదు . అమలేశ్వరస్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రమ ణ్యేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, అయ్యప్పస్వామి, షిర్డీ సాయి స్వర్ణ మందిరం చూడదగ్గవిగా ఉన్నాయి.

pc:Venkat2336

 

9.రావులపాలెం

రావులపాలెం కోనసీమ అరటిపండ్ల మార్కెట్ కి ప్రధాన కేంద్రం. దీనిని కోనసీమకు ముఖద్వారం అని పిలుస్తారు.

pc:konaseema tourism

 

10.పంటపొలాలు

కోనసీమలో పండించని పంట ఉండదు. కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

pc:v s s n murthy manda

 

11.సంస్కృతి - సంప్రదాయాలు

కోనసీమ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ - సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. తెలుగు సంవత్సరాది ఉగాది, సంక్రాంతి కోనసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలు.

pc:Palavelli Resorts

 

12.పలకరింపులు

కోనసీమ పలకరింపులు భలేగా ఉన్నాయి. చాలా సినిమాలలో అబ్సర్వ్ చెసింటారనుకోండి ..! ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. సంప్రదాయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే కోనసీమ రాక తప్పదు.

pc: మన కోనసీమ అందాలు

 

English summary

Konaseema - A Tourist Destination In Andhra Pradesh

Konaseema is an oasis of enchanting beauty, peace and tranquillity that is a dream tour destination for all. It is an area in Godavari Delta(East Godavari district) of Andhra Pradesh.
Please Wait while comments are loading...