Search
  • Follow NativePlanet
Share
» »కొట్టాయం ... ప్రకృతి ఒడిలో విహారం !

కొట్టాయం ... ప్రకృతి ఒడిలో విహారం !

కొట్టాయం కేరళ లోని ఒక పురాతన పట్టణం. కేరళ లోని జిల్లాలలో ఒకటి. ఈ పట్టణం ప్రింట్ మీడియా కు మరియు సాహిత్యానికి పేరు గాంచినది. అందుకే దీనిని 'అక్షర నగరి' అని కూడా పిలుస్తారు.

ఈ పట్టణానికి ఇక్కడ కల తలియిల్ కొత్త అనే కోట పేరుపై కొట్టాయం అనే పేరు వచ్చింది. ఒక కోట యొక్క గోడల మధ్య అభివృద్ధి చెందిన ఒక గ్రామం చివరకు కొట్టాయం టవున్ గా ప్రసిద్ధి కెక్కింది. ఈ ప్రదేశానికి తూర్పున సరిహద్దులుగా పడమటి కనుమలు మరియు పడమటి వైపుగా మనోహర వెంబనాడ్ సరస్సు కలవు.

ఇక్కడ ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. అందమైన బట్టలు, కొండలు ప్రవాహాలు అన్నీ కలసి ఈ ప్రదేశాన్ని ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా చేసాయి. కొట్టాయం సందర్శనలో మీరు చూడవలసిన ఇతర ప్రదేశాలు ఏమిటి అనేది పరిశీలించండి.

హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

కొట్టాయం కు కోచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 90 కి. మీ. ల దూరంలో సమీప విమానాశ్రయంగా వుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి బస్సు లేదా ట్రైన్ లో కొట్టాయం చేరవచ్చు. కొట్టాయం రైలు స్టేషన్ కేరళ లోని సమీప టవున్ లకు, నగరాలకు ట్రైన్ సర్వీస్ లు అందిస్తుంది. ప్రధాన నగరాలకు కూడా ఇది కలుపు బడి వుంది. కొట్టాయం లో రోడ్డు ప్రయాణం సౌకర్యవంతం. అనేక ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు ఇక్కడకు నడుస్తాయి. కనుక కేరళ లోని ప్రధాన నగరాలకే కాక, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా ప్రయాణ సౌకర్యం కలదు. Photo Courtesy: Navaneeth KN

ఎలావీజపూన్చిరా

ఎలావీజపూన్చిరా

ఎలావీజ పూన్చిరా పర్యాటకులలో ఒక మంచి పిక్నిక్ స్పాట్ గా పేరు పడింది. చాలా మంది త్రేక్కర్ లు, ఫోటో గ్రాఫేర్ లు ఇక్కడకు వచ్చి ఉదయించే లేదా అస్తమించే సూర్య దృశ్యాలు తీసి లేదా చూసి ఆనందిస్తారు. ఈ ప్రదేశంలో చెట్లు లేవు. 'ఎలావీజపూన్చీరా' అంటే అర్ధం 'ఆకులు పడని లోయ ' అని చెపుతారు.

ఎరుమేలి

ఎరుమేలి

ఎరుమేలి కన్జీరపల్లీ - పాథనంతిట్ట మార్గంలో కలదు. ఇది ఒక ఆధాత్మిక ప్రదేశం. శబరిమల వెళ్ళే యాత్రికులు ఇక్కడ మొదట దర్శించుకుంటారు. ఈ టవున్ లో రెండు టెంపుల్స్ కలవు. నవంబర్, డిసెంబర్ & జనవారి నెలల లో పెట్ట తుల్లాల్ ఉత్సవం చేస్తారు.ఎరుమేలి చెరియ అంబళం ఎదురుగా ఎరుమేలి నయనార్ మసీద్ కలదు. అయ్యప్ప భక్తులు వావార్ సవాయ్ ని నయనార్ మసీదులో దర్శించుకుంటారు.

Photo Courtesy: Avsnarayan

పంచిక్కాడు

పంచిక్కాడు

పంచిక్కాడు గ్రామం కొట్టాయం కు 11 కి. మీ. లు. ఈ గ్రామం అక్కడ కల సరస్వతి టెంపుల్ కు ప్రసిద్ధి. ఈ టెంపుల్ ను దక్షిణ మూకాంబి అని పిలుస్తారు. ఈ టెంపుల్ లో సంవత్సరం పొడవునా పూజలు నిర్వహిస్తారు. అద్భుత అందాలు కల ఈ గ్రామం పర్యాటకులు బాగా ఇష్టపడతారు. పూర్తి విశ్రాంతి కోరే వారు ఈ గ్రామానికి వస్తారు.

Photo Courtesy: arunpnair

పూన్జార్ పాలస్

పూన్జార్ పాలస్

కొట్టాయం నుండి పాల ఎరాట్టు పెట్ట వెళ్ళే మార్గంలో పూన్జార్ పాలస్ చూడవచ్చు. ఈ ప్లేస్ కేరళ రాష్ట్ర వారసత్వ శిల్ప శైలి కలిగి వుంటుంది. ఈ ప్లేస్ లో అనేక రాజ కుటుంబ పురాతన వస్తువులు, అందమైన శిల్పాలు, రాతితో చెక్కబడిన చక్కటి దీపాలు కలవు.

సెయింట్ మారిస్ ఆర్థోడాక్స్ చర్చి

సెయింట్ మారిస్ ఆర్థోడాక్స్ చర్చి

సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చి కొట్టాయం కు రెండు కి. మీ. ల దూరం. చర్చి నిర్మాణం లో కేరళ మరిఉ పోర్చుగీస్ శిల్ప శైలులు కనపడతాయి. చర్చి యొక్క గోడలు అందమైన చిత్రాలతో అలంకరించబడి వుంటాయి. ఇవన్నీ పాశ్చాత్య శైలి లో వుంటాయి. ఈ చిత్రాలు బైబిల్ మరిఉ ఇతర అంశాలు కలిగి వుంటాయి.

తఝాతంగాడి జుమా మసీద్

తఝాతంగాడి జుమా మసీద్

తజతంగాడి జుమా మసీద్ హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి. ఇది కొట్టాయం సమీపంలోని చిన్న గ్రామం. ఈ మసీదు చాలా పురాతనమైనది. సుమారు ఒక శతాబ్దం కిందతిడిగా చెపుతారు. మసీదు శిల్ప శైలి వివిధ చెక్క పని నైపుణ్యాలతో అందంగా వుంటుంది. కొట్టాయం వెళ్ళిన సందర్శకులు ఈ మసీదును తప్పక చూడాలి.

Photo Courtesy: Aryaabraham

తిరునక్కర మహాదేవ టెంపుల్

తిరునక్కర మహాదేవ టెంపుల్

తిరునక్కర మహాదేవ టెంపుల్ కొట్టం నగరంలో కలదు. ఇది శివుడి గుడి. ఈ దేవాలయ గోడలు అనేక కుడ్య చిత్రాలతో వివిధ పురాణాలు చూపుతాయి. ఈ టెంపుల్ కు అనేకమంది భక్తులు, టూరిస్ట్ లు దాని అందాలు చూసేందుకు వస్తారు. ఈ టెంపుల్ లో ప్రతి సంవత్సరం ఫాల్గుణ ఉత్సవం అనే వేడుకలు మార్చ్ లేదా ఏప్రిల్ నెలల లో జరుగుతాయి.

వెంబనాడ్ సరస్సు

వెంబనాడ్ సరస్సు

వెంబనాడ్ సరస్సు చాలా అందమైనది. ఇది నగరంలోనే కలదు. ఈ సరస్సు ఒడ్డున విహారం లేదా సరస్సులో బోటు విహారం చేయవచ్చు. స్థానికులకు ఇది ఒక మంచి పిక్నిక్ ప్రదేశం. వివిధ రకాల పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రకృతి ప్రియులకు ఇది ఒక ఇష్టమైన ప్రదేశం.

Photo Courtesy: Kaippally

మరిన్ని ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X