Search
  • Follow NativePlanet
Share
» »నాట్యారామం - కూచిపూడి గ్రామం !

నాట్యారామం - కూచిపూడి గ్రామం !

కూచిపూడి ... ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. ఈ నృత్యం నవరసభరితం కలిగించేదిగా ఉంటుంది. కూచిపూడి నృత్యానికి పుట్టిల్లు కూచిపూడి గ్రామం.

By Mohammad

కూచిపూడి ... ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యం. భారతీయ నాట్యాలలో కూచిపూడికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ నృత్యం నవరసభరితం కలిగించేదిగా ఉంటుంది. దీని పుట్టుక, చరిత్ర అంతా నవ్యంధ్ర రాజధానికి చేరువలో కృష్ణా జిల్లా దివితాలూకాలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని అమెరికాకు చెందిన సిలికానాంధ్ర సంస్థ దత్తత తీసుకున్నది.

కూచిపూడి నృత్యానికి పుట్టిల్లు కూచిపూడి గ్రామం. ఇది విజయవాడకు 51 కిలోమీటర్ల దూరంలో, మొవ్వ మండలంలో కలదు. మచిలీపట్టణం, విజయవాడ, పామర్రు తదితర సమీప ప్రాంతాల నుండి కూచిపూడి గ్రామానికి బస్సులు నిరంతరం తిరుగుతుంటాయి. చక్కటి రోడ్డు సదుపాయం కలదు. ఈ ఊరిలో రైల్వే స్టేషన్ లేదు. కనుక ఇక్కడికి వచ్చే కళాకారులు, యాత్రికులు విజయవాడ రైల్వే స్టేషన్ లో కానీ, బందర్ రైల్వే స్టేషన్ లో కానీ దిగి ఆర్టీసీ బస్సులలో చేరుకోవచ్చు.

కూచిపూడి నృత్యం

కూచిపూడి నృత్యం

చిత్రకృప : Vasanthakumarep

కూచిపూడి కి ఆ పేరెలా వచ్చింది ?

ఈ ప్రాంతాన్ని ద్వాపరయుగంలో లవకుశల పేరు మీద 'కుశీలవభావతుడి' గా, ద్వాపరయుగంలో శ్రీకృషుడు చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు పేరుమీద 'కుచేలపురి' గా, కలియుగం మొదట్లో 'కుచేలమ్మపూడి' గా తర్వాత 'కూచిపూడి' గా పిలువబడుతున్నది.

కూచిపూడి కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక బీచ్ ను సందర్శించండి!

క్రీ.పూ. 1-2 వ శతాబ్దంలో శ్రీకాకుళం తీరప్రాంతంలో కొంతమంది బ్రాహ్మణులు ఈ నాట్యాన్ని అభ్యసించారు. ఆతరువాత ఇది దక్షిణ భారతదేశం అంతటా వ్యాప్తిచెంది ప్రసిద్ధి చెందినది. రాష్ట్రకూటములు, శాతవాహనులు, విజయనగర రాజులు ఇలా దాదాపు దక్షిణ భారతదేశాన్ని పాలించిన అనేక పెద్ద, చిన్న రాజ్యాలలో, సంస్థానాలలో, దేవాలయాలలో ఈ నృత్యాన్ని నాట్య కళాకారులు ప్రదర్శించారు, మెప్పించారు, బహుమానాలు సత్కారాలు పొందారు.

కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు సిద్ధేంద్ర యోగి

కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు సిద్ధేంద్ర యోగి

చిత్రకృప : Chavakiran

కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు సిద్ధేంద్ర యోగి. పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే ఈ విద్యను ప్రదర్శించేవారు. క్రీ.శ. 15 వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి వచ్చి కూచిపూడి నృత్యంలో ఆడవారు నాట్యం చేయటానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసాడు. అతని అనుచరులైన బ్రాహ్మణులు కూచిపూడి లో స్థిరపడి సమీపాన ఉన్న కృష్ణా నది ఒడ్డున ఆ నాట్యాన్ని అభ్యసించటంతో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి వచ్చింది.

రామలింగేశ్వర స్వామి వారి ఆలయం

రామలింగేశ్వర స్వామి వారి ఆలయం

చిత్రకృప : ssanthiswaroop

కూచిపూడి గ్రామంలో సందర్శనీయ స్థలాలు

కూచిపూడి గ్రామానికి సమీపాన బంగాళాఖాతం సముద్రం, కృష్ణా నది ప్రకృతి ప్రియులను అలరిస్తుంది. గ్రామంలో చూడడానికి ఎటువంటి చారిత్రక కట్టడాలు లేవు. కానీ ఆధ్యాత్మిక మందిరాలు రెండు ఉన్నాయి. అవి 1. శ్రీబాలా త్రిపురసుందరీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, 2. శ్రీ గోపయ్య సమేత శ్రీలక్ష్మితిరుపతమ్మ దేవాలయం. తిరుపతమ్మ దేవాలయం శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం పక్కనే ఉన్నది.

శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం, కూచిపూడి

శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం, కూచిపూడి

చిత్రకృప : silicon andhra

కూచిపూడి గ్రామం చుట్టుపక్కల గల మరికొన్ని పర్యాటక ప్రదేశాలు

కూచిపూడి గ్రామానికి సమీపంలో కొన్ని పర్యాటక ప్రదేశాలు కలవు. వాటిలో ప్రధానంగా విజయవాడ, కోనసీమ, మచిలీపట్నం, గుంటూరు మరియు అమరావతి చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. ఈ ప్రదేశాలు చూచే పర్యాటకులు కూచిపూడి నాట్యం కారణంగా కూచిపూడి తప్పక చూస్తారు.

కూచిపూడి కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదాద్రి ఆలయాన్ని దర్శించండి!

గత కాలపు సాంప్రదాయాలు, నాట్యాలు కోరే వారికి కూచిపూడి గ్రామం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కూచిపూడి కి దగ్గరలో ఉండవల్లి గుహలు, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, మొగల్రాజపురం గుహలు, కనక దుర్గ టెంపుల్ కలవు.

కూచిపూడి నృత్యంలో ఒక భంగిమ

కూచిపూడి నృత్యంలో ఒక భంగిమ

చిత్రకృప : Bhaskaranaidu

ఏటా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 'అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళనం' ను అధికారికంగా నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు 4 'కూచిపూడి అంతర్జాతీయ నాట్య సమ్మేళనం' లు జరిగాయి. ఐదవది 2016 డిసెంబర్ 23, 24, 25 వ తేదీలలో జరగనున్నాయి. ఎపి ప్రభుత్వం కూచిపూడి గ్రామాన్ని 'నాట్యరామం' గా తీర్చిదిద్దెందుకు 100 కోట్లు ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X