Search
  • Follow NativePlanet
Share
» »కుమారభీమేశ్వరస్వామి దేవాలయం, సామర్లకోట !!

కుమారభీమేశ్వరస్వామి దేవాలయం, సామర్లకోట !!

ఎత్తైన ప్రాకారాలు, అద్భుత శిల్పకళ, ద్వారాలు, కోనేటిజలాలు వంటి వాటితో అలరారుతున్న కుమారభీమారామమును దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదం, సంతోషం కలుగుతాయి.

By Mohammad

పంచరామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం. కాకినాడ నుండి సామర్లకోట 15 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చరిత్ర

సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

ఇది కూడా చదవండి : అమరావతి సమీప ఆకర్షణలు !!

ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు.

ఆలయం

ఆలయం

ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించాగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

గర్భగుడిలో రెండో అంతస్తు

గర్భగుడిలో రెండో అంతస్తు

దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుదీరు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు.

చిత్రకృప : Anushamutyala

నూరు రాతి స్తంభాలు

నూరు రాతి స్తంభాలు

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడివున్నది. ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉంది. రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితం.

చిత్రకృప : Anushamutyala

పూజలు, అర్చనలు చేయరాదు

పూజలు, అర్చనలు చేయరాదు

శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని దర్శించుకొనెదరు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి.

చిత్రకృప : Amruth varma

భీమేశ్వరాలయాన్ని పోలివుండును

భీమేశ్వరాలయాన్ని పోలివుండును

ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలివుండును. అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్న ద్విప్రాకారాపు గోడలు ఇసుక రాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.

చిత్రకృప : Anushamutyala

ఉత్సవాలు పూజలు

ఉత్సవాలు పూజలు

ఇక చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి.

చిత్రకృప : Palagiri

శ్రీ మాండవ్య నారాయణస్వామి వారి దివ్యక్షేత్రము

శ్రీ మాండవ్య నారాయణస్వామి వారి దివ్యక్షేత్రము

పావన గోదావరి నది సప్త పాయలలో ఒకటైన తుల్యభాగనదీ తీరాన సామర్లకోటలో వెలసిన శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం 'దక్షిణ బదరీ' గా అత్యంత ప్రాశస్త్యం పొందింది. కోరిక లీడేర్చే కొంగు బంగారంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన సంస్కృతీ వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది.

చిత్రకృప : Anushamutyala

సాంకేతికపరిజ్ఞానానికి నిదర్శనం

సాంకేతికపరిజ్ఞానానికి నిదర్శనం

ఆలయ స్తంభాలపై ప్రాకృత భాషలో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయి. అలనాటి శిల్పులు కళావైభవానికి, యాంత్రిక ప్రతిభకు, వాస్తు విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.

చిత్రకృప : Aditya Gopal

శిల్పాలు - ఆకట్టుకుంటాయి

శిల్పాలు - ఆకట్టుకుంటాయి

దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హయగ్రీవస్వామి, శేషసాయి, యోగమండపంలో వటపత్రసాయి, ప్రహారీ చుట్టుగోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణస్వామి,క్షేత్రపాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు, యోగనారసింహుడు, అనంత పద్మనాభుడు, ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది.

చిత్రకృప : Anushamutyala

దక్షిణ బదరీ

దక్షిణ బదరీ

సామర్లకోటలో ఉన్న పంచారామ క్షేత్రమైన కుమారారామం సమీపంలో విరాజిల్లుతున్న 'దక్షిణ బదరీ' గా పేరొందిన శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయాన్ని దర్శించేందుకు రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో వచ్చి భక్తులు స్వామిని దర్శించుకుని శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నరు.

చిత్రకృప : Anushamutyala

అద్భుతమైన దైవశక్తులు

అద్భుతమైన దైవశక్తులు

శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయంలో మహాయోగులు శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు తపస్సు చేసి అద్భుతమైన దైవశక్తులు సాధించారని స్థానికులు చెబుతారు.

చిత్రకృప : Klsateeshvarma

పర్వదినాలు

పర్వదినాలు

చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. దనుర్మాసం, శ్రావణమాసం, కార్తీక మాసాల్లోను, ఇతర అన్ని పర్వదినాలలో స్వామివారికి విశేషార్చనలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతాయి.

చిత్రకృప : S.v.madhav

వసతి

వసతి

సామర్లకోట లో యాత్రికులకు వసతి సదుపాయాలు కలవు. హోటళ్ళు, ప్రవేట్ లాడ్జీలలో గదులు అద్దెకు దొరుకుతాయి. అచ్చం మన ప్రాంతంలో ఉండేటట్లు టిఫిన్లు, భోజనాలు రుచికరంగా ఉంటాయి.

చిత్రకృప : Venkat004

సామర్లకోట ఇలా చేరండి !!

సామర్లకోట ఇలా చేరండి !!

సామర్లకోట కు 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు.

సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది. ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారారామము క్షేత్రం చేరుకోవచ్చు.

సామర్లకోట కు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు. అంతేనా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర టిక్కెట్టు 350 రూపాయలు.

చిత్రకృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X