Search
  • Follow NativePlanet
Share
» »నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ... కుమారకోమ్ !

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ... కుమారకోమ్ !

బ్యాక్ వాటర్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది కేరళ. కేరళలో హాలిడేస్ గడపడం ఒకెత్తైతే,బ్యాక్ వాటర్స్ లో బోట్ షికారు చేయటం మరో ఎత్తు. కొబ్బరిచెట్లు,తాటిచెట్ల వరుసల మధ్య బోట్ లలో వెళుతుంటే అనుభూతే వేరు.

By Mohammad

బ్యాక్ వాటర్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది కేరళ. కేరళలో హాలిడేస్ గడపడం ఒక ప్రత్యేకత ఐతే, బ్యాక్ వాటర్స్ లో బోట్ ప్రయాణం చేయటం మరో ప్రత్యేకత. చుట్టూ కొబ్బరి చెట్లు, తాటిచెట్ల వరుసల మధ్య హౌస్ బోట్ లలో వెళుతుంటే ఆ అనుభూతే వేరు. ఇక్కడి వాతావరణం, ప్రకృతి దృశ్యాలు మన కోనసీమను తలదన్నేలా ఉంటాయి. కేరళ పర్యాటక రంగంలో హౌస్ బోట్ ల పాత్ర కీలకం.

కేరళ లో మాన్సూన్ ఫోటోల సంగ్రహావలోకనం చూడండి !

'గాడ్స్ ఓన్ కంట్రీ (దేవుని సొంత భూమి)' గా ప్రఖ్యాతిగాంచిన కేరళ లో అద్భుతమైన బ్యాక్ వాటర్స్ కలవు. అందులో ఒకటి కుమారకోమ్. కుమారకోమ్ కొట్టాయం కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక కుమారకోమ్. కేరళలో అతి పెద్ద మంచినీటి సరస్సుగా గుర్తించబడ్డ వెంబనాడ్ సరస్సు వద్ద ఉన్న ఈ ప్రాంతం తన అందచందాలతో ... వన్నెతగ్గని ఆకుపచ్చని ప్రకృతితో పర్యాటకులను ఆకర్షిస్తోంది.

సుల్తాన్ బతేరి - కొండల మధ్యలో పరవశం !

అంతేకాదు, అభిరుచులకు స్వర్గం కుమారకోమ్. ఈ ప్రాంతంలో లభించే కేరళ సంప్రదాయ రుచులతో పాటు సీ ఫుడ్ ఎంతో రుచికరంగా ఉంటాయి. కేరళ తొలి పండగ ఓనం నాడు నిర్వహించే పడవ పందేలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. కుమారకోమ్ లో చూడవలసిన మరిన్ని ప్రదేశాలు పరిశీలిస్తే .. !

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పక్షి అభయారణ్యాలు !

కుమారకోమ్ పక్షి సంరక్షణా కేంద్రం

కుమారకోమ్ పక్షి సంరక్షణా కేంద్రం

కుమారకోమ్ పక్షి కేంద్రం వెంబనాడ్ సరస్సు ఒడ్డున ఉన్నది. సుమారు 14 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ కేంద్రం అనేక వలస పక్షులకు విడిది మరియు పక్షి శాస్త్రవేత్తలకు స్వర్గం. సైబీరియా, వాటార్ ఫోలోస్, బాతులు, నారాయణ పక్షులు, తెల్ల కొంగలు మరియు ఇతర పక్షులను ఇక్కడ చూడవచ్చు. ట్రెక్కింగ్ లేదా హౌస్ బోట్ అద్దెకు తీసుకొని సాంచురీ లోని పక్షులను చూడవచ్చు.

సందర్శించు సమయం : 10 am - 6 pm ; సందర్శించు కాలం : నవంబర్ - ఫిబ్రవరి

చిత్రకృప : Punnayurkulam Zainudheen

రవాణా సౌకర్యాలు

రవాణా సౌకర్యాలు

కేరళలో ఇప్పటికీ ఆయా లంకల్లో నివశిస్తున్న ప్రజలకు పడవలే రవాణా సౌకర్యాలు. ఉద్యోగాలకి, స్కూల్ కు, కాలేజీకి పోవాలన్నా, రావాలన్నా పడవలనే ఉపయోగిస్తుంటారు. మీరు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా లో ఈ దృశ్యాలను చూడవచ్చు.

చిత్రకృప : Manjithkaini

కోకొనట్‌ లాగూన్ రిసార్ట్

కోకొనట్‌ లాగూన్ రిసార్ట్

తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్‌ లాగూన్‌ రిసార్‌‌టకు వెళ్ళాల్సిందే మరి..!

చిత్రకృప : Vinoth Chandar

ప్రకృతి పచ్చదనం

ప్రకృతి పచ్చదనం

కుమారకోమ్ కు కేవలం 2 కి. మీ ల దూరంలో ఉంటుంది కోకొనట్ లాగూన్ రిసార్ట్. దట్టమైన పామ్ మధ్యలో..‌ చెట్లు, వెంబనాడ్‌ సరస్సు తూర్పుతీరంలో కవనార్‌ నదీ వద్ద ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్ వెలసింది. కుట్టునాడ్‌ ప్రజల జీవనశైలిని ప్రతిభింబిస్తూ .. చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలో ... విడి కాటేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.

చిత్రకృప : P.K.Niyogi

కోకొనట్ లాగూన్ రిసార్ట్ రెస్టారెంట్

కోకొనట్ లాగూన్ రిసార్ట్ రెస్టారెంట్

రిసార్ట్ లో ఈ రెస్టారెంట్ ఒక పురాతన భవనం. ఇది కేరళ వంటకాలకు ప్రసిద్ధి. కరిమీన్ పోల్లిచాతు, చెమ్మీన్ ఫ్రై, ప్రాన్స్ ఉలర్తియతు, ఫిష్ మొయిలీ మరియు క్రాబ్ ఫ్రై వంటివి కొన్ని అద్భుతమైన వంటకాలు. వీటిని రుచి చూడకుండా ఏ పర్యాటకుడు ఉండరు.

చిత్రకృప : Jiss Tom palelil

వసతులు

వసతులు

చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్‌ మాన్షన్లు, 28 హెరిటేజ్‌ బంగ్లాలు, 8 ప్రైవేట్‌ పూల్‌ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్‌ మాన్షన్‌‌సలో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్తులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్‌ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

చిత్రకృప : Sourav Niyogi

అనుభూతి

అనుభూతి

సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్‌ లాగూన్‌ రిసార్ట్ ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్ కు సమీపంలో రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

చిత్రకృప : Ponnana saichandra

వీక్షణమే కాదు.. ఆరోగ్యం కూడా...

వీక్షణమే కాదు.. ఆరోగ్యం కూడా...

ఆయుర్వేదిక్‌ మసాజ్‌, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయాణాలు, రైస్‌ బోట్‌ ప్రయాణాలు, ఫిషింగ్‌, ఈత లాంటివి ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి.

చిత్రకృప : Adams Homestay Cochin

పడవ ప్రయాణం ద్వారా

పడవ ప్రయాణం ద్వారా

సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్ఠంగా 23 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సి యస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవాలంటే.. కొచ్చిలోని కాసినో హోటల్‌ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది లేదా కొంతదూ రం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమరకోమ్‌ నుండిగానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్ కు చేరుకోవచ్చు.

చిత్రకృప : നിരക്ഷരൻ

విహార కేంద్రం

విహార కేంద్రం

కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశం సింహభాగం సరస్సులు, సెలయేర్లతో నిండి ఉంటుంది. ఇక్కడి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఏ వస్తువుకైనా లాంచీల్లో రావాల్సిందే! ఇక్కడ రోడ్లకంటే .. నదీ పాయలే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలామంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

చిత్రకృప : Prasad Pillai

ఆగస్టు, సెప్టెంబర్‌లలో

ఆగస్టు, సెప్టెంబర్‌లలో

కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్‌ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు -సెప్టెంబరు నెలల మధ్యకాలంలో, పండిట్ నెహ్రూ జ్ఞాపకార్థం నెహ్రూ బోట్ రేస్ పోటీలు ఆసక్తికరంగా సాగుతుంది. తిరిగి వీటిని మరలా ఓనం పండగ నాడు నిర్వహించడం ఆనవాయితీ.

చిత్రకృప : Ronald Tagra

ఎత్తుమానూర్ మహాదేవ టెంపుల్

ఎత్తుమానూర్ మహాదేవ టెంపుల్

కుమరకోమ్ చుట్టుపక్కల ఉన్న ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ఎత్తుమానూర్ మహాదేవ టెంపుల్. ఇది కేరళ లోని అతి ప్రాచీన శివుని దేవాలయాలలో ఒకటి. గోడలపై అందంగా చిత్రింపబడి ఉన్నచిత్రలేఖనాలకి ప్రసిద్ధి అయిన ఈ గుడిలో ప్రముఖమైన చిత్రం శివుని నృత్యం. ఫిబ్రవరి నుండి మార్చి నెలలలో జరుపుకోబడే ఆరట్టు పండుగ ఇక్కడ ప్రధానంగా జరుపుకునే పండుగ.

చిత్రకృప : telugu Native planet

అరువిక్కుజ్హి ఫాల్స్

అరువిక్కుజ్హి ఫాల్స్

కుమారకోమ్ కి సమీపంలో ఉన్న అరువిక్కుజ్హి ఫాల్స్ అద్భుతమైన జలపాతం. కొట్టాయం పట్టణం నుండి 18 కి మీ ల దూరంలో ఉండడం వల్ల సులభంగా దీనిని చేరుకోవచ్చు. సరదాగా షికారుకి అనువైన ప్రదేశం ఇది. పెద్ద రాళ్ల గుండా 100 అడుగుల ఎత్తు నుండి కిందకి పారే నీటి సెలయేర్ల అందాల అద్భుతం పర్యాటకులకి మధురమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. ఈ ప్రాంతం యొక్క సహజమైన సౌందర్యం ప్రకృతి ప్రేమికులకి మరియు ఫోటోగ్రాఫర్లకి అమితమైన ఆనందం కలిగిస్తుంది. సందర్శన సమయం : సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు.

బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం

బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం

భారత దేశంలో డ్రిఫ్ట్ వుడ్స్ చే తయారు చేయబడిన ఎన్నో కళాఖండాల సేకరణ కలిగిన ఏకైక మ్యూజియం ఈ బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం. ప్రకృతి యొక్క కళా నైపుణ్యం, మానవుడి సృజనాత్మకతకి సాక్ష్యం ఈ మ్యూజియంలో కనిపించే కళాఖండాలు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్ట్స్ లో ఈ మ్యూజియం చోటు దక్కించుకుంది.

సందర్శన సమయం : మంగళ - శని వారాలు 10 am - 1 pm ; ఆదివారం 11: 30 am - 6 pm ; సోమవారం సెలవు.

ఉత్తేజం పొందేందుకు

ఉత్తేజం పొందేందుకు

కేరళలో ఉన్న అద్భుతమైన బీచ్ లలో కుమరకొం బీచ్ ఒకటి. విశ్రాంతి తీసుకుని తిరిగి ఉత్తేజం పొందేందుకు తగిన ప్రదేశం. స్విమ్మింగ్, వాలీ బాల్, ఫ్రిస్బీ వాటర్ స్కయింగ్, పారాసైలింగ్, విండ్ సర్ఫింగ్ మరియు వాటర్ ఏరోబిక్స్ వంటి ఉల్లాసభరితమైన కార్యక్రమాలని ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఉంది.

చిత్రకృప : Prasad Pillai

హోమ్ స్టే లు

హోమ్ స్టే లు

ఈ బీచ్ కి సమీపంలో ఎన్నో రిసార్ట్స్ మరియు హోం స్టేస్ సౌలభ్యం ఉంది. ఈ రిసార్ట్స్, స్పా ట్రీట్ మెంట్స్ మరియు ఆయుర్వేదిక్ మసాజుల సదుపాయం కలిగిస్తాయి.

చిత్రకృప : Isobel Jones

ద్వీపాల సమూహం

ద్వీపాల సమూహం

వెంబనాద్ లేక్ ని వెంబనద్ కాయల్ అని కూడా పిలుస్తారు. దీని పైనే ద్వీపాల సమూహం ద్వారా కుమరకొం ప్రాంతం ఏర్పడింది. సహజమైన నీటి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులని ఆకర్షిస్తుంది. సరస్సు వద్ద బోట్ రేస్ నిర్వహిస్తారు, కేరళ బ్యాక్ వాటార్ పర్యాటకానికి వెన్నెముకగా నిలిచింది.

చిత్రకృప : Earth-Bound Misfit, I

కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ

కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ

కుమరకోమ్‌ లో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్‌ గార్డెన్‌ రిట్రీట్‌లో బోటింగ్‌, ఫిషింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమరకోమ్‌ టూరిస్ట్ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు చేసింది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.

చిత్రకృప : Sarath Kuchi

బ్యాక్ వాటర్స్

బ్యాక్ వాటర్స్

కుమరకొం బ్యాక్ వాటర్స్ అద్భుతమైన అందాలని చూసి ఆనందించడానికి హౌస్ బోటు లో ని ప్రయాణం అనువైన మార్గం. కార్పొరేట్ కాన్ఫరెన్స్ లకి, హాలిడే లకి, హనీ మూన్ లకి ఈ హౌస్ బోట్స్ లో ప్రయాణం మధురమైన అనుభూతిని మిగులుస్తుంది.

చిత్రకృప : Sarath Kuchi

సదుపాయాలు

సదుపాయాలు

ఎన్నో సదుపాయాలతో ఈ హౌస్ బోటు ప్రయాణం పర్యాటకులకి ఆనందాన్ని కలిగిస్తుంది. అందులో లివింగ్ రూమ్, బెడ్ రూమ్స్, కిచెన్, బాల్కనీ, వినోద సాధనాలు మరియు ఆహారం వంటి సదుపాయాలూ ఎన్నో ఈ హౌస్ బోట్స్ లో ఏర్పాటు చేశారు.

చిత్రకృప : Challiyan

పతిరమన్నాల్

పతిరమన్నాల్

వెంబనాద్ సరస్సు మధ్యలో 10 ఎకరాలలో పతిరమన్నాల్ విస్తరించి ఉంది. ఇక్కడికి ఫెర్రి లేదా పడవల ద్వారా చేరుకోవచ్చు. ప్రత్యేక రుతువులలో వచ్చే 50 రకాల జాతుల వలస పక్షులు మరియు ఇక్కడే ఉండే 91 రకాల పక్షి జాతులు అలరిస్తాయి.

చిత్రకృప : Ashwin Kumar

చర్చిలు

చర్చిలు

కుమారకోమ్ లో రెండు క్రైస్తవ భక్తి కేంద్రాలు ఉన్నాయి.రెండూ కూడా సెయింట్ మేరీ చర్చిలే. అయితే ఒకటేమో అతిరంపుజ్హా, మరొకటేమో చెరియపల్లి లో కలదు. మొదటిది కొట్టాయం కు 10 కి.మీ ల దూరంలో, రెండోది కొట్టాయం కు 12 కి. మీ ల దూరంలో ఉన్నాయి. రెండుచోట్లా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వేడుకలు మరియు ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు.

చిత్రకృప : Anil R

జమ్మా మసీద్

జమ్మా మసీద్

కుమారకోమ్ కు 12 కి. మీ ల దూరంలో ఉన్న జమ్మా మసీద్ తాజతంగడి మాస్క్ గా ప్రసిద్ధి చెందినది. వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ మసీద్ ను కేరళ ప్రభుత్వం సంరక్షించవలసిన మాన్యుమెంట్ గా గుర్తించింది.

చిత్రకృప : Shahinmusthafa

కొట్టాయం

కొట్టాయం

బస్ మార్గం : బెంగళూరు, కొచ్చి, కోయంబత్తూర్, తిరువనంతపురం మరియు చెన్నై మొదలగు నగరాల నుండి కుమారకోమ్ కు ప్రభుత్వ బస్సులతో పాటు ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

రైలు మార్గం : కొట్టాయం సమీప రైల్వే స్టేషన్(15 km). స్టేషన్ నుండి టాక్సీ లేదా బస్సులలో కుమారకోమ్ చేరుకోవచ్చు.

విమాన మార్గం : కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపాన కలదు (94 km). క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి కుమారకోమ్ వెళ్ళవచ్చు.

చిత్రకృప : Prasad Pillai

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X