Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందోచ్ !!

ఇండియాలో కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందోచ్ !!

చైనా గోడ గురించి అందరికీ తెలిసిందే !! మన ఇండియాలో కూడా ఒక చైనా గోడ ఉంది అదే కుంభాలఘర్ కోట గోడ. దీని పొడవు చూస్తే ఆశ్చర్యపోవలసిందే !!

By Super Admin

పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?పది తలల రావణాసురుడికి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?

ప్రదేశం : కుంభాలఘర్
జిల్లా : రాజసమండ్
రాష్ట్రం : రాజస్థాన్

రాజస్ధాన్ లోని రాజసమండ్ జిల్లాలోని కుంభాల్ ఘర్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం రాష్ట్రంలోని దక్షిణ భాగంలో కలదు. దీనిని కుమభాల్ మేర్ అని కూడా అంటారు. రాజస్ధాన్ రాష్ట్రంలో కుంభాల్ ఘర్ కోట రెండవ ప్రాధాన్యతగల కోట. దీనిని 15వ శతాబ్దంలో రాణా కుంభ నిర్మించాడు. కోట పై భాగం నుండి పర్యాటకులు విస్తృత దృశ్యాలను చూడవచ్చు. పొడవైన కోటగోడ శత్రువులనుండి రక్షించుకునేందుకు నిర్మించబడింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండవ పొడవైన కోట గోడగా చెపుతారు.

కుంభాల్ ఘర్ లో సైట్ సీయింగ్ ఎలా?

అందమైన ప్రదేశాలే కాక కుంభాల్ ఘర్ లో దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో వేది దేవాలయం, నీలకంఠ మహదేవ దేవాలయం, ముచ్చల్ మహావీర్ దేవాలయం, పరశురాం దేవాలయం, మమ్మదేవ్ దేవాలయం మరియు రాణక్ పూర్ జరైన్ దేవాలయం ప్రసిద్ధి గాంచినవి.

ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి చూశారా ?

వాతావరణం కుంభాల్ ఘర్ ఏడాది పొడవునా అనుకూల వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. అయితే, ఈ ప్రదేశం సందర్శించడానికి అనువైన సమయం అక్టోబరు నుంచి మార్చినెలలు. ఈ సమయంలో పర్యాటకులు కుంభాల్ ఘర్ పర్యటన అధికంగా ఆనందించగలరు.

కుంభాల్ ఘర్ ఫోర్ట్

కుంభాల్ ఘర్ ఫోర్ట్

కుంభాల్ ఘర్ ఫోర్ట్ 15 వ శతాబ్దంలో రాజు రానా కుంభాచే నిర్మించారు. ఈ భారీ కోట 13 శిఖరాలను, వాచ్ టవర్లను, మరియు బురుజులను చుట్టూ కలిగి ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ఇది రెండోపొడవైన గోడగా ఉంది. దీని పొడవు : 38 కిలోమీటర్లు.

కుంభాల్ ఘర్ కోట గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి.

చిత్రకృప : Amitdighe

నీలకంఠ మహదేవ్ దేవాలయం

నీలకంఠ మహదేవ్ దేవాలయం

ఈ దేవాలయం కుంభాల్ ఘర్ కోట సమీపంలో కలదు. ఈ గుడిలో ఆరు అడుగుల శివలింగం ఉంది. ఇక్కడ ఇది ఒకే దేవాలయం. చరిత్ర మేరకు రాణా కుంభ రాజు దీనిని అర్చించే వాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఒకసారి తాను లింగాన్ని అర్చించే సమయంలో తన స్వంత కుమారుడిచే వధించబడినట్లు చెపుతారు.

చిత్రకృప : Sujay25

రానక్ పూర్ జైన దేవాలయం

రానక్ పూర్ జైన దేవాలయం

అధినాద్ దేవునికి చెందిన ఈ దేవాలయం ఆరావళి పర్వత శ్రేణులలో పశ్చిమ ప్రాంతంలో ఉంది. లేత రంగు పాలరాతితో నిర్మింఛినా ఈ కట్టడం ఎంతో అందంగా కనబడుతుంది. ఈ దేవాలయ౦ 48,000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది.

చిత్రకృప : Uncle Alf

కుంభాల ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం

కుంభాల ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం

కుంభాల ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం లో నాలుగు కొమ్ముల జింక లేదా చిరుతపులులు, అడవి, తోడేళ్ళు, ఎలుగు బంట్లు, నక్కలు, సాంబార్ లు, చింకారాలు, చిరుతపులులు, హైనాలు, అడవి పిల్లులు, మరియు కుందేళ్ళు వంటివి చూడడానికి చక్కటి ప్రదేశం.

చిత్రకృప : Ashvij Narayanan

బాదల్ మహల్

బాదల్ మహల్

రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే, కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. వాటిలో బాదల్ మహల్ ఒకటి. దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు పేస్టెల్ రంగు కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి.

చిత్రకృప : Sujay25

ఘనేరావ్

ఘనేరావ్

ఘనే రావు అనేక చిన్న పెద్ద హిందూ దేవాలయాలు గల గ్రామం ఘనే రావు. ఈ ప్రాంతంలో గల 11 జైన దేవాలయాలలో ముచ్చల్ మహావీర్ దేవాలయం, గజానంద్ దేవవాలయం ఈ రెండు ఎంతో ప్రసిద్ది చెందాయి. గజానంద దేవాలయం లో గణేశ దేవుడు, రిద్ధి, సిద్ది దేవతల అందమైన విగ్రహాలను భక్తులు చూడవచ్చు.

చిత్రకృప : Sujay25

మమ్మాదేవ్ దేవాలయం

మమ్మాదేవ్ దేవాలయం

ఈ దేవాలయాన్ని రాణా కుంభ రాజు 1460లో నిర్మించారు. ఈ గుడి కుంభాల ఘర్ కోట కింది భాగంలో కలదు. పర్యాటకులు దీనిపై మేవార్ చరిత్రను శిలా శాసన రూపంలా వ్రాసి ఉండటం గమనిస్తారు. ఇక్కడ వ్రాసిన శాసనం మేరకు చరిత్ర గుహిల్ కాలం నుండి రాణా కుంభ పాలన వరకు కలదు.

చిత్రకృప : Nirvani gandhi

ముచ్చల్ మహావీర్ దేవాలయం

ముచ్చల్ మహావీర్ దేవాలయం

రాజస్థాన్ లోని పాలి జిల్లా లో మహావీర భగవానునికి చెందిన ముచ్చల్ మహావీర్ దేవాలయం ఉంది.ఘనే రావు కు 5 కి.మీ. దూరంలో కు౦భాల్ ఘర్ అభయారణ్యంలో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయంలో శివుడికి మీసాలు కల్గి ఉన్న విగ్రహ౦ ఉంటుంది.

చిత్రకృప : Sujay25

పరశురాం దేవాలయం

పరశురాం దేవాలయం

ఈ దేవాలయం పురాతన గుహలో కలదు. దీనిలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెపుతారు. ఈ గుహను చేరాలంటే పర్యాటకులు సుమారు 500 మెట్లు కిందకు దిగాలి.

చిత్రకృప : Rahul Patnaik

వేది గుడి

వేది గుడి

వేది దేవాలయం కుంభాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ కు సమీపంలో కలదు. ఈ జైన దేవాలయాన్ని రాణా కుంభ నిర్మించాడు. మహారాణా ఫతే సింగ్ తర్వాతి కాలంలో పునరుద్ధరించాడు.

చిత్రకృప : Sutharmahaveer

కుంభాల్ ఘర్ ఎలా చేరుకోవాలి ?

కుంభాల్ ఘర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

ఉదయపూర్, అజ్మీర్, జోధ్ పూర్, పుష్కర్ ల నుండి తరచుగా నడిచే ప్రయివేట్ లేదా ప్రభుత్వ బస్సులలో పర్యాటకులు సౌకర్యవంతంగా కుంభాల్ ఘర్ చేరుకోవచ్చు.

రైలు స్టేషన్

కుంభాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ ఫల్నాలో కలదు. ఇది ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ మరియు జోధ్ పూర్ లకు తరచు ట్రైన్ సర్వీసులు కలిగి ఉంది. ఇక్కడినుండి కుంభాల్ ఘర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.

విమాన ప్రయాణం

కుంభాల ఘర్ ప్రదేశానికి మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా డబోక్ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. మహారాణా ప్రతాప్ విమానాశ్రయంనుండి కుంభాల్ ఘర్ కు ప్రి పెయిడ్ టాక్సీలు దొరుకుతాయి.

చిత్రకృప : Hardikmodi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X