Search
  • Follow NativePlanet
Share
» »కచ్ రాన్ ఉత్సవ ఆనందాలు !

కచ్ రాన్ ఉత్సవ ఆనందాలు !

కచ్ రాన్ ఉత్సవం గుజరాత్ లో డిసెంబర్ నెల లోని పౌర్ణమి నాడు మొదలై సుమారు రెండు నలలపాటు సాగి పర్యాటకులను ఆనందింప చేస్తుంది. ఉత్సవం గురించిన ప్రచారం గుజరాత్ టూరిజం ప్రతినిధి అమితాబ్ బచ్చన్ నోటివెంట జోరుగా సాగుతోంది. ఈ నటుడు చేసే రాన్ ప్రచారం ప్రతి వారికి ఆ అందమైన ప్రదేశం చూసేలా చేస్తోంది. రాన్ ఉత్సవాన్ని గుజరాత్ ప్రభుత్వ టూరిజం శాఖ అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ సాధారణంగా టూరిస్ట్ ల కొరకే నిర్వహిస్తారు. గుజరాత్ కు వచ్చే పర్యాటకులు అక్కడి స్థానిక సంస్కృతిని, ఆహారాలను, వారసత్వాన్ని ఆతిధ్యాలను ఆస్వాదించి ఆనందిస్తారు.

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

 కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

రాన్ అఫ్ కచ్ అంటేనే ఇసుక మెరుపులు. ఇది ఇండియా కు ప్రవేశ ద్వారం. రాత్రి అయ్యిందంటే చాలు నిండు వెన్నల. వెన్నెల్లో ఈ తెల్లటి ఇసుకలు మరింత ప్రకాశవంతం అవుతాయి. ఈ ఇసుక వెన్నెల వెలుగుల రాత్రులతో భూమి ఒక నిండు చంద్రుడిలా వెలిగిపోతుంది.
కొటేషన్ లు గుజరాత్ టూరిజం ప్రచారం నుండి చిత్రాలు వారి రాన్ ఉత్సవ్ సైట్ నుండి పొందబడ్డాయి.
రంగు రంగుల పండుగలు, కళలు, వైభవోపేత అట్టహాసం, జీవిత కాల వెలుగులు ప్రసాదిస్తాయి. కచ్ ప్రాంత పర్యటన చేయండి...రండి గుజరాత్ గురించి తెలుసుకోండి.

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

టూరిజం శాఖ మీ పూర్తి విశ్రాంతి కొరకు గుడారాలు, వసతులు నిర్వహిస్తుంది. ఈ కెంపులు పూర్తి ఎయిర్ కండిషన్ కలిగిన టెంట్ లు. మీ వెకేషన్ కు తగిన ఆనందం అందిస్తాయి.

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

మీ టెంట్ బయట కల ఇసుక వెన్నెల కాంతిలో మెరిసి పోతూ రాత్రి వేల మీకు మరో ప్రపంచం చూపుతుంది. బహుసా మీరు కనే కలలో కొంత భాగం నిజమైనట్లు అనిపిస్తుంది.

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

అందమైన ఈ ప్రదేశానికి అక్కడి ప్రజల రంగు రంగుల దుస్తులు మరింత అందాన్ని ఇస్తాయి. వారి రంగు రంగుల చేతి తయారీ వస్తువులు, వారి జానపద గీతాల ఆలాపనలు మిమ్మల్ని వేరే లోకాలకు తీసుకు వెళతాయి.

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

రాన్ ఉత్సవం చేయటం వెనుక కల ప్రధాన ఉద్దేశం, ప్రపంచానికి గుజరాత్ స్థానిక సంస్కృతి తెలియచేయటం. కనుక, టూరిస్ట్ లు ఇక్కడి అధికారులచే నిర్వహించ బడే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చూడవచ్చు.

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

మీ సందర్శనలో ఈ ప్రదేశంలో చూడవలసిన అనేక ఆకర్షణలు కలవు. వాటిలో భుజ, దోలావీర, మాండవి లోని విజయ విలాస్ పాలస్ వంటివి మీరు తప్పక చూడాలి.

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

కచ్ రాన్ ఉత్సవం - గుజరాత్ ఆనందాలు

అతి సమీపంలోనే మీకు మాండవి బీచ్ అందాలు ఆహ్లాద పరుస్తాయి. వాతావరణం ఎంతో ప్రశాంతంగా వుంటుంది. మెత్తటి ఇసుక అతి మెల్లగా సముద్రంలోకి జారిపోతూ సరికొత్త అనుభూతులు కలిగిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X