Search
  • Follow NativePlanet
Share
» »లడఖ్ ...భారత్, చైనా ల మధ్య అద్భుత ఆకర్షణ !

లడఖ్ ...భారత్, చైనా ల మధ్య అద్భుత ఆకర్షణ !

ప్రపంచంలో అతి ఎత్తైన రోడ్లు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ? అతి ఎత్తైన దారుల గురించి ఎపుడైనా విన్నారా ? తెలియదు అంటే లేదా తెలుసుకోవాలనుకుంటే, ఈ వ్యాసంలో మేము అందించే లడక్ గురించి తెలుసుకోండి. "అతి ఎత్తైన రహదారుల ప్రదేశం" గా లడక్ చెప్పబడుతుంది. సముద్ర మట్టం నుండి ఎంతో ఎత్తున వుండి, నిర్మానుష్యమైన అతి సుందరమైన ప్రదేశం ఇది. మీరు మంచి గుండె ధైర్యం, లేదా సాహస్సలు ఇష్టపడే వారు అయితే, లడక్ ప్రదేశంలోని వివిధ ఆకర్షణలు అన్వేషించి, మీ కన్నులకు విందు చేయండి. సాధారణంగా లడక్ ప్రదేశంలో విభిన్నమైన వాతావరనం వుంటుంది కనుక ప్రయాణం కష్టతరం. అయినప్పటికీ ఈ ప్రదేశం లో కల ఆకర్షణలు మీకు ఎప్పటికపుడు ఉల్లాసం కలిగిస్తూ, మీ శారీరక శ్రమను మరచి పోయేలా చేస్తాయి. అయితే, కొద్దిపాటి ముందు జాగ్రత్తలు ఈ ప్రయాణంలో తప్పక తీసుకోవాలి.

హిమాలయ పర్వత శ్రేణుల మధ్య

హిమాలయ పర్వత శ్రేణుల మధ్య

లడక్ ప్రాంతం హిమాలయ పర్వత శ్రేణుల మధ్య భాగంలో కలదు. ఫోటో క్రెడిట్: : babasteve

ఇక్కడ ఇండో ఆర్యన్

ఇక్కడ ఇండో ఆర్యన్

ఈ ప్రదేశంలోని సంస్కృతి, ఆచారాలు, విభిన్నంగా వుంటాయి. ప్రత్యేకించి, ఇక్కడ ఇండో ఆర్యన్ మరియు టిబెట్ దేశాల ప్రజలు నివాసం వుండటం చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Incomposition

సరిహద్దులు

సరిహద్దులు

చరిత్ర మేరకు లడక్ ప్రదేశం దక్షిణము లో బెలూచిస్తాన్ , సింధు, ఝాన్స్కార్, లాహోరు మరియు స్పితి పట్టణాలు, తూర్పున, అస్సైచిన్, రుదోక్ లను, ఉత్తరం లో నుబ్ర , పట్టణాలు సరిహద్దుల గా కలిగి వుంది. ఫోటో క్రెడిట్: Kunal Mukherjee

ప్రస్తుత లడక్

ప్రస్తుత లడక్

ప్రస్తుత లడక్ ప్రదేశం తూర్పున టిబెట్, దక్షిణంగా లాహోరు మరియు స్పితి, పశ్చిమ భాగంలో జమ్మూ ల నడుమ కలదు. ఉత్తరంగా దూరాన కున్లూన్ మరియు క్సినిజియాంగ్ లను కలిగి వుంది.

ఫోటో క్రెడిట్: GerthMichael

వర్తక వ్యాపారాలు

వర్తక వ్యాపారాలు

పూర్వ కాలంలో వివిధ దేశాలతో జరిగిన వర్తక వ్యాపారాలకు లడక్ ఒక లింక్ ప్రదేశంగా వుండేది.
ఫోటో క్రెడిట్: Karunakar Raykar

టిబెట్ గుండా

టిబెట్ గుండా

1960 ల నుండి, చైనా దేశపు టిబెట్ గుండా మధ్య ఆసియ ప్రదేశానికి వేల్లెటం దుకు సౌకర్యం ఏర్పడటంతో వ్యాపారంలో ఈ ప్రదేశానికి ప్రాధాన్యత తగ్గింది. అయితే, పర్యాటక రంగం దృష్ట్యా ఇంకనూ ప్రాధాన్యత నిలుపుకొంది. ఫోటో క్రెడిట్: Malikbek

 ఆయువు పట్టు

ఆయువు పట్టు

1974 లో భారత ప్రభుత్వం, లడక్ పర్యాటన రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. జమ్మూ , కాశ్మీర్ రాష్ట్రానికి ఇది ఆయువు పట్టు అయినందున ఇక్కడ భారత సైన్యం అధికంగా కనపడుతుంది.

ఫోటో క్రెడిట్: DanHobley

అతి పెద్ద పట్టణం లెహ్

అతి పెద్ద పట్టణం లెహ్

లడక్ లో అతి పెద్ద పట్టణం లెహ్. దీని తర్వాత కార్గిల్ పెద్దది. ఇక్కడ నివసించే వారిని లదాకీ లు అంటారు. కొంచెం అటూ ఇటూ గా, టిబెట్ లోని బౌద్దులే కాగా మిగిలిన వారు షియా ముస్లిం వర్గానికి చెందినా వారు.

ఫోటో క్రెడిట్: Incomposition

 ఆకర్షణలు

ఆకర్షణలు

లడక్ పర్యటనలో మీరు ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు చూడవచ్చు

ఫోటో క్రెడిట్ : Margarita

లెహ్ పాలస్

లెహ్ పాలస్

లడక్ ప్రదేశంలో లెహ్ అతి పెద్ద ఆకర్షణీయ పట్టణం. ఇక్కడ మీరు లెహ్ పాలస్ లేదా రాజ భవనం చూడవచ్చు.

సూర్యాస్తమయం

సూర్యాస్తమయం

లెహ్ ప్రదేశంలో సూర్యాస్తమయం మరియు చంద్రోదయం లు ఒక అసాధారణ దృశ్యంగా పర్యాటకులు చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: 100rabpec

 సుందర ప్రదేశం

సుందర ప్రదేశం

లెహ్ పట్టణంలోని ఒక సుందర పర్యాటక ప్రదేశం

 ద్రాస్ పట్టణం

ద్రాస్ పట్టణం

ద్రాస్ పట్టణం - కార్గిల్ జిల్లాలోని ద్రాస్ ప్రదేశం ఇక్కడ చూడవచ్చు. దీనిని లడక్ ప్రవేశ ద్వారం అంటారు. పర్యటనకు అనువైన ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 3280 మీటర్ల ఎత్తున కలదు.

ఫోటో క్రెడిట్: Rohan

 4400 మీ. ల ఎత్తున

4400 మీ. ల ఎత్తున

ఇక్కడ కల సురు పట్టణం ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 4400 మీ. ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం ఝాన్స్కార్ కు సమీపంలో వుంటుంది.

ఫోటో క్రెడిట్: T. R. Shankar Raman

కార్గిల్

కార్గిల్

కార్గిల్ లడక్ ప్రదేశంలో రెండవ పెద్ద పట్టణం. ఈ పట్టణంలో దేశాని రక్షిస్తూ, భారతీయ సైనికులు అధికంగా కనపడతారు. అయినప్పటికీ ఇది ఒక పర్యాటక ప్రదేశమే.

ఫోటో క్రెడిట్: Saurabh Lall

ఝాన్స్కార్

ఝాన్స్కార్

కార్గిల్ జిల్లాలో ఝాన్స్కార్ ఒక తాలుకా ప్రదేశం. ఇక్కడ మీకు కనపడే ఝాన్స్కార్ పర్వత శ్రేణి సముద్ర మట్టానికి 6000 మీ. ల ఎత్తున వుంది ఝాన్స్కార్ మరియు లడక్ లను వేరుపరుస్తుంది.

ఫోటో క్రెడిట్: Shakti

 జో జి లా

జో జి లా

ఝాన్స్కార్ పర్వత శ్రేణులలో కల జో జి లా రహదారి అతి ఎత్తైన రహదారులలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వాహనాలు నడపటం ఎంతో కష్టమైన పని. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రమాదమే.

లామాయూర్

లామాయూర్

ప్రకృతిలోని వివిధ అద్భుత సహజ దృశ్యాలను ఇక్కడి లామాయూర్ ప్రదేశంలో చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Hamon jp

 సౌందర్యాలు

సౌందర్యాలు

ఝాన్స్కార్ పర్వత శ్రేణి లోని బారా లాచా లా హిమాచల ప్రదేశ్ లోని లాహోల్ ను లడక్ నుండి వేరు చేస్తుంది. ఇది ఒక ఎత్తైన రహదారి. ఇక్కడి నుండి ప్రదేశ సౌందర్యాలు అత్యంత అద్భుతంగా చూడవచ్చు.
ఫోటో క్రెడిట్: GerthMichael

అతి ఎత్తైన ప్రదేశం

అతి ఎత్తైన ప్రదేశం

దేశంలో అతి ఎత్తైన ప్రదేశం చాంగ్ లా. లెహ్ పట్టణం నుండి అందమైన పంగోంగ్ సరస్సు కు వెళ్ళే మార్గంలో ఇది ఒక రహదారి.

ఫోటో క్రెడిట్:SlartibErtfass der bertige

ఇండస్

ఇండస్

లడక్ ప్రదేశంలో ప్రవహించే ఇండస్ మరియు ఝాన్స్కార్ నదులు కలిసే ప్రదేశం ఎంతో మనోహరమైనడిగా వుంటుంది.

ఫోటో క్రెడిట్: Bodhisattwa

హిమ నది

హిమ నది

ద్రంగ్ ద్రుంగ్ హిమ నది లడక్ ప్రదేశంలో మరొక ఆకర్షణ. పంసి లా పర్వత రహదారి సమీపంలోని ఈ హిమ నది కార్గిల్ - ఝాన్స్కార్ మార్గంలో కలదు.

ఫోటో క్రెడిట్: Baumgartnerphotography

కాంగ్ యాజీ

కాంగ్ యాజీ

లడక్ లోని మార్కా ప్రదేశానికి చివరిలో కల కాంగ్ యాజీ ప్రదేశం సముద్ర మట్టానికి ఆరు వేల మీటర్ల ఎత్తున వున్న ఒక అందమైన పర్వతం.

ఫోటో క్రెడిట్: SlartibErtfass der bertige

ఖర్దంగ్ లా

ఖర్దంగ్ లా

లడక్ ప్రదేశం లో కల ఖర్దంగ్ లా పర్వత రహదారి ప్రపంచంలో అతి ఎత్తైన వాహనం నడపగల పర్వత రోడ్డు.

ఫోటో క్రెడిట్: Michael Day

నుబ్రా వాలీ

నుబ్రా వాలీ

లడక్ రాజధాని పట్టణం లెహ్ నుండి సుమారు 150 కి. మీ. ల దూరంలో నుబ్రా వాలీ కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి పది వేల అడుగుల ఎత్తున కలదు. అతి ఎత్తైన ఈ ప్రదేశం ఎంతో అందంగా వుంటుంది.

ఫోటో క్రెడిట్: John Hill

కన్నుల విందు

కన్నుల విందు

కన్నుల విందుగా చూడ దగిన నుబ్రా వాలీ

ఫోటో క్రెడిట్: Ranzen

పంగోంగ్ సరస్సు

పంగోంగ్ సరస్సు

లెహ్ పట్టణం నుండి అయిదు గంటల ప్రయాణంలో అతి సుందరమైన పంగోంగ్ సరస్సు చూడవచ్చు. ఈ సరస్సులో చేపలు సహితంగా అనేక జలచరాలను చూడవచ్చు. దట్టమైన పచ్చటి ప్రదేశాలు కూడా ఇక్కడ కలవు. సుమారు 604 చ. కి. మీ. ల విస్తీర్ణంలో కల ఈ సరస్సు సుమారు అరవై శాతం టిబెట్ దేశంలోనే కలదు. హిందీ చలన చిత్రం త్రీ ఇడియట్స్ చివరి భాగాలను ఈ సుందర ప్రదేశంలో చిత్రీకరించటం ఒక విశేషం.

ఫోటో క్రెడిట్: Ashishinfogr8

పర్వత రహదారి

పర్వత రహదారి

లడక్ ప్రదేశంలో పెన్సి లా మరొక పర్వత రహదారి. ఇది సముద్ర మట్టానికి 4400 మీ. ల ఎత్తున కలదు. ఈ మార్గం సురు మరియు ఝాన్స్కార్ ప్రదేశాలను కలుపుతుంది.

ఫోటో క్రెడిట్: Malikbek

సర్చు లో విశ్రాంతి

సర్చు లో విశ్రాంతి

లడక్ ప్రదేశంలోని లెహ్ - మనాలి హై వే లో కల సర్చు లో విశ్రాంతి పొందవచ్చు. ఇక్కడ టెంట్ లు లభ్యంగా వుంటాయి.

ఫోటో క్రెడిట్: Jen

రెండు మార్గాలు

రెండు మార్గాలు

లడక్ ప్రదేశం చేరటానికి రెండు మార్గాలు కలవు. ఒకట శ్రీ నగర్ లోని కార్గిల్ రోడ్డు లోని జో జి లా పాస్ నుండి చేరవచ్చు. మరొక మార్గం, హిమాచల ప్రదేశ్ లోని మనాలి లోని లెహ్ - మనాలి రాష్ట్రీయ రహదారి గుండా కూడా లడక్ చేరవచ్చు. ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ పర్యాటకులు ముందుగా, అక్కడి హిమపాత పరిస్థితులు గురించిన సమాచారం తెలుసుకొని పర్యటన తలపెట్టాలి.

ఫోటో క్రెడిట్: McKay Savage

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X