Search
  • Follow NativePlanet
Share
» »లాల్ బాగ్ పూల ప్రదర్శన - అందాలు...అద్భుతాలు!

లాల్ బాగ్ పూల ప్రదర్శన - అందాలు...అద్భుతాలు!

ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే లకు బెంగుళూరు లోని లాల్ బాగ్ అందరూ ఉత్సాహంగా ఎదురు చూసే పూల ప్రదర్శనకు ముస్తాబు అవుతుంది. బెంగుళూరు లోని దక్షిణ భాగంలో కల లాల్ బాగ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. లాల్ బాగ్ లో ఇండియా లోని అత్యధిక జాతుల మొక్కలు కలవు. ఇక్కడ ఒక అక్వేరియం , ఒక సరస్సు, మరియు కాక్టిన్ పార్క్ లు కూడా కలవు. ప్రతి సంవత్సరం ఫ్లవర్ షో ఎంతో ఉత్సాహంతో అతి పెద్దదిగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జరిగేది 199 ఫ్లవర్ షో. ఈ పూల ప్రదర్శనకు సుమారు నాలుగు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా.

ఈ ఫ్లవర్ షో వెనుక గల ఉద్దేశ్యం ప్రజలకు లాల్ బాగ్ లో కల వివిధ రకాల మొక్కలను తెలియ చేయటమే. ఈ ప్రదర్శన ద్వారా హార్టికల్చర్ డిపార్టుమెంటు కూడా ప్రజలను మొక్కలు పెంచేందుకు ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి ఈ సంవత్సరం, ఈ డిపార్టుమెంటు పట్టణ ప్రాంతాలలో భవన పై భాగాలలో పచ్చదనపు వాతావరణం కల్పించటం ఎలా అనే అంశంపై కొన్ని వర్క్ షాపులు నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తోంది కూడాను.

ప్రార్ధనా స్థలం

ప్రార్ధనా స్థలం

లాల్ బాగ్ లో కల పూల తోట ఒక పూజా స్థలం గా ఆరాదిన్చబడుతోంది. ఇక్కడ కల వివిధ రకాల మొక్కలు దేశ వ్యాప్త ప్రజలనే కాక, అంతర్జాతీయ టూరిస్ట్ లను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్ర టూరిజం శాఖ, హార్టికల్చర్ డిపార్టుమెంటు సహకారంతో ఈ ఫ్లవర్ గార్డెన్ ను ఒక టెంపుల్ అంత పవిత్రంగా నిర్వహిస్తోంది.

ఫోటో క్రెడిట్: Chris and Hilleary

గ్లాస్ హౌస్

గ్లాస్ హౌస్

లాల్ బాగ్ లో కల అందమైన గ్లాస్ హౌస్ లండన్ లోని క్రిస్టల్ పాలస్ మోడల్ లో నిర్మించారు. దీనిని ప్రిన్సు ఆల్బర్ట్ విక్టర్ రూపొందించగా, జాన్ కెమరూన్ నిర్మాణం చేసారు.

ఫోటో క్రెడిట్ : Nagesh Kamath

పూవుల ప్రదర్శన

పూవుల ప్రదర్శన

లాల్ బాగ్ పూవుల ప్రదర్శన చూసేందుకు సుమారు నాలుగు లక్షల మంది సందర్శకులు వస్తారు. ఈ సంఖ్య ఈ సంవత్సరం మరింత పెరగ వచ్చని భావిస్తున్నారు. ఈ ఫ్లవర్ షో లు ప్రత్యేకించి పిల్లలను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

ఫోటో క్రెడిట్ : Ramesh NG

వినూత్న ఆకారాలు, డిజైన్ లు

వినూత్న ఆకారాలు, డిజైన్ లు

ప్రతి సంవత్సరం, విభిన్న రీతులలో కొత్త అంశాలతో ఈ ప్రదర్శనను డిజైన్ చేసి ప్రజలకు చూపుతున్నారు. ఒక సంవత్సరం మొగల్ గార్డెన్స్ వలే అయితే, మరుసటి సంవత్సరం ఒక ఆర్కిటెక్ట్ వండర్ గా ప్రదర్శిస్తున్నారు. చూపబడే చిత్రం ఆగష్టు 2012 ప్రదర్శనలో చూపబడింది.

ఫోటో క్రెడిట్ : Ramesh NG

 అంద చందాలు

అంద చందాలు

పూవులనేవి ఏ రకంగా ఏర్పరిచినా మనసులను దోచేస్తాయి. మరి అవి వెరైటీ గాను , ప్రత్యేకంగానూ వుండి మరింత ఆకర్షణగా వుంటే మరువలేని అనుభూతిగా వుంటాయి.

ఫోటో క్రెడిట్: rajesh_dangi

 కన్నులకు విందు

కన్నులకు విందు

పూవులనేవి ఏ రకంగా ఏర్పరిచినా మనసులను దోచేస్తాయి. మరి అవి వెరైటీ గాను , ప్రత్యేకంగానూ వుంటి మరింత ఆకర్షణగా వుండి మరువలేని అనుభూతిగా వుంటాయి.

ఫోటో క్రెడిట్: rajesh_dangi

2012 ఆగష్టు ఫ్లవర్ షో

2012 ఆగష్టు ఫ్లవర్ షో


2012 ఆగష్టు లో నిర్వహించిన ఫ్లవర్ షో ఒక టాప్ సక్సెస్. ఈ షో లో ఆధునిక హంగుల ఏర్పాట్లు ఎన్నో చేసారు. అధిక సంఖ్యలో సందర్శకులు ఆకర్షింప బడ్డారు.

 లాల్ బాగ్ విస్తీర్ణం

లాల్ బాగ్ విస్తీర్ణం

లాల్ బాగ్ లోని గ్లాస్ హౌస్ నిర్మాణ సమయంలో లాల్ బాగ్ విస్తీర్ణం 188 ఎకరాలు. ఎంతో ప్రశాంత వాతావరణం, కాలుష్య రహితం అయిన లాల్ బాగ్ బెంగుళూరు లోని ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ప్రదేశమే. ప్రతి రోజూ వాకింగ్ లేదా ఉదయపు యోగా వంటి వాటికి బెంగుళూరు నివాసులు ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

ఫోటో క్రెడిట్ : Vinoth Chandar

అందమైన ఉదయాలు

అందమైన ఉదయాలు

ఉదయం వేళఈ ప్రదేశంలో ఎంతో తాజా అనుభూతులు వుంటాయి. సమీప ప్రదేశాల ప్రజలు ఇక్కడ వాకింగ్, జాగింగ్ వంటివి చేసి ఆనందిస్తారు.

ఫోటో క్రెడిట్ : Nishanth Jois

 మరువలేని సాయంకాలాలు

మరువలేని సాయంకాలాలు

లాల్ బాగ్ లోని సరస్సు వద్ద నుండి లేదా గుట్ట పై నుండి సూర్యాస్తమయం చూసి ఆనందించవచ్చు. ఎంతో అద్భుతంగా ప్రతి వారూ భావిస్తారు.

ఫోటో క్రెడిట్ : Siddhartha Jain

ఫోటో వాక్

ఫోటో వాక్

లాల్ బాగ్ లో ఫోటోల కొరకు అనేక మంది వస్తూ వుంటారు. లాల్ బాగ్ అంతా తిరిగి చక్కని దృశ్యాలు సేకరిస్తారు. ఎంతో మంది యువకులు, ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి కలవారు కలసి ఈ ఫోటో వాక్ లను ఆచరిస్తారు. ఫోటో లు తీసుకోవాలంటే, ఇక్కడ కల సరస్సు ప్రదేశం కెంపే గౌడా టవర్ అద్భుత ప్రదేశాలుగా చెప్పవచ్చు.

ఫోటో క్రెడిట్ : vinod chandar

లాల్ బాగ్ సరస్సు

లాల్ బాగ్ సరస్సు

బెంగుళూరు లోని చక్కగా సమర్ధవంతంగా నిర్వహించబడే సరస్సులలో లాల్ బాగ్ లోని సరస్సు ఒకటి. ఈ సరస్సు ఒడ్డున సాయంకాలాలు కొద్ది సమయం గడిపితే చాలు నగర బిజి జీవితం నుండి ఎంతో రిలీఫ్ గా వుంటుంది.
ఫోటో క్రెడిట్ : Dinuraj K

లాల్ బాగ్ లోని పక్షులు

లాల్ బాగ్ లోని పక్షులు

లాల్ బాగ్ లో సంవత్సరం పొడవునా పక్షులను చూడవచ్చు. ఇక్కడ కల చెట్లు, మొక్కలు పక్షులకు మంచి ఆవాసాలుగా వుండి వాటిని అమితంగా ఆకర్షిస్తాయి. ఇక్కడ మీరు పర్పుల్ హెరాన్, స్పాట్ ఔలేట్ , ఇండియన్ పాండ్ హెరాన్, పెలికాన్ వంటి పక్షులను ఎన్నింటినో చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Ashwin Kumar

మీకు తెలుసా ?

మీకు తెలుసా ?

చెట్లను ప్రేమించే వారు మంచి ప్రేమికులు అయిపోతారు. ఇటీవలి మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా లాల్ బాగ్ లోని కొన్ని చెట్లు తొలగించారు. ఈ చర్య బెంగుళూరు వృక్ష ప్రియులను కోపం తెప్పించి కర్నాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసేలా చేసింది. కనుక, మీరు లాల్ బాగ్ కు వెళుతున్నారా ? అయితే, అక్కడి ఒక చెట్టును గట్టిగా కావలించుకొని ప్రేమించండి, ఎందుకంటే, చెట్లను ప్రేమించే వారు మంచి లవర్స్ అంతే కాదు మంచి మానవతా వాదులుగా కూడా మారతారట.
ఫోటో క్రెడిట్ : Kiran Jonnalagadda


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X