Search
  • Follow NativePlanet
Share
» »హిమాచల్ ప్రదేశ్ - ప్రశాంత హిల్ స్టేషన్ ల నిలయం !

హిమాచల్ ప్రదేశ్ - ప్రశాంత హిల్ స్టేషన్ ల నిలయం !

హిల్ స్టేషన్ లలోని ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం చక్కటి ఆనందాన్ని ఇస్తుంది అనటంలో ఎట్టి సందేహం లేదు. అందులోనూ, ప్రస్తుతం కల ఎండలు, వానలు కలిగించే అసౌకర్యం తప్పక ఏదైనా మంచి పర్యాటక స్థలానికి వెళ్ళాలనిపిస్తుంది.

వెళ్ళేది అధిక పర్యాటకులు లేని ప్రదేశాలు అయితే, ఆ ప్రదేశ ఆనందాలు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

అధిక సంఖ్యాకులకు తెలియని, అందమైన హిల్ స్టేషన్ లు ఉత్తర భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో అనేకం కలవు. వాటిలో కొన్నిటిని మీకు ఈ వ్యాసం మూలకంగా తెలియ చేస్తున్నాము. పరిశీలించండి.

బారోగ్

బారోగ్

బారోగ్ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తున కలదు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఇది ఒక అందమైన హిల్ స్టేషన్. చండి ఘర్ నుండి 60 కి. మీ. ల దూరంలో కలకా - షిమ్లా హై వే లో కలదు. ఈ హిల్ స్టేషన్ నుండి అద్భుత అందాల చూర్ చాంద్ ని శిఖరం చూడవచ్చు. ఇంకనూ మీరు ఇక్కడ కల ఆకర్షనలైన విశాల్ శివ టెంపుల్, దోలాంజి బోన్ మొనాస్టరీ, రేణుక సరస్సు లు కూడా చూడవచ్చు. శోలని దేవి టెంపుల్, పిల్లల పార్క్, జవహర్ పార్క్ వంటివి కూడా మంచి ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలే.

Photo Courtesy: Chanchal Rungta

చంబ

చంబ

తెహ్రి గర్వాల్ జిల్లాలో చంబ ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ కల పాలస్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. చుట్టూ దేవదార్ మరియు పైన్ వృక్షాలు కల ఈ ప్రదేశం ప్రకృతి ప్రియులను బాగా ఆకర్షిస్తుంది. ఇక్కడ ఆపిల్ మరియు అప్రికాట్ తోటలు అధికం. గబ్బర్ సింగ్ నేగి మెమోరియల్ మరియు శ్రీ బాగేశ్వర్ మహాదేవ మందిర్ లు అదనపు ఆకర్షణలు.

Photo Courtesy: Abhishekjoshi

జోగిందర్ నగర్

జోగిందర్ నగర్

జోగిందర్ నగర్ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 2500మీ. ల ఎత్తున కలదు. ఈ పట్టణంలో మూడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ లు కలవు. ఈ ప్రదేశం సైట్ సీయింగ్, పిక్నికింగ్, అంగ్లింగ్, అడ్వెంచర్ క్రీడలు అయిన పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్ లకు ప్రసిద్ధి.

Photo Courtesy: Chanchal Rungta

కియారి ఘాట్

కియారి ఘాట్

అందమైన ఈ ప్రదేశం సోలన్ జిల్లాకు 19 కి. మీ. ల దూరంలో కలదు. ప్రశాంతమైన ఇక్కడి వాతావరణం పర్యాటకులను ఆకర్షించి మరల మరల స్వాగతిస్తుంది. ప్రకృతి ప్రియులు, ఫోటో గ్రాఫర్ లు ఇక్కడకు అధికంగా వస్తారు.

Photo Courtesy: Chanchal Rungta

మశోబ్ర

మశోబ్ర

ప్రసిద్ధి చెందిన మశోబ్రా హిల్ స్టేషన్ షిమ్లా జిల్లాలో కలదు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులను చేస్తాయి. పర్యాటకులు ఇక్కడ ట్రెక్కింగ్, కేమ్పింగ్, పిక్నికింగ్ లు ఆనందించవచ్చు. ఇక్కడే ఒక రక్షిత అటవీ సంరక్షణాలయం కలదు.

Photo Courtesy: Chanchal Rungta

పాలంపూర్

పాలంపూర్

పాలంపూర్ హిల్ స్టేషన్ కాంగ్రా లోయలో కలదు. అందమైన దృశ్యాలు, ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను ముగ్ధులను చేస్తాయి. పైన్ , దేవదారు వృక్షాలతో దట్టమైన అడవులు అనేక జలపాతాలు కలిగి స్వాగతిస్తాయి. ఇతర వాణిజ్య పర ప్రదేశాల వాలే కాక ఈ ప్రదేశంలో పూర్తి విశ్రాంతి లభిస్తుంది. పాలంపూర్ ను రాష్ట్ర టీ రాజధాని గా పేర్కొంటారు. ఇక్కడ నుండి వివిధ బ్రాండ్ ల టీ ఎగుమతి అవుతుంది.

Photo Courtesy: Sumeet Jain

హరి పుర్ధార్

హరి పుర్ధార్

హరి పుర్ధార్ హిమాచల్ ప్రదేశ్ లో ని సిర్మౌవు జిలాలో ఒక అందమైన చిన్న టవున్. ఈ పట్టణం ఎత్తైన ప్రదేశంలో ఒక లోయ లో కలదు. సముద్ర మట్టానికి సుమారు 2500 మీ. ల ఎత్తున కలదు. ' ఈ పట్టణం ను గతంలో 'దుంగ భంగాయాని ' అని పిలిచేవారు. గతంలో సిర్మౌర్ కు ఇది వేసవి రాజధాని గా వుండేది. ఇక్కడ కల భంగ యాని మాతా టెంపుల్ ప్రసిద్ధి.

Photo Courtesy: Chanchal Rungta

రేవల్సార్

రేవల్సార్


రేవల్సార్ సముద్ర మట్టానికి 1350 మీ. ల ఎత్తున కలదు. ఇక్కడ కల మండి మూడు ఆరామాలతో మరియు మూడు హిందూ టెంపుల్స్ తో ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం గా చెప్పబడుతుంది. ఇక్కడ పద వ సిక్కుల గురువు అయిన గోవింద్ సింగ్ కొంత కాలం నివసించా టం చే సిక్కులకు కూడా ఈ ప్రదేశం పవిత్రమైనది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పండుగలు అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి.

Photo Courtesy: John Hill

నహాన్

నహాన్

నహాన్ పట్టణం లో దట్టమైన పచ్చటి అడవులు మరియు మంచు చే కప్పబడిన పర్వత శిఖరాలు కలవు. ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ కొండలలో కలదు. నహాన్ పట్టణం లో అనేక కోట లు, టెంపుల్స్ , సరస్సులు కూడా కలవు. రేణుక సరస్సు దాని 3214 మీ. ల వైశాల్యం తో అతి పెద్ద సరస్సుగా చెప్పబడుతుంది. నహాన్ టవున్ మధ్య భాగంలో కల రాణి తాల్ సరస్సు, ఒక దేవాలయం, కొలనులు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. రాణి తాల్ ఒకప్పుడు నహాన్ రాచ కుటుంబీకుల అవసరాలను తీర్చేది. ఇటీవలే దీనిని పబ్లిక్ కు తెరిచారు. ఇక్కడే ఒక అందమైన తోట కూడా కలదు.

Photo Courtesy: Chanchal Rungta

సోలన్

సోలన్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సోలన్ ఒక అందమైన జిల్లా. ఇక్కడ మాష్ రూమ్ లు అధికంగా పండటం చే దీనిని 'మాష్ రూమ్ సిటీ అఫ్ ఇండియా ' అని కూడా అంటారు. సముద్ర మట్టానికి 1467 మీ. ల ఎత్తున కల సోలన్ ప్రదేశం అక్కడి ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. హిందువుల దేవత, మరియు ఈ ప్రాంత అది దేవత అయిన శోలోని దేవి కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రదేశం అంతా దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు కలిగి వుంటుంది.
Photo courtesy: Bhanu Sharma Solan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X