అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

మన మధ్య ఉన్న చార్మినార్ వెనుక ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి !

Updated: Thursday, May 25, 2017, 13:16 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఇండియాలో రాబోతున్న టాప్ 6 మెగా టెంపుల్స్ ఏవేవో తెలుసా?

తండ్రి వేసిన కొత్త పట్టణ నిర్మాణ పునాదులపై ఒక అత్యంత సుందరమైన భాగ్యనగరాన్ని నిర్మించిన అతనెవరు? సౌందర్యప్రదేశానికి పెట్టింది పేరుగా నిర్మించిన ఆ పట్టణానికి తన ప్రేయసి పేరు పెట్టుకున్న ఆ రాజు ఎవరు? బాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకొని,తర్వాత ఆమె పేరుమీదే ఒక నగరాన్ని నిర్మించిన అతను ఇంతకు ఎవరు? ఆవిడ పేరు మీద నిర్మించబడిన ఆ పట్టణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సుమారు 400 ఏళ్ల నుండి తెలంగాణ ప్రాంతంలో వున్న ఏకైక పెద్ద పట్టణం కుతుబ్ షాహీల రాజ్యానికి తొలి రాజధాని గోల్కొండ నగరం. ఈ గోల్కొండ కోట కాకతీయుల కాలంలో క్రీ.శ. 1143 లో నిర్మితమైనది. ఓరుగల్లును పాలించిన ప్రభువు క్రిష్ణదేవ్ దీనిని క్రీ.శ. 1363లో బహమనీ సుల్తాన్ మొదటి మహ్మద్ షా కు అప్పగించాడు. కాలక్రమంలో అప్పటి బహమనీ సుల్తాన్ మహమూద్ క్రీ.శ.1496లో సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్-ముల్క్ ను గోల్కొండ తరఫ్ దార్ గా నియమించారు. బహమనీ రాజ్యం పతనమవుతున్న కాలంలో సుల్తాన్ కులీకుతుబ్ షా క్రీ.శ. 1518లో స్వాతంత్ర్య రాజై గోల్కొండను రాజధానిగా చేసుకొని ఆ మేరుకు పట్టాభిషక్తుడైనాడు.తర్వాత ఇబ్రహీం కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ జనాభా పెరిగిపోయింది. నీటి వసతులు సరిగా లేకుండా అంటువ్యాధులు ప్రబలినాయి.

పట్టణాన్ని విస్తృత పరచటం కోసం అతడు మూసీ నదిపై పురానాపూల్ నిర్మించాడు. అలా కొత్త పట్టణ నిర్మాణానికి పునాదులు వేసాడు. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా మరణానంతరం అతని కుమారుడు కులీ కుతుబ్ షా నూతన పట్టణ నిర్మాణం కోసం ఒక బృహత్ ప్రణాలికను సిద్ధం చేయించి ఆ మేరకు మూసీ నది ఒడ్డున ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ నూతన నగరమే భాగ్యనగరంగా హైదరాబాద్ గా పేరుగాంచింది. మూసీ నది ఒడ్డున నిర్మించిన ఆ సుందర నగరాన్ని కులీ కుతుబ్ షా తన ప్రియురాలు బాగ్ మతి అంటే బాగమతి,బాగ్ నగరమని భాగ్యనగరమని పిలిచారు. భాగ్యనగరం హైదరాబాద్ అయ్యింది.ప్రపంచ ప్రసిద్ధ సుందర నిర్మాణాలలో హైదరాబాద్ చార్మినార్ ఒకటి.

నాలుగు గోపురాలతో కూడిన అందమైన చార్మినార్

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. షాపింగ్ సందడి

చార్మినార్ వద్ద షాపింగ్ చాలా సందడిగా ఉంటుంది. ప్రతి సాయంత్రం, శని, ఆదివారాలు మరియు సెలవు దినాలలో ప్రజలు షాపింగ్ చేయటానికి ఇక్కడికి వస్తుంటారు.

PC: Prasanth Kumar Dasari

 

2. చార్మినార్‌

చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం. నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే.

PC: www.flickr.com

 

3. అందరకీ తెలియని అద్భుతం

కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

PC: www.flickr.com

 

4. చార్మినార్ ఎలా చేరుకోవాలి ?

చార్మినార్ పాతబస్తీ లో కలదు. కనుక అఫ్జల్ గుంజ్ వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించి, అక్కడి నుండి ఆటోలో చార్మినార్ చేరుకోవచ్చు. ఎందుకంటే సిటీ బస్సులు ఎక్కువగా అఫ్జల్ గుంజ్ కు తిరుగుతాయి.

చిత్రకృప : Karthik Uppaladhadiam

 

5. ట్రై చేయండి

చార్మినార్ వద్ద ప్రతి గళ్ళీలో అత్తరు సీసాలు, రుమాలు, పాన్ షాపులు ఉంటాయి. పండ్లు, చెఱుకు రసాలు తక్కువకే దొరుకుతాయి. ట్రై చేయండి. బిరియాని అంటే గుర్తుకొచ్చింది!! ఇక్కడ హోటల్ రుమాన్, శాలిబండ రోడ్ లో షాహ్ గౌస్ రెస్టారెంట్, విక్టోరియా రెస్టారెంట్, హోటల్ అర్మాన్, హోటల్ షాదాబ్ వంటి బిర్యాని రుచులను అందించే హోటళ్ళు అనేకం ఉన్నాయి.

చిత్రకృప : Mkamath1976

 

6. చార్మినార్ వద్ద షాపింగ్

చార్మినార్ వద్ద షాపింగ్ చాలా సందడిగా ఉంటుంది. ప్రతి సాయంత్రం, శని, ఆదివారాలు మరియు సెలవు దినాలలో ప్రజలు షాపింగ్ చేయటానికి ఇక్కడికి వస్తుంటారు. బంగారు షాపులు, గాజుల షాపులు, బట్టల షాపులు ఇక్కడ ఎక్కువ. బేరమాడాలి సుమీ !! తినటానికి అనేక చిరుతిండ్లు ఇక్కడ దొరుకుతాయి. అయినప్పటికీ చాయ్, సమోసా ఇక్కడ ఫెమస్. ఇరానీ చాయ్ తప్పక తాగం

చిత్రకృప : Debajyoti Das

 

7. ప్లేగు వ్యాధి నివారణకు

గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591 వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించాడు.
చిత్రకృప : GoDakshin

8. నాలుగు మినార్లు

ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి.

చిత్రకృప : Raju Neyyan

 

9. డోమ్ లు

ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. మెదటి, రెండవ అంతస్తులలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి.

చిత్రకృప : Sujith Gopinath

 

10. మెట్లు

మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి.

చిత్రకృప : Kartik Sirur

 

11. బాల్కనీలు

ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి.

చిత్రకృప : Sujith Gopinath

 

12. ఆర్చ్ లు

ఆర్చ్‌ల రూపకల్పనలోనూ, మెట్ల నిర్మాణంలోను నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి.

చిత్రకృప : Ramakrishna Reddy Y

 

13. గ్యాలరీలు

చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి.

చిత్రకృప : Vu2sga

 

14. చారిత్రాత్మక కట్టడం

ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చిత్రకృప : Ramnath Bhat

15. నిర్మాణ శైలి

చార్మినార్‌కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు.
చిత్రకృప : Yashwanthreddy.g

English summary

Let's Take A Travel to Charminar !

The Charminar, constructed in 1591 CE, is a monument and mosque located in Hyderabad, Telangana, India.
Please Wait while comments are loading...