Search
  • Follow NativePlanet
Share
» »అమృతేశ్వరస్వామి దేవాలయంలోని అద్భుత శిల్ప కళా చాతుర్యం

అమృతేశ్వరస్వామి దేవాలయంలోని అద్భుత శిల్ప కళా చాతుర్యం

భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం. భక్తులు మరియు దేవాలయాలు ఇక్కడ చాలా ఎక్కువ. అనేకమంది భక్తులు మరియు రాజులచే నిర్మించబడిన ఆలయాలలో అనేక చారిత్రక విజయాలు కలిగిన దేవాలయాలు వున్నాయని గర్వంగా చెప్పుకోవచ్చును.

By Venkatakarunasri

భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం. భక్తులు మరియు దేవాలయాలు ఇక్కడ చాలా ఎక్కువ. అనేకమంది భక్తులు మరియు రాజులచే నిర్మించబడిన ఆలయాలలో అనేక చారిత్రక విజయాలు కలిగిన దేవాలయాలు వున్నాయని గర్వంగా చెప్పుకోవచ్చును.

కర్ణాటకలోని ఇలాంటి కొన్ని ఆలయాలలో అమృతేశ్వర ఆలయం ఒకటి.

ఇప్పుడు మనం ఈ ఆలయ నిర్మాణ శైలి యొక్క రహస్యాలు తెలుసుకుంటాం.

అమృతేశ్వరస్వామి దేవాలయంలోని అద్భుత శిల్ప కళా చాతుర్యం

1. హొయసల రాజులు

1. హొయసల రాజులు

10 వ మరియు 14 వ శతాబ్దాల్లో హొయసల పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారు పాలించిన ఈ ప్రాంతం వాస్తు శిల్పాలకు ప్రసిద్ధి.

PC: Dineshkannambadi

2. అమృతేశ్వర ఆలయం

2. అమృతేశ్వర ఆలయం

ఈ దేవాలయాన్ని 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక హొయసల రాజు రెండవ వీర బల్లాల్ కట్టించాడు. ఈ గ్రామానికి అతి చేరువలో ఉన్న తరికెరిలో భద్ర నది రిజర్వాయిరు ఉంది.

PC: Dineshkannambadi

 3. అద్భుతమైన అలంకారమైన దేవాలయాలు

3. అద్భుతమైన అలంకారమైన దేవాలయాలు

11-12 శతాబ్ధాల మధ్య కర్ణాటకని పరిపాలించిన హొయసల రాజులు మలనాడుకి దగ్గరలో అనేక నగరాలు, పట్టణాలు నిర్మించారు. ఈ పట్టణాలలో అత్యంత అద్భుతమైన అలంకారమైన దేవాలయాలు నిర్మించారు. ఈ పట్టణాలు, దేవాలయాలు ఒకదానికి మరోకటి అతి దగ్గరలో ఉండడం విశేషం.

PC: Dineshkannambadi

4. ఒకే విమానం

4. ఒకే విమానం

హొయసల రాజుల కాలంలో శిల్ప కళాచాతుర్యానికి ఈ దేవాలయ బయటి మండపం ఒక ప్రతీక. ఈ ఆలయ బయటి మండపం తాటి, కొబ్బరి తోటల మధ్య ఉంది. వెలుపలి మండపం బయటి గోడలపై అత్య అద్భుతంగా గుండ్రటి ఆకారంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయంకి ఒకే విమానం ఉండడం వల్ల ఏకకుట అని పిలుస్తారు.

PC: Chidambara

5. గుడి నిర్మాణ శైలి

5. గుడి నిర్మాణ శైలి

వెలుపలి మండపం నుండి లోపలికి వెళ్ళితే లోపలి మండపం వస్తుంది. ఈ గుడి నిర్మాణ శైలి, మండపాలు బెల్‌వాడి నందున్న విద్యానారాయణ దేవాలయ శైలిని పోలి ఉంటుంది. వెలుపలి మండపంలో 29 దీర్ఘచతురస్ర విభాగాలు, లోపలి మండపంలో 6 దీర్ఘచతురస్ర విభాగాలు ఉన్నాయి.

PC: Pramod jois

6.కీర్తిముఖులు

6.కీర్తిముఖులు

లోపలి గర్భ గుడి చతురస్రాకారంలో ఉండి, గర్భ గుడి శిఖరంపై భాగంలో కీర్తిముఖులు చెక్కబడి ఉన్నారు . ఈ కీర్తి ముఖుల క్రింది భాగం దేవతా శిల్పాలు లేవు. సుఖాశిని పై హొయసలరాజుల రాజ చిహ్నమైన శాల పులితో యుద్ధం చేస్తు సంహరిస్తున్న శిల్పం ఉంది.

PC: Dineshkannambadi

7. ఇతిహాసాలు

7. ఇతిహాసాలు

వెలుపలి మండపం బయటి గోడలపై 140 పలకల మీద భారత ఇతిహాసాలు చెక్కబడ్డాయి. మిగతా హొయసల దేవాలయల వలే ఇక్కడి దేవాలయం పై చెక్కబడిన శిల్పాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా చెక్కబడ్డాయి. వెలుపలి మండపం దక్షిణం వైపు గోడపై రామాయణ కథ 70 పలకలపై అపసవ్య దిశలో చెక్కబడింది. ఉత్తర గోడపై 25 పలకలపై శ్రీకృష్ణ జీవిత చరిత్ర, మిగిలిన 45 పలకలపై మహాభారతం చెక్కబడింది.

PC: Dineshkannambadi

8.శిల్పాలు

8.శిల్పాలు

ఈ ఆలయంలోని గోపురంలోని పైకప్పు మీద, లోపలి మండపంలోను శిల్పాలు చెక్కాడు.ఈ దేవాలయ ముంగిటిలో ఉన్న పెద్ద శిలలపై అప్పటికి కన్నడ కవి జన్నచే కూర్చబడిన సాహిత్యం, కవితలు చెక్కబడి ఉన్నాయి.

PC: Dineshkannambadi

9. ఎలా వెళ్ళాలి?

9. ఎలా వెళ్ళాలి?

అమృతపుర కర్ణాటక రాష్ట్రంలో చిక్‌మగళూరు జిల్లాలో జిల్లా రాజధాని చిక్‌మగళూరుకి 67 కి.మి దూరంలో ఉత్తరాన ఉంది. హసన్కు 110 కి.మి దూరంలో, షిమోగాకు 35 కి.మి దూరంలో జాతీయ రహదారి 48 మీద ఉన్నఈ గ్రామంలో ప్రసిద్ధమైన అమృతేశ్వరస్వామి దేవాలయం ఉంది.

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X