Search
  • Follow NativePlanet
Share
» »రాధాకృష్ణుల ప్రేమందిరం ... బృందావనం !

రాధాకృష్ణుల ప్రేమందిరం ... బృందావనం !

ప్రేమమందిరం ప్రసిద్ధ హిందువుల పుణ్యక్షేత్రం. ఉత్తరప్రదేశ్ మధురలోని బృందావనం సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం ఇది. జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు.

By Staff

 భారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలు భారతదేశంలోని 10 దేవాలయాలలోని విభిన్న రకాల ఆచారాలు

ప్రేమమందిరం ... భారతదేశంలో ప్రసిద్ధ హిందువుల పుణ్య క్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ మధురలోని బృందావనంకు సమీపంలో కలదు. బృందావనం కు గల ఇతర పేర్లు వ్రిందావన్, బ్రాజ్. బృందావనం యమునా నది ఒడ్డున కలదు. బృందావనం గొప్పతనాన్ని చాటిచెప్పే 5000 ఆలయాలు ఇక్కడ ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !

ప్రేమమందిరం బృందావనం సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం. ఇది కృషునిని దేవాలయాలలో నవీనమైనది మరియు దీని నిర్మాణ కర్త ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు అయినా "క్రిపాల్మహారాజ్" చే స్థాపించబడింది. బృందావనం ను తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు.

శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం

బృందావనం అంతా శ్రీకృషుని వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఆలయం శ్రీకృష్ణుని జీవితగాధలతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రదేశం అంతా శ్రీకృష్ణుడు నడియాడినదే కనుక హిందువుల పవిత్ర స్థలంగా పేరుగాంచినది. శ్రీకృష్ణుని ప్రేమమందిరం గురించి కొన్ని మాటల్లో ... !

సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్ !

ప్రేమమందిరం

ప్రేమమందిరం

ప్రేమమందిరం దేవాలయ ప్రధాన నిర్మాణం చలువరాతితో తయారై అందంగా కనిపిస్తుంది. ఈ కట్టడం సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రతిబింబంగా కనిపిస్తుంది.

చిత్రకృప : Bhavishya Goel

ముఖ్యఘట్టాలు

ముఖ్యఘట్టాలు

ప్రేమమందిరం దేవాలయం నలువైపులా శ్రీకృష్ణుడు మరియు అతని అనుయాయులతో కూడిన ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. ఈ దేవాలయ శంకుస్థాపన జనవరి 2001 లో "క్రిపాలు మహరాజ్" అనే ఆధ్యాత్మిక గురువుచే చేయబడింది ఈ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఫిబ్రవరి 17, 2012 న జరిగినవి.

చిత్రకృప : T.sujatha

ప్రధాన దైవం

ప్రధాన దైవం

ఈ దేవాలయం ప్రజల దర్శనార్థం ఫిబ్రవరి 17, 2012 నుండి ప్రారంభించబడింది. ఈ దేవాలయ నిర్మాణ ఖర్చు 150 కోట్లు ($23 మిలియన్లు) అయినది. ఈ దేవాలయ ప్రధాన దైవం సీతారాములు మరియు రాధా కృష్ణులు.

చిత్రకృప : cat_collector

నిపుణులు, కళాకారులు

నిపుణులు, కళాకారులు

ప్రేమమందిరం నిర్మాణంలో 800 మంది కళాకారులు, నైపుణ్యముగల పనివారు మరియు నిపుణులు పాలుపంచుకున్నారు. వీరు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి,పగలు నిరంతరం కృషి చేసి అసలైన సోమనాథ్ దేవాలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్స్ తో నిర్మాణం చేశారు.

చిత్రకృప : Officialamit

రోబోటిక్ యంత్రాలు

రోబోటిక్ యంత్రాలు

ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. దీనికయ్యే ఖర్చు 150 కోట్లు. దీని నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బుల్స్ వాడిరి. దీని నిర్మాణం కోసం మార్బుల్స్ చెక్కుటకు ప్రత్యేకంగా కూకా రోబోటిక్ యంత్రాలను వాడారు.

చిత్రకృప : Biswarup Ganguly

సంస్కృతి

సంస్కృతి

ఈ దేవాలయం పొడవు 122 అడుగులు మరియు వెడల్పు 115 అడుగులు దక్షిణ భారతదేశ సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది. ఇది మందమైన గోడలు, స్వచ్ఛమైన మార్బుల్స్ కలిగిన భారీ మార్బుల్ నిర్మాణం.

చిత్రకృప : KuwarOnline

సందర్శన సమయం

సందర్శన సమయం

ఆలయాన్ని ఉదయం 5 : 30 నుండి రాత్రి 8 : 30 వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు.

చిత్రకృప : Biswarup Ganguly

మ్యూజికల్ మరియు డీజిటల్ ఫౌంటైన్

మ్యూజికల్ మరియు డీజిటల్ ఫౌంటైన్

వేసవికాలంలో : 7.30PM నుండి 8.00PM

శీతాకాలంలో : 7.00PM నుండి 7.30PM

చిత్రకృప : Biswarup Ganguly

ఆలయ కాంప్లెక్స్

ఆలయ కాంప్లెక్స్

ఆలయ కాంప్లెక్స్ లో ఆహార మరియుపానీయాలకు భోజనఫలహారశాల, పాదరక్షలు ఉచితంగా భద్రపరచుటకు క్లాక్ రూం, దేవాలయంలో పరిమితంగా వాహనాలను పార్కింగ్ చేయు స్థలం మొదలుగునవి కలవు. వ్యక్తిగతమైన వస్తువులు అనగా కెమేరా, మొబైల్, హాండ్ బ్యాగులు మొదలగునవి తీసుకుని రావచ్చు. పొగతాగుట నిషిద్ధం.

చిత్రకృప : KuwarOnline

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

కాళియమర్దనం దృశ్యం

చిత్రకృప : KuwarOnline

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

శ్రీకృష్ణుని రాసలీలలు

చిత్రకృప : KuwarOnline

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Akshaybussi

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : T.sujatha

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : KuwarOnline

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Rishabh gaur

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Parfen Rogozhin

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : Biswarup Ganguly

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : T.sujatha

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : T.sujatha

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : T.sujatha

దృశ్యరూపంలో

దృశ్యరూపంలో

ప్రేమమందిరం దృశ్యరూపంలో

చిత్రకృప : T.sujatha

బృందావనం లో ఇతర సందర్శన స్థలాలు

బృందావనం లో ఇతర సందర్శన స్థలాలు

బంకే బిహారీ ఆలయం, గోవింద్ దెవొ టెంపుల్, మదన్ మోహన్ టెంపుల్, జైపూర్ టెంపుల్, కేసి ఘాట్, గోపేశ్వర్ మహాదేవ్ ఆలయం మరియు ఇతరములు చూడదగ్గవి.

చిత్రకృప : Atarax42

హోటళ్లు, రుచులు

హోటళ్లు, రుచులు

యాత్రికులకు మథుర వసతికై సూచించదగినది. ఇక్కడ అనేక హోటళ్ళు, రిసార్ట్ లు ఉన్నాయి. అందులో డీలక్స్, సెమి డీలక్స్, ఏసీ, నాన్ ఏసీ గదులు దొరుకుతాయి. ఉత్తర భారత వంటాకాలు రుచి చూడవచ్చు.

చిత్రకృప : telugu native planet

బృందావనం ఎలా చేరుకోవాలి ?

బృందావనం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : బృందావనం కు సమీపాన 150 కి. మీ ల దూరంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని వ్రిందావన్ సందర్శించవచ్చు.

రైలు మార్గం : మథుర రైల్వే స్టేషన్ పదకొండు కిలోమీటర్ల దూరంలో కలదు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట టాక్సీ లేదా ఆటో లేదా బస్సులలో బృందావనం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : ఢిల్లీ, అలహాబాద్, ఆగ్రా మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మథుర వరకు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్రకృప : cat_collector

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X