అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

లింగం తలభాగం నుంచి చీల్చబడినట్లుగా వుండే శివుని ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

Written by: Venkatakarunasri
Updated: Friday, June 23, 2017, 10:11 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: కేరళ రక్తపు వర్షం నిజమా?

పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి.

మహాభక్తుడైన ఉపమన్యుడు ఈ ప్రదేశంలో క్షీరాన్ని పొందడంతో ఉపమన్యుపురమనీ, పాలకొలను అనీ పేర్లు వచ్చాయంటారు. పాలకొలను అనే పేరు జనవ్యవహారంలో పాలకొల్లు అయింది. పాలకొల్లు అన్న పేరుకు సంస్కృతీకరణగా క్షీరారామం అన్న వ్యవహారం కూడా వుంది.

లింగం తలభాగం నుంచి చీల్చ బడినట్లుగా వుండే శివుని ఆలయం ఎక్కడో మీకు తెలుసా. రండి చూద్దాం. దేశంలో ప్రతిష్టించబడిన శివుని ఆలయాలన్నింటిలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది.
అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంకు చెందిన శివ దేవుని చిక్కాల గ్రామంలో ఒక ప్రత్యేకత వుంది.

లింగం తలభాగం నుంచి చీల్చబడినట్లుగా వుండే శివుని ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

1. దేవాలయం ప్రత్యేకత

ఈ దేవాలయంలో 3 1/2 అడుగుల పొడవు, అడుగు వ్యాసార్థంతో వున్న లింగం తలభాగం నుంచి చీల్చబడినట్టుగా చీలికతో వుంటుంది.

pc:youtube

 

2. శివాలయం ప్రాధాన్యత

ఈ శివాలయం ఉండబట్టే చిక్కాల గ్రామం బాగా అభివృద్ది చెందుతూ వస్తూ వుంది.

pc:youtube

 

3. స్థల పురాణం గురించి తెలుసుకుందాం

పూర్వం రామాయణ కాలంలో లంకతో యుద్ధానికి ముందు శివపూజ చేసిన తర్వాత లంకకు పయనమైతే మంచిదని పెద్దలు చెప్పగా,శ్రీరాముడు ఆ పూజాకార్యక్రమాలను సిద్ధం చేస్తాడు.

pc:youtube

 

4. శ్రీరాముని ఆదేశం

అప్పుడు శివలింగంను తీసుకురావాల్సిందిగా హనుమంతునికి శ్రీరాముడు ఆదేశిస్తాడు.

pc:youtube

 

5. శ్రీరాముని ఆదేశం శిరసావహించిన హనుమంతుడు

తన స్వామి చెప్పటమే ఆలస్యం హనుమంతుడు వెంటనే హిమాలయాల నుంచి బయలుదేరతాడు.

pc:youtube

 

6. శ్రేష్టమైన తెల్లని శిల ప్రతిష్ట

ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకుని తిరిగి పయనమౌతాడు.

pc:youtube

 

7. కాళిందిమడుగు

మార్గమధ్యంలో శివదేవుని చిక్కాల ప్రాంతానికి హనుమంతుడు చేరుకునేసరికి సాయంత్రం అవ్వడంవల్ల సంధ్యావందనం పాటించటానికి ఆ శిలను కాళిందిమడుగు అనే సరోవరం తీరంలో వుండే ఒక చిన్న గుట్టపై దించేందుకు ప్రయత్నిస్తాడు.

pc:youtube

 

8. సరస్సులో పడిపోయిన శిల

అప్పుడు ఆ శిల చేయిజారి సరస్సులో పడిపోతుంది.

pc:youtube

 

9. హనుమంతుడు వెలికి తీసిన శిల

దాంతో హనుమంతుడు ఆ సరస్సులో దూకి జారిపోయిన ఆ శిలను వెలికితీస్తాడు.

pc:youtube

 

10. తలభాగం నుంచి సగం వరకు పగిలిపోయిన శిల

అయితే ఆ శిల తలభాగం నుంచి సగం వరకు పగిలిపోయివుండటాన్ని గమనించిన ఆయన ఇలా జరిగిందేమని దానిని ఆ గుట్టపై వుంచటమే ఉత్తమమని భావించి శిలను తలచిన ప్రదేశంలో ప్రతిష్టించాడు.

pc:youtube

 

11. ఆ లింగమే శివదేవుడు

అలా ఆ విధంగా ఆయన ప్రతిష్టించిన ఆ లింగమే శివదేవునిగా పిలవబడుతుంది.

pc:youtube

 

12. తెలుపు గోధుమ వర్ణాల శివలింగం

ఇప్పటికీ దాదాపు 3 1/2 అడుగులతో తెలుపు గోధుమ వర్ణాల ఈ శివలింగం అలాగే సగం పగులుతో రెండు ముక్కలుగా కనిపిస్తుంది.

pc:youtube

 

13. కాళింది మడుగు

దీని ప్రక్కనే వున్న కాళింది మడుగులో పెద్ద తాండవకృష్ణుని శిల్పం వుంది. ఆ పగిలిన లింగాన్ని ప్రతిష్టించిన తర్వాత హనుమంతుడు మరో శిల కోసం తిరుగుప్రయాణమయ్యాడు.

pc:youtube

 

14. ఇసుక లింగం ఎలా తయారయ్యింది?

హనుమ ఎంతకూ తిరిగిరాకపోవటం వల్ల రాముడు ఇసుకతో లింగాన్ని తయారుచేసి పూజ పూర్తిచేస్తాడు.

pc:youtube

 

15. రామేశ్వరంలో ప్రతిష్టించిన లింగం

అనంతరం లంకకు హనుమంతుడు తీసుకువచ్చిన లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించారు.

pc:youtube

 

16. చుట్టుపక్కల చూడదగినవి

ఇక్కడ నుండి 8 కిలోమీటర్ల దూరంలో పంచమరామాలలో ఒకటైన క్షీర రామలింగేశ్వర క్షేత్రం చూడవలసిన క్షేత్రం. ఈ ప్రదేశం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వున్న మరొక పంచమరామ క్షేత్రం భీమవరం, గుణిపూడిలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం.

pc:youtube

 

17. పండుగలు

శివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో లక్ష బిల్వర్చాన ఆరాధన నిర్వహిస్తారు. శివరాత్రి రధోత్సవం, లక్ష కుంకుమార్చన, చండి యాగం తదితరాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటారు.

pc:youtube

 

18. ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు మీకు తెలుసా

అనేకమంది భక్తులు పిల్లలను పొందాలనే కోరికతో, ఈ ఆలయ తోటలో కొబ్బరి చెట్టును నాటుతారు. చెట్టు నాటిన రోజు నుంచి ఒక సంవత్సరంలో వారి కోరిక నెరవేరుతుందని నమ్మకం.

pc:youtube

 

19. ఎలా వెళ్ళాలి ?

English summary

Lord Shiva Temple In Sivadevuni Chikkala !

Sivadevuni Chikkala is situated in Andhra Pradesh near Palakol. It is located at a distance of 8 km from Palakol, en route to Bhimavaram. This place has Siva Temple, which has a 4 feet white sivalingam installed by lord Hanuman.
Please Wait while comments are loading...