Search
  • Follow NativePlanet
Share
» »భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే ఆలయం - రత్లాం మహాలక్ష్మీ ఆలయం

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే ఆలయం - రత్లాం మహాలక్ష్మీ ఆలయం

ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల తో ప్రకృతి లోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది. వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి

By Venkatakarunasri

ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల తో ప్రకృతి లోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది. వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్య ప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి.

మధ్య ప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం వివిధ వంశాలకు చెందినా ఎంతో మంది రాజుల పాలన చూసింది మధ్య ప్రదేశ్. ప్రాచీన కాలం లో మౌర్యులు, రాష్ట్రకూటులు, గుప్తుల నుంచి ఇటీవలి బుందేలా, హోల్కర్, ముఘలాయి, సింధియాల పాలన వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాల ఉత్థాన పటణాలకు ఇది సాక్షి.

ఆ గుడిలో బంగారం ప్రసాదంగా ఇస్తారు.

మీరేదైనా గుడిలోకి వెళ్లారనుకోండి దేవుడి దర్శనమయిన తరువాత ప్రసాదంగా ఏం పెడతారు?

లడ్డూ, కేసరి, పులిహోర ఇలాంటివే కదా.

కొన్ని దేవాలయాలలోనైతే కొన్ని అరటిపండ్లు కూడా చేతిలో పెడతారు.కాని ఈ ఆలయంలో ప్రసాదం ఏం పెడతారో తెలుసా?

బంగారం, వెండి! నిజమే!

బంగారం లాంటి ఆ దేవాలయం ఎక్కడ వుందో తెలుసుకుని వెంటనే వెళ్ళిపోదామనుకుంటున్నారా?

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

ఆలయం ఎక్కడ వుంది?

ఆలయం ఎక్కడ వుంది?

మధ్యప్రదేశ్ లోని రత్లాం బంగారం,చీరలకు ప్రసిద్ధి చెందిందని చాలా మందికి తెలిసేవుంటుంది. ఈ రత్లాంలో మహాలక్ష్మీఆలయం వుంది.

pc: youtube

భారీకొద్దీ విరాళాలు

భారీకొద్దీ విరాళాలు

అత్యంత సంపన్నమైన ఈ గుడికి ప్రతి యేటా భారీకొద్దీ విరాళాలు వస్తూవుంటాయి.

గర్భగుడిలోని దేవతను ఎలా అలంకరిస్తారు?

గర్భగుడిలోని దేవతను ఎలా అలంకరిస్తారు?

పేరు ప్రతిష్టకు తగినట్లుగా గర్భగుడిలోని దేవతను దాదాపు 100కోట్ల విలువైన నోట్ల దండలు, బంగారం, వెండి ఆభరణాలతో ముస్తాబుచేస్తారు.

pc: youtube

భక్తులకు ప్రసాదం ఏమిటో తెలుసా?

భక్తులకు ప్రసాదం ఏమిటో తెలుసా?

గుడికి వచ్చే విరాళాలలో బంగారం, వెండి భారీగా వుంటుంది. ఇలా వచ్చిన బంగారం,వెండిని భక్తులకు ప్రసాదంగా ఇస్తూవుంటారు.

pc: youtube

పెద్ద సంఖ్యలో భక్తులు

పెద్ద సంఖ్యలో భక్తులు

ఈ ప్రసాదం తీసుకోటానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు గుడికి వస్తూ వుంటారు.

pc: youtube

లక్షల సంఖ్యలో భక్తులు

లక్షల సంఖ్యలో భక్తులు

ముఖ్యంగా ప్రతి యేటా దీపావళి సందర్భంలో 3 రోజుల పాటు జరిగే వుత్సవాలలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు.

pc: youtube

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

వారందరికీ లేదనకుండా ఎంతోకొంత బంగారం,వెండి ప్రసాదంగా ఇచ్చి పంపిస్తుంటారు.

pc: youtube

 భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

వేలకిలోమీటర్ల నుంచి వచ్చే భక్తలు బంగారం, వెండి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావిస్తారు.

pc: youtube

 భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

ఈ ప్రసాదం ఇంట్లో ఉంచుకుంటే మహాలక్ష్మి ఇంట్లోనే తిష్ట వేస్తుందని నమ్ముతారు.

pc: youtube

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

సముద్రమట్టానికి 400కి.మీల ఎత్తులో వుండే రత్లాం మాళ్వా ప్రాంతంలో వుంది.

pc: youtube

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లా ప్రధాన కేంద్రం ఈ ప్రాంతమే.

pc: youtube

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

మహాలక్ష్మీ అమ్మవారి గుడితో పాటు అనేక అందమైన ఆలయాలు ఇక్కడ వున్నాయి.

pc: youtube

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

అక్కడ ఎన్ని దేవాలయాలు వున్నా భక్తులకు వెండి,బంగారం ప్రసాదంగా ఇచ్చేది మహాలక్ష్మి గుడిలోనే.

pc: youtube

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే గుడి ఎక్కడుందో తెలుసా.!

కేవలం రత్లాం ప్రాంతంలోనే కాదు దేశంలోనే ఇలాంటి ప్రత్యేకమైన ప్రసాదం ఇచ్చే దేవాలయం ఇదొక్కటే.

pc: youtube

ఇక్కడ చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

ఇక్కడ చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

అహిల్య కోట

ఈ కోటను 18వ శతాబ్దంలో నర్మదా నది యొక్క అందమైన ఒడ్డున కట్టబడింది. ఇది మధ్య ప్రదేశ్, మహేశ్వర్ లో ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణ. ఇది అహిల్య కోట వలెనే హోల్కర్ కోట కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అహిల్య కోట, అప్పటి మాల్వా రాణి, మహారాణి అహిల్య బాయి హోల్కర్ యొక్క నివాసంగా ఉండేది. ఈ కోట ఆవరణలో అనేక ఛత్రిస్ మరియు రాణి ఈ కోటలో ఉన్నప్పుడు కూర్చునే సీట్ ను పర్యాటకులు చూడవొచ్చు.

భర్తృహరి గుహలు, ఉజ్జయిని

భర్తృహరి గుహలు, ఉజ్జయిని

భర్తృహరి గుహలు, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఇవి ఒకటి; ఇవి శిప్రా నది ఒడ్డున ఉన్నాయి. ఇవ ఉజ్జయిని పురాతన పట్టణానికి చాలా సమీపంలో ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని, మధ్య ప్రదేశ్, పర్యాటక మంత్రిత్వ శాఖవారు చాలా చురుకైన ప్రదేశంగా వర్ణిస్తారు. ఈ గుహలలో అడుగుపెట్టడం, ఒక అద్భుతమైన అనుభవంగా అనుకోవొచ్చు.

అన్నపూర్ణ టెంపుల్, ఇండోర్

అన్నపూర్ణ టెంపుల్, ఇండోర్

అద్భుతమైన అన్నపూర్ణ దేవాలయం ఇండోర్ లో ఉంది. అనేక కారణాల వల్ల ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. ఇండోర్ లో ని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. 9 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ దేవాలయం ఇండో ఆర్యన్ మరియు ద్రవిడ నిర్మాణ శైలి ల లో నిర్మించబడింది. 100 కంటే అడుగుల ఎత్తు కలిగి ఉన్నది ఈ దేవాలయం. ఆహారానికి దేవత గా భావించబడే అన్నపూర్ణ దేవి కొలువై ఉన్నది ఈ దేవాలయం.

లక్ష్మి ఆలయం, ఖజురహో

లక్ష్మి ఆలయం, ఖజురహో

ఖజురహో లోని చిన్న ఆలయమైన లక్ష్మి ఆలయం సంపాదకు, శ్రేయస్సుకు మూలమైన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం పడమర కొనకి చెందిన ఆలయం. ఇది క్రీశ 900 - 925 లో నిర్మించబడింది. ఆధునిక పరిమాణంలో, స్వభావాన్ని ఉపయోగించి ఈ మందిర శిల్పాలను అలంకరించారు. ఈ విగ్రహం పసుపు ఇసుకరాయితో తయారుచేసారు. నిగనిగలాడే ఈ విగ్రహం అత్యంత మెరుగుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

 మాధవ్ విలాస్ పాలసు, శివపురి

మాధవ్ విలాస్ పాలసు, శివపురి

వాడుక భాషలో 'పాలసు' గా పిలువబడుతున్న మాధవ్ విలాస్ పాలసు మూర్తీభవించిన పరమాద్భుతం. అందమైన టరేట్స్, అనేకమైన టెర్రస్ లు ఇంకా అద్భుతమైన పాలరాతి నేలలతో ఈ పాలసు ఇప్పటికీ ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ఈ పాలసు వెలుపల డస్టీ రోజ్ వర్ణం ఈ పాలసు ని మిగతా పరిసరాల నుండి ప్రత్యేకంగా నిలబడుతుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబద్ నుండి బస్సులో ఔరంగాబాద్ మీదుగా 1 రోజు పైన 2గంటలు పడుతుంది. కారులో 19 గంటలు పడుతుంది.

హైదరాబద్ నుండి వరంగల్, నాగపూర్, భోపాల్, వుజ్జయిని మీదుగా 1 రోజు పైన 2గంటలు పడుతుంది.

pc: google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X