Search
  • Follow NativePlanet
Share
» »గోవాలో ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసా

గోవాలో ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసా

ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. అక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే.

By Venkatakarunasri

ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది. అక్కడ లభించే చవకైన ఆల్కహాల్ నుండి అందమైన బీచ్ వరకు అన్ని ఆకర్షణీయమే. ఈ ప్రాంతానికిగల విశ్వజనీనమైన ఆదరణ చాలామంది యువకులను మరియు పెద్దలను కూడా ఒకే రకంగా ఆకర్షించేదిగా ఉంటుంది. భారతదేశంలోని కోస్తాతీర నగరాలు, పట్టణాలలో ఉండే చక్కని వేసవి సెలవుల అనుభవాలు గోవాలో కూడా అమితంగా లభిస్తాయి.

చాలా మంది గోవాను చూడటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు.మరి గోవాకి వచ్చినవారు ఏవిధంగా గడపాలి అనే విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.
గోవాలో మొదటిగా మీరు ఉదయం వేళ రుచికరమైన,అక్కడ సాంప్రదాయకమైన కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ ను హోటల్ లో తినాలి. హోటళ్ళు సాధారణంగా ఉత్తరగోవా లేదా పాంజింలోని కాండోలిం వీధులలో కనపడుతూవుంటాయి.

గోవాలో ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసా

 ప్రత్యేకత

ప్రత్యేకత

గోవాలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ సమయంలోనే ఒక బీర్ బాటిల్ ని పుచ్చుకోవటం అనేది సర్వసాధారం. కాండోలిం వీధులలో కాలి నడకన లేదా ఒక బైక్ ని అద్దెకు తీసుకోవటం ద్వారా దీనిని చూడవచ్చు.

PC:youtube

షాపింగ్

షాపింగ్

ఒక బైక్ రోజుకి 250రు నుంచి సాధారణంగా ఉండదు. కనుక మీరు బీచ్ ప్రదేశం చేరేముందే అతిచౌక దారులలో కొంత షాపింగ్ కూడా చేయవచ్చు.

PC:youtube

కాండోలిం లేదా అంజనా

కాండోలిం లేదా అంజనా

టీ షర్ట్ లు, సన్ గ్లాస్ లు,రిఫ్రిజ్ రేటర్ మేగ్నట్ ల వంటివి కొనుగోలు చేయవచ్చు. ఇవి సాధారణంగా కాండోలిం లేదా అంజనా ప్రదేశాల్లో దొరుకుతాయి.

PC:youtube

మార్కెట్

మార్కెట్

శనివారం రోజున సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ కూడా వుంటుంది.మధ్యాహ్నం లేదా సెలవుదినం అయ్యిందంటే చాలు గోవాలోని బీచ్లకు జనాలు అధికంగా వస్తూవుంటారు.

PC:youtube

బీచ్

బీచ్

కాండోలిం ప్రాంతాల్లో 3 ప్రధానమైన బీచ్లు వున్నాయి.అవి కాండోలిం బీచ్, కాలాగూటె బీచ్ మరియు బాగాబీచ్.వీటిలో బాగా బీచ్ ను చాలా బాగా మెయిన్ టెన్ చేస్తారు.

PC:youtube

వాటర్ స్పోర్ట్స్

వాటర్ స్పోర్ట్స్

అన్ని బీచ్లలోను వాటర్ స్పోర్ట్స్ కూడా వుంటాయి.వీటిని అక్కడ వుండే కొంతమంది బ్రోకర్లు నిర్వహిస్తారు. జెట్ స్కై, బనానా రైడ్ వంటివి ఎంచుకోవచ్చు.

PC:youtube

ఇది మర్చిపోకండి

ఇది మర్చిపోకండి

బీచ్ ల్లో గల గుడిసెల్లో లభించే స్వచ్చమైన గోవా సీఫుడ్ తో పాటు బీరు తాగటం మర్చిపోకండి.

PC:youtube

అంజనా బీచ్

అంజనా బీచ్

ఈ మూడు ప్రధానబీచ్ల దగ్గర నుంచి కొంతదూరంలోనే అంజనా బీచ్ వుంటుంది. అంజనా బీచ్ ఎంతోప్రశాంతంగా వుంటుంది.

PC:youtube

సౌకర్యం

సౌకర్యం

ఒక పుస్తకం చదువుకోవాలన్నా,మీ ఈమెయిల్స్ చెక్ చేసుకోవాలన్నా ఆ బీచ్లో చాలాసౌకర్యంగా వుంటుంది.

PC:youtube

ఇక్కడ విశిష్టత

ఇక్కడ విశిష్టత

నిశ్శబ్దం మరియు ప్రశాంతత. గోవాలోని బీచ్ ల్లో గుడిసెల్లో చాలా తక్కువధరకే ఒడ్కా మీకు లభిస్తుంది.

PC:youtube

చర్చిలు, ప్రశాంతమైన బీచ్లు

చర్చిలు, ప్రశాంతమైన బీచ్లు

ఇక దక్షిణ భాగం పరిశీలిస్తే ఆ ప్రాంతం చాలాప్రశాంతంగా వుంటుంది.ఇక్కడ ప్రసిద్ధిగాంచిన చర్చిలు, ప్రశాంతమైన బీచ్లు కూడా వున్నాయి.

PC:youtube

కోల్వా బీచ్

కోల్వా బీచ్

గోవాలో ఎంతో పేరుమోసిన కోల్వా బీచ్ దక్షిణ ప్రాంతంలోనే వుంది.ఈ ప్రాంతంలో ఎంతో ఖరీదైన హోటల్ వుండటంతో క్రమశిక్షణ ఆచరించే వారికి ఈ ప్రాంతం చాలాబాగుంటుంది.

PC:youtube

పార్టీ ప్రియులకు స్వర్గం

పార్టీ ప్రియులకు స్వర్గం

ఇక సాయంత్రం అయ్యిందంటే చాలు గోవా పట్టణం పార్టీ ప్రియులకు స్వర్గమే.ఈ పార్టీలు తెల్లవారు 3 గంటలు వరకు జరుగుతాయి.

PC:youtube

రావాణాసౌకర్యం

రావాణాసౌకర్యం

పబ్ యజమానులు ఉదయం వరకు సంగీతాన్ని మోగిస్తూనే వుంటారు.అయితే సరైన రావాణాసౌకర్యం ఏదీలేకుండా గోవాలో రాత్రిపొద్దుపోయేంతవరకు కొనసాగటం రిస్క్ తో కూడిన పనే.

PC:youtube

నైట్ క్లబ్లు

నైట్ క్లబ్లు

ఆ సమయంలో మీకు క్యాబ్ దొరకటం కష్టం కావచ్చు. ఉత్తరాగోవాలో కెఫేటితోస్ మరియు మాంబోస్ అనేవి 2 ప్రఖ్యాత నైట్ క్లబ్లు.ఇవి కాలాగూటె బీచ్ కు దగ్గరగా వుంటాయి.

PC:youtube

చోకధరలో ఆహారం, ఆల్కాహాల్

చోకధరలో ఆహారం, ఆల్కాహాల్

వీటి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే రోడ్ సైడ్ పబ్ లు, బార్లు చోకధరలో ఆహారాన్ని, ఆల్కాహాల్ని అందిస్తుంటాయి.సాంప్రదాయక నైట్ క్లబ్ లే కాక, ఇక్కడ బీచ్ లు కొన్ని పార్టీలను కూడా ఏర్పాటుచేస్తుంటాయి.

PC:youtube

పాంజిం

పాంజిం

అయితే బీచ్లలో లోపలి వెళ్ళటం రాత్రిపూట్ల అంత మంచిది కాదు.ఇక్కడ ప్రమాదకరమైన బీచ్లలో రాత్రి పూట లోపలి వెళ్తే పోలీసులు అడ్డుకుంటారు. పాంజిం ప్రాంతంకూడా చాలా బిజీగా వుంటుంది.

PC:youtube

రవాణాసదుపాయం

రవాణాసదుపాయం

అక్కడ షాపింగ్ బాగానే వుంటుంది.కానీ లభించే ఆహారాలు మాత్రం రుచిగా వుండవు.గోవా ఒక పర్యాటక స్థలంగా వయస్సుతో నిమిత్తం లేకుండా సెలవులను గడిపేందుకు అన్ని ప్రదేశాలనుండి రవాణాసదుపాయం కలిగివుంది.

PC:youtube

నైట్ లైఫ్ బీచ్లు, పార్టీలు

నైట్ లైఫ్ బీచ్లు, పార్టీలు

ఇక్కడ నైట్ లైఫ్ బీచ్లు, పార్టీలు అన్నీకూడా మన దేశంలోని ఇతరనగరాల కన్నా తక్కువ ఖర్చుతో అందిస్తూ దేశీయ పర్యాటకులను మళ్ళీమళ్ళీ స్వాగతిస్తున్నాయి.

PC:youtube

భారతీయ జీవన విధానాలు

భారతీయ జీవన విధానాలు

సెలవుల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే విదేశీయులు భారతీయ జీవన విధానాలను ఆనందిస్తున్నాయి.

PC:youtube

ప్రత్యక్షంగా అనుభవించగలేగే స్థానిక జీవనం

ప్రత్యక్షంగా అనుభవించగలేగే స్థానిక జీవనం

మీరుగాని కొద్ది పాటి సాహసం చేయాలనుకునేవారైతే అక్కడ వున్న ఒక హట్ ను అద్దెకు తీసుకోండి. స్థానికజీవన విధానాలను ప్రత్యక్షంగా అనుభవించండి.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X