Search
  • Follow NativePlanet
Share
» »రోహతాస్ - చరిత్రను గుర్తుకు తెచ్చే ప్రదేశం !

రోహతాస్ - చరిత్రను గుర్తుకు తెచ్చే ప్రదేశం !

By Mohammad

రోహతాస్ పట్టణం ప్రాచీనమైనది. మౌర్యుల కాలంలో (క్రీ.పూ. 1000 ఆ మధ్య కాలంలో) ఈ ప్రదేశం మగధ సామ్రాజ్యంలో ( ప్రస్తుత బిహార్) భాగంగా ఉండేది. ఈ ప్రదేశంలో మగధ రాజ్యం ఎలా ఉండేదో, వారి పరిపాలన ఎలా సాగేదో సూచిస్తూ అశోకుడు ఒక శిలాశాశానాన్ని వేయించాడు.

రోహతాస్ చుట్టుపక్కల గల ఆకర్షణలు

రోహతాస్ చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు, మతపరమైన ప్రదేశాలు, చరిత్రను గుర్తుకు తెచ్చే ప్రాధాన్యత గల స్థలాలు ఎన్నో ఉన్నాయి. సిక్కుల పవిత్ర దేవాలయం 'చాచా ఫగుమాల్ సహబ్జి కా గురుద్వారా' కూడా కలదు. గుళ్ళు, గోపురాలు, మసీదుల కైతే లేక్కలేదు. ఈ ప్రదేశం మతసామరస్యాన్ని చాటి చెబుతుంది. హిందువులు - ముస్లీం లు కలిసి మెలసి జీవనం సాగిస్తుంటారు. అన్ని మతాలు వేడుకలు, పండుగలు, ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటూ ఆనందిస్తారు.

ఇది కూడా చదవండి : బౌద్ధ మతం పరిఢ విల్లిన ప్రదేశం .. బుద్ధ గయ !

సాసా రామ్

రోహతాస్ జిల్లాలోని సాసా రామ్, దేహ్రి కి 17 కి. మీ ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దేశంలోనే రెండవ ఎత్తైన షేర్ షా సమాధి (టూంబ్) కలదు. దీని శిల్ప నిర్మాణం అంతా పఠాన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. టూంబ్ లోపలి మిహరాబ్ ఆర్చ్ ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

సాసా రామ్ టూంబ్

సాసా రామ్ టూంబ్

చిత్ర కృప : telugu native planet

సాసా రామ్ టూంబ్ ని చెరువు మధ్యలో నిర్మించినారు. టూంబ్ లోపల మాత తారాచండి ఆలయం ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. గోడల టైల్స్ నేటికీ చెక్కుచెదరకుండా పూలతో చెక్కబడి అందంగా ఉన్నది. మీరు గనక చూస్తే ఈ టూంబ్ ని భారతదేశ వింతల్లో ఒకటిగా పరిగనిస్తారు. సా సా రామ్ కి 10 కి. మీ ల దూరంలో షేర్ ఘర్ తప్పక చూడదగినది.

రోహతాస్ ఘర్ ఫోర్ట్

రోహతాస్ ఘర్ ఫోర్ట్ కైమూర్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉన్నది. సోనే వాలీ ధైర్య సాహసాలకు, అధికారానికి ఈ కోట ఒక దర్పం లా నిలుస్తుంది. కోట లోపల మతసామరస్యాన్ని చాటిచెప్పే విధంగా మసీదులు, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దీనిని నిర్మించినది రోహితశ్వ (హరిశ్చంద్రుని కుమారుడు). ఈ కోట పర్యాటకులను తప్పక ఆకట్టుకుంటుంది.

రోహతాస్ ఘర్ ఫోర్ట్

రోహతాస్ ఘర్ ఫోర్ట్

చిత్ర కృప : telugu native planet

మతపర ప్రదేశాలు

సిక్కుల మతప్రదేశం చాచా ఫగుమాల్ సాహిబ్జి కా గురుద్వారా, బాలుని ధాం లోని పురాతన దుర్గా మాతా ఆలయం, మార్కండేయ గ్రామంలోని విష్ణు మరియు సూర్యదేవాలయాలు చూడదగ్గవి. వీటితో పాటు ఆశ్రమాల మీద మక్కువ ఉన్నవారు దర్క్ లందా, షాపింగ్ కొరకై అఖోరి గోల మరియు చరిత్ర ప్రియులు అక్బర్ పూర్ చూడవచ్చు.

గణేష్ ఆలయం

గణేష్ ఆలయం

చిత్ర కృప : Bihar Images

రోహతాస్ ఎలా చేరుకోవాలి ?

రోహతాస్ సమీప విమానాశ్రయం : గయవిమానాశ్రయం (98 కి. మీ), పాట్న విమానాశ్రయం (137 కి. మీ)

రోహతాస్ సమీప రైల్వే స్టేషన్ : సాసా రామ్ జంక్షన్. దేహ్రి మరియు సోనే ఇతర రైల్వే స్టేషన్ లు గా ఉన్నాయి.

రోడ్డు / బస్సు మార్గం : పాట్న, గయ, దేహ్రి, సోనే, సాసా రామ్ నుండి రోహతాస్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నిత్యం తిరుగుతుంటాయి.

కోట వెలుపలి స్థలం(పార్కింగ్)

కోట వెలుపలి స్థలం(పార్కింగ్)

చిత్ర కృప : G-Udin

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X