Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

తెలంగాణలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

ప్రకృతిని ప్రేరేపించే అడవులు, జలపాతాలు, రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రంలో కొదువలేదు. కుటుంబసభ్యులతో వచ్చే వారికి ఈ రాష్ట్రం కనువిందు చేయనుంది.

By Super Admin

తేలు దర్గా గురించి వింటే షాక్ !తేలు దర్గా గురించి వింటే షాక్ !

తెలంగాణ కొత్త రాష్ట్రం ... మనకైతే తెలిసిన రాష్ట్రం. ఒకప్పుడు నిజాం పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం ... ఆంధ్ర రాష్ట్రం తో విలీనమై ... సంవత్సరంన్నర కిందట ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయి 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది.

తెలంగాణ రాష్ట్రంలో గత సంస్కృతిని చాటిచెప్పే అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఆలయాలు, చారిత్రక నేపధ్యం సంతరించుకొన్న కోటలు, రాజభవనాలు కలిగి ఉంది. ప్రకృతిని ప్రేరేపించే అడవులు, జలపాతాలు, రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రంలో కొదువలేదు. కుటుంబసభ్యులతో పిక్నిక్ కై వచ్చిన లేదా ఫ్రెండ్స్ తో విహారయాత్రలకై వచ్చిన ఈ రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలు మిమ్మల్ని కనువిందు చేస్తాయి. ఎక్కడో విదేశాలకు, ఉత్తర భారతదేశ ప్రయాణాలు చేసేదానికంటే తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ప్రయాణాలు చేస్తే ఒకింత మీకు డబ్బు కూడా ఆదా కావచ్చు.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

చార్మినార్

చార్మినార్

'చార్మినార్' హైదరాబాద్ చిహ్నం. ప్రాచీన కాలం నాటి అద్భుత నిర్మాణ శైలి దీని సొంతం. ఈ స్మారక చిహ్నాన్ని క్రీ.శ. 1591 లో కులీ కుతుబ్ షా నిర్మించారు. నగరంలో ప్లేగు వ్యాధిని నివారించిన దైవ శక్తులకి కృతజ్ఞతా భావంతో దీనిని నిర్మించినట్లు చెబుతుంటారు. సమీపంలోని లాడ్ బజార్ లో వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు.

చిత్ర కృప : Soham Banerjee

మక్కా మసీద్

మక్కా మసీద్

మక్కా మసీద్ 'చార్మినార్' కు పక్కనే కలదు. ఇది పురాతన మరియు ఇండియాలో ఉన్న అతి పెద్ద మసీద్ లలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. మసీద్ లో ప్రతి శుక్రవారం, రంజాన్, బక్రీద్ లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలకి ముస్లీమ్ లు అధిక సంఖ్యలో వస్తారు. దీనికి సమీపంలో చారిత్రక కట్టడం చౌమహల్లా ప్యాలెస్ కలదు.

చిత్ర కృప : Obaid Malik

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ పూర్వం రాజధాని గా ఉండేది. హైదరాబాద్ నగరం నుండి 11 కి. మీ. దూరంలో ఉన్న గోల్కొండ కోట నాటి పూర్వ వైభవాలను గుర్తుచేస్తుంది. కోటకు ఉపయోగించిన రాళ్లు, కోటలోని ఉద్యానవనాలు ఆకర్షణగా నిలిచాయి. చప్పట్లు కొడితే, ఆ శబ్ధం 91 మీ. ఎత్తున ఉన్న రాణి మహల్ (ఎత్తులో ఉన్నది) వద్ద వినిపిస్తుంది. రహస్య మార్గాలు, గోడ వద్ద మాట్లాడితే మరో చోట వినిపించడం ఇవన్ని గమనిస్తే కోటను శత్రువుల బారి నుండి రక్షణకై ఎంత సురక్షితంగా నిర్మించారో బోధపడుతుంది.

చిత్ర కృప : Samsat83

హుస్సేన్ సాగర్

హుస్సేన్ సాగర్

హుస్సేన్ సాగర్ పేరులోనే రెండుమతాలకు చెందిన పదాల కలయిక ఉన్నది. ఒకటి హుస్సేన్( ముస్లీం పేరు), మరొకటి సాగర్ (హిందూ పేరు). నగరానికి సాగు నీరు అందించటం దీనిని త్రవ్వారు. సాగర్ మధ్యలో బుద్ధుని విగ్రహం వద్దకు పడవ ల ద్వారా చేరుకోవచ్చు. ఈ చెరువు చుట్టూ లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్, చేరువలో ఎన్టీయార్ గార్డెన్ చూడవచ్చు.

చిత్ర కృప : Jagadeesh, Posni

బిర్లా మందిర్

బిర్లా మందిర్

బిర్లా మందిర్ నౌబథ్ పహాడ్ అనే చిన్న కొండ మీద నిర్మించారు. తెల్లని చలువరాతి రాళ్లతో నిర్మించిన ఆలయంలో ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి మరియు ఇతర దేవుళ్ళు, దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రశాంతత కు ఎటువంటి భంగం వాటిల్లాడు. సమీపంలో అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్ సందర్శించవచ్చు.

చిత్ర కృప : steeliee

చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా ప్యాలెస్

చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ నిజాం ల అధికార నివాసం. నిజాం లు ఈ ప్యాలెస్ ను విధులకు, వినోదాలకు, పట్టాభిషేక కార్యక్రమాలకు మరియు ఉత్సాహాలకు ఉపయోగించేవారు. ఈ రాజదర్బార్ లో అందమైన గదులు, వివిధ దేశాల నుంచి తెప్పించిన వస్తువులు గమనించవచ్చు.

చిత్ర కృప : NIKHIL JAIPURIA

కాకతీయ కళా తోరణం

కాకతీయ కళా తోరణం

'కాకతీయ కళా తోరణం' నాటి కాకతీయుల రాజ్యానికి చారిత్రక స్థూపం మరియు చిహ్నం. దీనినే వరంగల్ ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు. కాకతీయ వంశీయులు చాలా వరకు తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలను పాలించారు. సమీపంలో శిల్పకళ లతో ఉట్టిపడే వరంగల్ కోట చూడవచ్చు.

ఇది కూడా చదవండి : వరంగల్ జిల్లా పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Akbar Mohammed

వేయి స్తంభాల గుడి

వేయి స్తంభాల గుడి

వేయి స్తంభాల గుడి వరంగల్ కు సమీపాన 8 కి. మీ. దూరంలో ఉన్న హన్మకొండ లో కలదు. ఇదొక హిందూ ఆలయం. ఇక్కడశివుడు, విష్ణువు,సూర్యుడు మరియు దేవతలు కొలువై ఉన్నారు. ఆలయం వేయి స్తంభాలతో, ఆకట్టుకొనే తలుపులతో మరియు శిల్పకళలతో, దక్షిణ భారతదేశంలో పురాతన ఆలయాల్లో ఒకటిగా అలరారుతున్నది.

చిత్ర కృప : krishna gopal

భువనగిరి కోట

భువనగిరి కోట

'భువనగిరి కోట' నల్గొండ పట్టణంలో కలదు. ఈ కోట సముద్రమట్టానికి 500 మీ. ఎత్తున కొండమీద 40 ఎకరాల విస్తీర్ణంలో చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించినాడు. కోడి గుడ్డు ఆకారంలో ఉన్న ఈ కోట లో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయి. ఆసక్తి గలవారు కొండ మీదికి ట్రెక్కింగ్ చేసుకుంటూ కోట చేరుకోవచ్చు.

చిత్ర కృప : Historical Places In India

నాగార్జున సాగర్

నాగార్జున సాగర్

నాగార్జున సాగర్ హైదరాబాద్ నగరానికి 150 కి. మీ. దూరంలో ఉన్న బౌద్ధుల పవిత్ర స్థలం. ఇక్కడ ప్రపంచ ఖ్యాతి గడించిన నాగార్జున సాగర్ డ్యామ్(26 గేట్లు), ఎత్తిపోతల జలపాతం, బౌద్ధ ద్వీపం చూడవచ్చు.

ఇది కూడా చదవండి : నాగార్జున సాగర్ టు శ్రీశైలం బోట్ ట్రిప్ జర్ని !

చిత్ర కృప : Saravanan A

పిల్లలమర్రి

పిల్లలమర్రి

మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లలమర్రి, మహబూబ్ నగర్ పట్టణం నుండి 4 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ 800 సంవత్సరాల క్రితం నాటి మర్రి వృక్షం. పక్కనే మ్యూజియం, జింకల పార్క్ మరియు చెట్లతో నిండిన చిన్న చిన్న కొండలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : మహబూబ్ నగర్ జిల్లా పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Vinay Raj

కుంటాల జలపాతం

కుంటాల జలపాతం

కుంటాల జలపాతం అదిలాబాద్ జిల్లాలోని అభయారణ్యంలో కలదు. ఈ జలపాతం ఎన్ హెచ్ 7 పై నిర్మల్ నుండి అదిలాబాద్ వెళ్లే మార్గంలో నేరడిగొండ మండలానికి 12 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో 45 మీ. ఎత్తునుండి జాలువారే ఆ నీళ్ళు, చప్పుళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

ఇది కూడా చదవండి : అదిలాబాద్ జిల్లా పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : saravanan m

కవాల్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

కవాల్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

కవాల్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ అదిలాబాద్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ప్రాంతమైన జన్నరమ్ మండలం సమీపంలో కలదు. సుమారు 893 చ. కి.మీ. మేరకు విస్తరించిన ఈ స్యాంక్చురీలో పులులు, చిరుత, జింక, ఎలుగుబంటి వంటి అనేక అడవిజంతువులతో పాటు వివిధ రకాల పక్షులు, అనేక జాతుల సరీసృపాలను చూడవచ్చు.

చిత్ర కృప : RURO photography

షామీర్ పేట్ సరస్సు

షామీర్ పేట్ సరస్సు

హైదరాబాద్ యొక్క శివారు ప్రాంతమైన షామీర్ పేట్ సికింద్రాబాద్ కి 20 కిలోమీటర్ల దూరంలో నిజాములచే నిర్మించబడిన మానవ నిర్మిత చెరువు. వారాంత విశ్రాంతికి ఇక్కడ ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్లు ,హోటళ్ళు మరియు ఒక క్లబ్బు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న జింకల పార్కు లో జింకలె కాకుండా నెమళ్ళు, అనేక రకాల పక్షులు చూడవచ్చు. ఎన్నో తెలుగు సినిమాలు ఈ చెరువు చుట్టుప్రక్కల షూటింగ్ లు జరుపుకుంటాయి.

చిత్ర కృప : swarat_ghosh

భద్రాచలం

భద్రాచలం

భద్రాచలం ఖమ్మం నగరం నుండి 115 కి. మీ. దూరంలో గోదావరి నది ఒడ్డున కలదు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ రాముని వారి ఆలయం. ఆలయంలో రాముడు, సీతా దేవి విగ్రహాలే కాకుండా ఇతర దైవాలు సైతం కొలువుదీరాయి. సమాపంలో జటాయు పాక, గుణదల, పర్ణశాల, దుమ్మగూడెం అలాగే పోలవరం చూడవచ్చు.

ఇది కూడా చదవండి : ఖమ్మం జిల్లా పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Adityamadhav83

వేములవాడ

వేములవాడ

వేములవాడ ఎన్నో విశిష్టత ల దివ్య క్షేత్రం. ఇది కరీంనగర్ పట్టణం నుండి 32 కి. మీ. దూరంలో కామారెడ్డి వెళ్లే మార్గంలో కలదు. చరిత్ర ప్రసిద్ధి గాంచిన రాజరాజేశ్వరి దేవాలయము ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దీనిని పశ్చిమ చాళుక్యులు నిర్మించనట్లు తెలుస్తున్నది. సమీపంలో భీమన్న ఆలయం, పోచమ్మ ఆలయం, ట్రెక్కింగ్ ప్రదేశం ఎలగందల్ కోట సందర్శించవచ్చు.

ఇది కూడా చదవండి : కరీంనగర్ జిల్లా పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Akbar Mohammed

మెదక్ చర్చి

మెదక్ చర్చి

మెదక్ హైదరాబాద్ మహానగారానికి 100 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ అందమైన సరస్సులు, ఆలయాలు, కోట మరియు చర్చి ఉన్నాయి. మెదక్ లో ప్రధాన ఆకర్షణ ప్రసిద్ధి గాంచిన చర్చి. గుడ్ ఫ్రైడే మరియు క్రిస్మస్ వేడుకల సమయంలో ఈ చర్చి భక్తులతో కిక్కిరిసిపోతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద చర్చి గా ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిలో ఒకేసారి 5000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. సమీపంలో ఏడుపాయల దుర్గా భవాని గుడి, మెదక్ కోట, పోచారం అభయారణ్యం, పాపి కొండలు చూడవచ్చు.

చిత్ర కృప : Billy Vemuri

లక్నవరం సరస్సు

లక్నవరం సరస్సు

లక్నవరం సరస్సు కు చేరుకోవాలంటే గోవిందరావుపేట్ సమీపంలోని దట్టమైన అడవి మార్గం గుండా ప్రయాణించాలి. ఈ సరస్సు వరంగల్ పట్టణానికి 70 లో. మీ. దూరంలో కలదు. స్థానికులచే లక్కవరం చెరువు గా పిలువబడే ఈ సరస్సు చుట్టూ పచ్చని చెట్లతో నిండిన కొండలతో, దట్టమైన అడవితో కనువిందు చేస్తుంది.

చిత్ర కృప : Ajay Krishna

బాసర సరస్వతి ఆలయం

బాసర సరస్వతి ఆలయం

బాసర దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి పుణ్య క్షేత్రం. గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం అదిలాబాద్ పట్టణానికి 145 కి. మీ. దూరంలో, నిర్మల్ పట్టణానికి 35 కి. మీ దూరంలో ఉన్నది. చాళుక్య రాజులు నిర్మించిన ఈ ఆలయంలో సరస్వతి దేవి మరియు ఇసుక విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. పక్కనే పరవళ్ళు తొక్కుతున్న గోదావరి నదిలో బోటింగ్ వినోదాన్ని కలిగించే మరో అంశం.

చిత్ర కృప : Kiran Kollepalli

రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం వరంగల్ పట్టణానికి 70 కి. మీ. దూరంలో ఉన్న పాలంపేట ఊర్లో ఉన్నది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు కాగా, విష్ణువు మరియు రాముని మందిరాలు కూడా ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన ఈ ఈ రామ లింగేశ్వర దేవాలయం(రామప్ప దేవాలయం) పక్కనే ఒక సరస్సు ఉన్నది. ఆది ఇప్పటికీ వేల ఎకరాల పంట పొలాలకు నీరు అందిస్తున్నది.

చిత్ర కృప : Ajay Krishna

అనంతగిరి కొండలు

అనంతగిరి కొండలు

ట్రెక్కింగ్ కోరుకోనే వారికి అనంతగిరి కొండలు ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ నగరంలో గబ్బుపట్టిన మూసీ నది జన్మస్థానం ఇక్కడే. వికారాబాద్ కు కేవలం 10 కి. మీ. దూరంలో, హైదరాబాద్ నగరానికి 100 కి. మీ. దూరంలో ఉన్న అనంతగిరి కొండలు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, నిర్మలమైన వాతావరణం పర్యాటకులను భలేగా ఆకర్షిస్తాయి. కొండల మీద నుండి అద్భుతమైన సూర్యోదయాలు, సూర్యాస్తమాలు వీక్షించవచ్చు. నిజం చెప్పాలంటే, తెలంగాణ లో హిల్ స్టేషన్ లేదనుకొని భాధపడుతున్న వారికి దీంతో ఆ లోటు తీరిపోతుంది.

ఇది కూడా చదవండి : తెలంగాణ ఏకైక హిల్ స్టేషన్ !

చిత్ర కృప : Abhi teja's

మొక్కుడు గుండం

మొక్కుడు గుండం

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి లోయలో ఉన్న అడవులను తెలంగాణ గ్రీన్ వ్యాలీ అంటారు. ఇది అదిలాబాద్ జిల్లాలో ఎక్కువ. అదిలాబాద్ నుండి సేమ్ కుంటాల కు ఎలా చేరుకుంటామో ఆ మార్గంలోనే కాస్త ముందుకు వెళితే దేవ ల్ నాయక్ తండా వస్తుంది. అక్కడి నుండి అడవులు, గుట్టలు, లోయాలు దాటుకుంటూ 3 కి. మీ. ట్రెక్కింగ్ చేస్తే కాశ్మీర్ లోయను తపించే మొక్కుడు గుండం ( గాడిద గుండం) కనిపిస్తుంది. 100 నుంచి 200 అడుగుల ఎత్తు నుండి కిందకు దూకే నీటి జలధార శబ్ధం ఎలా ఉంటుందో ఇక్కడికి వెళితే గ్రహించవచ్చు.

ఇది కూడా చదవండి : మొక్కుడు గుండం - తెలంగాణ గ్రీన్ వ్యాలీ !

చిత్ర కృప : arthik R

అలీసాగర్

అలీసాగర్

అలీసాగర్ నిజామాబాద్‌కు సుమారు 15 కి.మీదూరంలో, నిజామాబాద్‌ - బాసర రోడ్‌కు 2 కి.మీ. దూరంలో ఉంది. ఇదొక మానవ నిర్మిత రిజర్వాయర్. దీని చుట్టూ సమ్మర్‌ హౌస్‌, దాని పక్కనే పెంచిన గార్డెన్స్‌ ఐలాండ్‌, కొండపై ఉన్న అతిధి గృహం, చుట్టూ విస్తరించిన అడవి ఈ ప్రాంత అందాన్ని పెంచాయి. సమీపంలో జింకల పార్క్ ఉంది. ట్రెకింగ్‌, వాటర్‌స్పోర్ట్స్‌ లాంటి ఆటలకు అవసరమైన సదుపాయాలు కూడా పర్యాటకులకు ఆనందం కల్గిస్తాయి. జిల్లాలో సంస్థానాల కాలంలో కట్టించిన రాజభవనాలు, కోటలు చూడవచ్చు.

ఇది కూడా చదవండి : నిజామాబాద్‌ జిల్లా పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : Ananth Naag Kaveri

కిన్నెరసాని

కిన్నెరసాని

కిన్నెరసాని ఖమ్మం జిల్లా పాల్వంచ కు 12 కి. మీ. దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నది. ఇదొక విహారయాత్ర స్థలం. ఇక్కడ కిన్నెరసాని నది పై నిర్మించిన రిజర్వాయర్, ఒక అభయారణ్యం, నది మధ్యలో ద్వీపం మరియు 34 సంవత్సరాల క్రితం నాటి అద్దాల మేడ చూడవచ్చు.

ఇది కూడా చదవండి : కిన్నెరసాని జల సోయగాలు !

చిత్ర కృప : ravindra_s_1999

పొచ్చెర జలపాతం

పొచ్చెర జలపాతం

అదిలాబాద్ జిల్లాలో నిర్మల్ పట్టణానికి 35 కి. మీ. దూరంలో బోథ్ మండలానికి 6 కి. మీ. దూరంలో పొచ్చెర జలపాతం ఉన్నది. చిన్న చిన్న కొండ రాళ్ళ నుంచి ఎగిసిపడే నీటిధార అందాలను చూడటానికి పర్యాటకులు తరచూ వస్తుంటారు. దగ్గర్లో వనదేవత విగ్రహం చూడదగినది. ఎన్నో సినిమా షూటింగ్లు ఈ జలపాతం పరిసరాల్లో జరిగినాయి కూడా ..!

చిత్ర కృప : Sid Clicks

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X