Search
  • Follow NativePlanet
Share
» »మోతిహరి - చారిత్రక విలువలతో నిండిన ప్రదేశం !

మోతిహరి - చారిత్రక విలువలతో నిండిన ప్రదేశం !

By Mohammad

బీహార్ లోని మోతిహరి పట్టణం అటు తీర్థ యాత్రికుల్లోను, ఇటు విహార యాత్రికుల్లోను కూడా బాగా ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం. పాట్నా నగరం నుంచి మోతిహరి పట్టణం 156 కిలోమీటర్ల దూరంలో వుంది. పర్యాటకం ప్రధానంగా ఇక్కడి చారిత్రిక విలువల వల్లనే నడుస్తోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని మోతిహరి నుంచే మొదలు పెట్టారు. ఇక్కడి చారిత్రిక విలువలు మోతిహరి పర్యాటకాన్ని తప్పనిసరిగా చూసి తీరాల్సిన ప్రాంతంగా తయారు చేసాయి.

ఇది కూడా చదవండి : రోహతాస్ - చరిత్రను గుర్తుకుతెచ్చే ప్రదేశం !

మోతిహరిలో ప్రధానమైన బౌద్ధ స్తూపం ఉండడంతో మోతీహారీ బౌద్ధ యాత్రికులను ఇక్కడికి ఏడాది పొడవునా ఆకర్షిస్తూనే వుంటుంది. 104 అడుగుల ఎత్తు వుండే మోతీహారీ స్తూపంగా పిలిచే ఈ నిర్మాణం నిజంగానే చాలా అద్భుతమైన నిర్మాణం. ఒకప్పుడు వున్న ఇంతకన్నా పెద్ద స్తూపం అవశేషం ప్రస్తుత నిర్మాణమని చాలా మంది భావిస్తారు.

గాంధీ స్మారకం

గాంధీ స్మారకం

చిత్ర కృప : motihari

గాంధీ స్మారకం

భారత జాతిపిత గాంధీజీ స్మారకార్థం క్రీ. శ. 1972 లో దీన్ని ఏర్పాటుచేశారు. దేనిని విద్యాకర్ కవి జాతికి అంకితం చేశారు. బ్రిటీషర్లు భారత నేతన్నలపై జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా గాంధీజీ చేసిన చంపారణ్ స్మృతి చిహ్నంగా ఉంది.

కేసరియ స్థూపా

కేసరియ స్థూపా

చిత్ర కృప : Ashwini Kesharwani

కేసరియ

కేసరియ, ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపానికి ప్రసిద్ది చెందింది. దీని ఎత్తు 104 అడుగులు. ఇది భారతీయ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నది. ఇది జావా లోని బోరోబోదుర్ స్థూపాని కంటే పొడవైనది. ఇది మొదట్లో 150 అడుగుల ఎత్తు పొడవులో ఉండేదని చెప్తారు. ఈ స్తూపంలో బౌద్ధ నిర్మాణ శైలి స్పష్టంగా వ్యక్తమవుతుంది, పరిశీలనకు ఆహ్లాదకరంగా ఉంటుంది.

మోతి ఝీల్

చారిత్రిక కలువ అయిన మోతి ఝీల్, మోతిహరి నగర నడిబొడ్డున ఉంది. ఈ కాలువకు రెండువైపులా అందమైన దృశ్యాలు, వీక్షణలు అలంకరించబడి ఉన్నాయి. బోటింగ్ వంటి వివిధ కార్యకలాపాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మోతీ ఝీల్ నుండి అస్తమిస్తున్న సూర్యుడి ప్రకృతి అందం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.

సుగౌలి ఆలయం

సుగౌలి ఆలయం, motihari

మోతిహరి సమీపంలో చూడవలసిన ఇతర ఆకర్హణలు

మోతిహరి పర్యాటకంలో ప్రధానమైనది ఈ వూళ్ళో పుట్టిన ప్రఖ్యాత రచయిత జార్జి ఆర్వెల్ నివాస భవనం. మహాత్మా గాంధీ ప్రదర్శనశాల, శిలా స్థంభం, వ్యాపార పట్టణం చకియా కూడా మోతీహారీ పర్యాటకంలో ప్రత్యేకమైన ఆకర్షణలు. కాగితం మిల్లు, చక్కర కర్మాగారం, లాంటి చాలా చిన్న స్థాయి పరిశ్రమలకు మోతిహరి పుట్టినిల్లు.

విద్యా సంస్థలు, మిల్లులు, ఫాక్టరీలు, గాంధీ సంగ్రహాలయ, ఝీల్, గాంధీ మైదాన్, లాంటి చారిత్రిక ప్రదేశాలు, ప్రకృతి సహజమైన, హిమాలయ పర్వత సానువుల వెంట వుండే గ్రామీణ భూభాగం - వీటన్నిటి మిశ్రమం వల్ల మోతిహరి నాణ్యమైన సమయం గడపడానికి తగిన మంచి పర్యాటక ప్రదేశం.

ముజాఫర్ పూర్ - మోతిహరి - గోరఖ్ పూర్ రైలు మార్గం

ముజాఫర్ పూర్ - మోతిహరి - గోరఖ్ పూర్ రైలు మార్గం

చిత్ర కృప : Tanmay Tarun

మోతిహరి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : మోతిహరి సమీపాన 156 కిలోమీటర్ల దూరంలో పాట్నా ఎయిర్ పోర్ట్ కలదు.

రైలు మార్గం : బాపుధామ్ రైల్వే స్టేషన్, మోతిహరి కి సమీపాన కలదు.

రోడ్డు మార్గం : పాట్నా నుండి ప్రవేట్ క్యాబ్ లేదా టాక్సీ లలో మోతిహరి చేరుకోవచ్చు. లేదా స్థానికంగా లభించే ప్రభుత్వ / ప్రవేట్ బస్సులలో ఎక్కి మోతిహరి వెళ్ళవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X