Search
  • Follow NativePlanet
Share
» »హనీమూన్ జంటలకు స్వర్గధామం ... మజులి !!

హనీమూన్ జంటలకు స్వర్గధామం ... మజులి !!

కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్‌ కపుల్‌ ఇక్కడ సందడి చేస్తారు.

By Mohammad

మజులి ఒక అందమైన ద్వీపం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా ఈ ద్వీపానికి పేరు. మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా మజులి ద్వీపం గురించి ఏం చెప్పుకున్నా అవన్నీ కాలుష్య రక్కసికి దూరంగా, అతీతంగా ఉన్నాయి. కాలుష్యం ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టి ఇప్పటికీ. .. మజులి సౌందర్యం ఏ మాత్రం పాడవకుండా కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతోంది. ఏ రుతువులో చూసినా... తాజాదనం తొణకి సలాడే ఈ అద్భత ద్వీపంలో మానవ సంచారం ఉన్నప్పటికీ... నేటికి పచ్చని సౌందర్యంతో ప్రకృతికాంత పరవశిస్తూనే వుంది.

హనీమూన్ జంటలకు స్వర్గధామం ... మజులి !!

చిత్రకృప : Kalai Sukanta

కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్‌ కపుల్‌ ఇక్కడ సందడి చేస్తారు. కొత్త వాతావరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలను కునే జంటలకు 'మజులి' ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

అనియతి సత్రం

అనియతి సత్రం మజులి లోని మరొక ప్రసిద్ధ సత్రం. అనియతి సత్రం పాలనం, అప్సర నృత్యాలకు ప్రసిద్ధి. సత్రంలోని ఎంతో ప్రాముఖ్యత ఉన్న ధార్మిక పండుగలలో 'పాలనం' ఒకటి. దీనిని నవంబర్ నెలలో జరుపుకొంటారు. ప్రధాన ప్రార్ధన మందిరంలో ఉన్న గోవింద దేవునికి ఇక్కడ ప్రదర్శించే సత్రియా నృత్యాన్ని అంకితం చేస్తారు. అనియతి సత్రం అస్సాం వంటపాత్రలు, హస్తకళలు, ఆభరణాల వంటి విస్తృతమైన సేకరణను కల్గి ఉంది.

హనీమూన్ జంటలకు స్వర్గధామం ... మజులి !!

చిత్రకృప : Sumantbarooah

ఉత్సవాలు

అలనాడు రాధాకృష్ణులు రాసక్రీడలాడిన ప్రదేశంగా చెప్పబడుతున్న ఈ ద్వీపంలో... ద్వీపవాసులు ఆ ఆనవాయితీని ఇప్పటికీ పాటిస్తుండడం విశేషం. ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఎంతో అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాన్ని 'రాస్‌లీలా' ఉత్సవం అంటారు. కన్నులపండువగా జరిగే ఈ ఉత్సవంలో శ్రీకృష్ణుడు, గోపికల రాసలీలలను కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.

కమలబరి సత్రం

కమలబరి సత్రం, మజులిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రసిద్ధ సత్రం. 'కమల' అంటే 'కమలాపండు' అని, 'బరి' అంటే 'తోట' అని అస్సాం భాషలో అర్ధం. కమలబరి సత్రాన్ని ప్రసిద్ధ మాధవదేవుని శిష్యుడు బాదాల అట 1595 లో స్థాపించాడు. కమలబరి సత్రం శతాబ్దాలుగా కళ, సంస్కృతి, సాహిత్యానికి కేంద్రంగా పరిగణించబడుతుంది. కమలబరి వలననే సత్రియా నృత్యం ప్రసిద్ది చెందినది.

హనీమూన్ జంటలకు స్వర్గధామం ... మజులి !!

చిత్రకృప : Sumantbarooah

బెంగానాతి సత్రం

మజులి సత్రాలకు ప్రసిద్ధి. బెంగానాతి సత్రం అటువంటి ప్రసిద్ధ సత్రాలలో ఒకటి. ఇది సాంప్రదాయికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న విస్తృతమైన పురాతన వస్తువుల సేకరణకు నివాసం. ఈ ద్వీపంలోని ఇతర సత్రాలలానే బెంగానాతి సత్రం కూడా శ్రీమంత శంకరదేవ సంప్రదాయాన్ని, విలువలను పరిరక్షించడమే కాక, ప్రాచీన కళాకృతులను భద్రపరిచే మ్యూజియంగా కూడా ఉపయోగపడుతుంది.

దఖినపాట్ సత్రం

అస్సాంలోని మజులిలో ఒక ద్వీపం దఖినపాట్ సత్రం ప్రసిద్ధ సామాజిక-ధార్మిక సంస్థలలో ఒకటి. అహోం వంశస్థులు పోషించిన అనేక రకాల సాంస్కృతిక శిల్పాలు, చిత్రాలు, నృత్యాలు ప్రదర్శించే కళా సంస్కృతికి ఇది ముఖ్య కేంద్రం. శ్రీ శంకరదేవ అందించిన అనేక వేర్వేరు రకాల నృత్యాలను అందించడం వలన నృత్యనిలయం అని కూడా పిలుస్తారు.

హనీమూన్ జంటలకు స్వర్గధామం ... మజులి !!

చిత్రకృప : Arshadur Rahman

మజులి లో చూడవలసిన మరికొన్ని ఆకర్షణలు : బంగాల్ పుఖురి, చేతియ గావ్, బొంగోరి, శామ్మగురి సత్ర, రాజ మైదం, తేన్గాపానీయ మొదలగునవి.

మజులి వసతి సదుపాయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మజులి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

జోర్హాట్ మజులి కి చేరువలో ఉన్న విమానాశ్రయం. ఇక్కడి నుంచి ప్రతి రోజు గౌహతికి విమానాలు తిరుగుతుంటాయి. కలకత్తా నుంచి వారానికి 4 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైలు మార్గం

జోర్హాట్ రైల్వే స్టేషన్ మజులి కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి గౌహతికి నిరంతరం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

గౌహతి నుంచి జోర్హాట్ కి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. గౌహతి నుంచి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం బస్సులు తిరుగుతాయి. ప్రయాణ సమయం సుమారుగా 6 - 7 గంటల సమయం ఉంటుంది. జోర్హాట్ నుంచి నిమతిఘాట్ 14 కి. మీ. దూరంలో ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి బస్సులు కానీ ఆటో కానీ పట్టుకొని చేరవచ్చు.

జల మార్గం

మజులి కి నిమతిఘాట్ నుంచి ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం ప్రభుత్వ ఫెర్రి సర్వీసులు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X