Search
  • Follow NativePlanet
Share
» »మాల్పే - దేశంలోనే తొలి వైఫై కనెక్టివిటీ గల బీచ్ !

మాల్పే - దేశంలోనే తొలి వైఫై కనెక్టివిటీ గల బీచ్ !

By Mohammad

రెట్టించిన ఉత్సాహం ... సముద్రపు శబ్ధాలు ... ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ... చుట్టూరా సముద్రం ... తినటానికి చేపలు, రొయ్యలు, పీతలు .... ఇలా ఎన్నో అనుభూతులు దరి చేరాలంటే కర్నాటక రాష్ట్రం ఉడుపికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర తీరం మాల్పే వెళ్ళవలసిందే ..!

ఇది కూడా చదవండి : ఉత్తమ తీరులో ఉడిపి పర్యటన !

మాల్పే అందమైన అద్భుతాల ద్వీపం. దేశంలోని సురక్షిత తీరాలలో ఇదొకటి. సాయంత్రం వేళ ఇక్కడి అద్భుత సూర్యాస్తమ దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులు, పెద్ద ఎత్తున యాత్రికులు తరలివ స్తుంటారు. భారతదేశాన్ని కనుగొన్న నావికుడు (సముద్ర మార్గాన్ని) వాస్కోడిగామా కు, మాల్పే బీచ్ కు ఒక సంబంధం ఉందండోయ్ ..! అదేదో చూస్తే మీకు తెలుస్తుందిగా ..!!

ఇది కూడా చదవండి : పడమటి కొండల్లో వెలసిన మూకాంబికా దివ్య క్షేత్రం !

సెయింట్ మేరీస్ ద్వీపాలు

సెయింట్ మేరీస్ ద్వీపాలు

వాస్కోడిగామా కాలికాట్ కు వెళుతూ ఉండగా కొబ్బరి చెట్లతో, పచ్చని ప్రకృతితో లీనమైన ఈ ప్రదేశాన్ని చూసాడట. దాని అందాలకు మంత్రముగ్ధుడైన వాస్కోడిగామా మేరీమాత ద్వీపాలని మాల్పే కు సమీపాన ఉన్న ద్వీపానికి పేరుపెట్టాడు. అదే నేడు సెయింట్ మేరీస్ ద్వీపాలుగా పిలువబడుతున్నది.

Photo Courtesy: Asem

సెయింట్ మేరీస్ ద్వీపాలు

సెయింట్ మేరీస్ ద్వీపాలు

సెయింట్ మేరీస్ ద్వీపాలు లేదా కొబ్బరి ద్వీపాల కు ఉన్న మరో విశేషం అక్కడి స్తంభాలు. స్తంభాలేంటి .. అనుకుంటున్నారా ? స్తంభాల్లాంటి రాళ్ళ శిలలు అక్కడ కనిపిస్తాయి. ఈ రాళ్ళ శకలాలు అగ్నిపర్వతం బద్దలవటం వల్ల ఏర్పడ్డవి గా శాస్తవేత్తలు నిర్ధారించారు.

Photo Courtesy: Arun Prabhu

సెయింట్ మేరీస్ ద్వీపాలు

సెయింట్ మేరీస్ ద్వీపాలు

మాల్పే తీరం నుండి సెయింట్ మేరీస్ ద్వీపాలకు చేరుకోవటానికి ఫెర్రి, లాంచీ సదుపాయం కలదు. ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యాటకులు అక్కడ సేదతీరావచ్చు. సాయంత్రం అయితే వెనుతిరగాల్సి వస్తుంది. రాత్రి వేళ అక్కడ ఉండేదుకు అధికారులు, కోస్టల్ సిబ్బంది అనుమతించరు.

Photo Courtesy: Vaishalee

మాల్పే

మాల్పే

దేశంలోనే వైఫై కనెక్టివిటీ ఉన్న తొలి బీచ్ గా మాల్పే ఖ్యాతికెక్కింది. రోజులో ఎప్పుడైనా తొలి 30 నిమిషాలు ఉచితంగా అంతర్జాలం(ఇంటెర్నెట్) ఉచితంగా వాడుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ ఈ సౌకర్యాన్ని అందిస్తున్నది.

Photo Courtesy: Kartik Bhat

దరియా బహదూర్ గడ్ కోట

దరియా బహదూర్ గడ్ కోట

దరియా బహదూర్ గడ్ కోట మాల్పే ద్వీపంలోని ఒక అందమైన ద్వీపం. చిన్నదే అయినప్పటికీ చూడటానికి సుందర ప్రదేశాలు ఉన్నాయి. మాల్పే నుండి ఇక్కడి చేరుకోవటానికి బోట్ సౌకర్యం ఉన్నది. అద్దె కూడా తక్కువే..!

Photo Courtesy: Siddharth Bargate

మాల్పే బీచ్

మాల్పే బీచ్

మాల్పే బీచ్ ప్రశాంతంగా ఉండే నీటి తో, నీలాకాశాలతో చూసేవారికి అందంగా కనిపిస్తుంది. సెయింట్ మేరీస్ ద్వీపాలకు వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు ఈ ద్వీపాలను చూస్తూ ఆనందించవచ్చు. సమయం ఉందనుకుంటే ఈ బీచ్ లో కూడా విహరించవచ్చు.

Photo Courtesy: Parul_Jain

వాదభండేశ్వర ఆలయం

వాదభండేశ్వర ఆలయం

వాదభండేశ్వర ఆలయం ఆలయం శిల్పకళ లకు ప్రసిద్ధి చెందినది. ఇది మాల్పే తీరానికి సమీపాన ఉన్నది. బలరామకృష్ణులు ఉండే ఈ ఆలయాన్ని అనంతేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. రోడ్డు పైనే ఉండే ఈ ఆలయానికి సమీప ఉడుపి నుండి బస్సులు, ట్యాక్సీ లే, ఆటోలు లేదా ఏదేని ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.

Photo Courtesy: Panduranga RB

మాల్పే ఎలా చేరుకోవాలి ?

మాల్పే ఎలా చేరుకోవాలి ?

మాల్పే చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాల సౌకర్యం ఉన్నది.

వాయు మార్గం

మాల్పే కు సమీపాన ఉన్న విమానాశ్రయం 50 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి మాల్పే చేరుకోవచ్చు.

రైలు మార్గం

మాల్పే లో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన 7 కిలోమీటర్ల దూరంలో ఉడుపి రైల్వే స్టేషన్ ఉన్న్డి. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం

ఉడుపి, మంగళూరు నుండి మాల్పే కు నేరుగా బస్సులు లభిస్తాయి. ఉడిపి నుండి ఆటో రిక్షాలలో కూడా మాల్పే తీరాన్ని చేరుకోవచ్చు.

Photo Courtesy: Raghavendra Ganiga

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X