Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

చండేలా రాజులకాలంలో క్రీశ9వ శతాబ్దం నుండి 11వశతాబ్దంలో 85ఆలయాల సముదాయంగా వున్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 25దేవాలయాలే వుండటం. ఒకింత విస్మయానికి గురిచేసే అంశం.

By Venkatakarunasri

చండేలా రాజులకాలంలో క్రీశ9వ శతాబ్దం నుండి 11వశతాబ్దంలో 85ఆలయాల సముదాయంగా వున్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 25దేవాలయాలే వుండటం. ఒకింత విస్మయానికి గురిచేసే అంశం. మరి ఇండియాలో ఆగ్రాతర్వాత ఎక్కువ మంది సందర్శించేప్రదేశం ఖజురహో. మరిది ఆగ్రాకి 400కిమీ ల దూరంలో వుంటుంది. ఇండో-ఆర్యన్ శిల్పకళకు అద్దంపట్టే ఎన్నో కళాఖండాలను శిల్పాలను మనం ఇక్కడ చూస్తాం. ఖజురహో మధ్య ప్రదేశ్లోని బున్దేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నది. ఇది వింధ్య పర్వత శ్రేణులకు వ్యతిరేకదిశలో ఉన్న కుగ్రామాల సముదాయం. ఖజురహో గొప్ప దేవాలయాలను కలిగి ఉన్నందున, ఈ గ్రామం పేరు ప్రపంచపటంలోకి ఎక్కింది. ఇక్కడ ఇసుకరాళ్ళతో మలచబడ్డ దేవాలయాలు, మరియు ప్రత్యేకమైన మరియు శృంగారభరితమైన శిల్పాలతో ఖజురహో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతున్నది.

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

మాతానాగేశ్వర్ దేవాలయం

ఈ దేవాలయం అనేది ఖజురహోలో మధ్యప్రదేశ్ లో వుంది. ఈ ఆలయాన్ని 900నుండి925 CEమధ్య నిర్మింపబడింది.ప్రస్తుతం ఈ ఆలయం ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. మైథాలజీ ప్రకారం ఈ శివాలయం కేదార్ నాథ్, వారణాశి, గయవంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలంత పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఈ ఆలయంలో 2.5మీటర్ల ఎత్తైన శివలింగాన్ని ప్రతిష్టించారు.మరి ఈ శివలింగం యొక్క వెడల్పు 1.1మీ వుంటుంది.మరి దీని యొక్క క్రింది బేస్ అనేది 1.2మీ హైట్ కలిగి 7.6డయామీటర్లను కలిగివుంటుంది. మరిక్కడ నగరి మరియు పర్షియన్ ఇన్స్ క్రిప్షన్స్ వున్నాయి. మరి ఖజురహోలోని ఇతరఆలయాలలో మాదిరిగా కాకుండా ఈ ఆలయంపై ఎలాంటి శిల్పాలను చెక్కబడిలేవు.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఈ ఆలయాన్ని శివుడికి అత్యంత పవిత్రమైన పూజలు నిర్వహించే ఆలయంగా భావిస్తారు.ఇక్కడ శివరాత్రికి 3రోజులపాటు వుత్సవాలు జరుగుతాయి. ఆ వుత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
ఈ సమయంలో శివలింగాన్ని పెళ్ళికొడుకులాగా తయారుచేయటం అక్కడి ప్రత్యేకత.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

చండేలా వంశానికి చెందిన చంద్రదేవ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఆ రాజు మాతాం అనే గురువుని పూజించారు. ఆయన పేరుమీదుగనే ఈ ఆలయాన్ని మాతాంగేశ్వర్ ఆలయంగా నిర్మించాడు. 1100ల సంలకు పూర్వం నిర్మించబడింది ఈ ఆలయం. మరిది అతిపెద్ద శివలింగం.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

దీని తర్వాత భోజ్ పూర్ లో వున్నదే అతిపెద్ద శివలింగంగా పేర్కొంటారు. ఉత్తరభారతాన్ని అతి తక్కువ కాలంగా పరిపాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేలా రాజులు ఇంతటి అద్భుతమైన కళాఖండాలను కలిగిన ఆలయాలను నిర్మించారు. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలో ఖజురహో గ్రామం వుంది.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

నర్మదా నదీ చంబల్ నదీపరివాహప్రాంతం వింధ్య పర్వతశ్రేణులు ఈ గ్రామానికి ఎల్లలుగా వుంటాయి. ఖజురహో దేవాలయాలనిర్మాణానికి దాదాపు 100ఏళ్లకు పైగానే పట్టివుండవచ్చని భావిస్తారు. మరి మొత్తం 85దేవాలయాల్లో ఇప్పటికీ నిలిచివున్నవి కేవలం 25దేవాలయాలుమాత్రమే.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది.సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఇక్కడ నిర్మించిన దేవాలయాలు హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. హిందీలో ఖజూర్ అనగా ఖర్జూరం అని అర్ధం. సుమారు 1000యేళ్ళచరిత్రకలిగిన ఈ దేవాలయాలు ఎన్నో ప్రకృతివైపరీత్యాలకు గురిఅయ్యాయి.ఎన్నో అనేక దాడులకు కూడా గురికావటం జరిగింది.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

మిగిలిన ఆలయాల్లో మాత్రం ఇప్పటికీ జీవం వుట్టిపడే శిల్పకళ సంపదను ఈనాటికీ సందర్శకులను ముగ్ధులను చేస్తుంది. 16వ శతాబ్దానికే అంతా కనుమరుగైపోయింది ఖజురహో. మరలా బ్రిటీష్ వారి హయాంలో 1839లో వెలుగులోకి రావటం జరిగింది.చండేలారాజులు నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అపురూపమేకాదు.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

శృంగారానికి ప్రతీకగా వుంటాయి. ఖజురహో ప్రాంతాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవటానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటుచేయటం విశేషం.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఆదినాథదేవాలయం

జైనతీర్ధంకరులు ఆదినాధుడికి అంకితమైన దేవాలయం ఇది. ఆలయగోడలపై సంగీతకారుల చిత్రాలను, భంగిమలను వర్ణించే అందమైన శిల్పాలను, స్త్రీలచెక్కడాలు అందంగా చెక్కబడివుంటాయి.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

గంటాయిగుడి

ఇది కూడా జైనదేవాలయం. ఇందులో వర్ధమాన మాహావీరుడి తల్లియొక్క 16స్వప్నాలను ఆవిష్కరించే చిహ్నాలు వున్నాయి. గరుడపక్షిపై వున్న జైనదేవత చిహ్నాలు కూడా ఇక్కడ వుంటాయి.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

పార్శ్వనాధ దేవాలయం

ఇక్కడ వున్న జైనదేవాలయాలలో అతిపెద్ద దేవాలయం ఇది.ఉత్తరం దిక్కుపై వున్న కుడ్యాలలో చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా వున్నాయి.నిజజీవితంలో రోజువారీ కార్యక్రమాలను ఇవి ప్రతిబింబిస్తాయి.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఖజురహోలో మరియు దాని చుట్టూ ఉన్నపర్యాటక ప్రదేశాలు

ఖజురహో దేవాలయాల శిల్పాలలో అన్ని రూపాలలో ఉన్న ప్రేమ మరియు కీర్తిని ప్రతిబింబిస్తుంటాయి. ఖజురహోలో చుసాథ్ యోగిని దేవాలయం, జవారి దేవాలయం, దేవి జగదాంబ దేవాలయం, విశ్వనాథ దేవాలయం, కండారియ మహాదేవ దేవాలయం, లక్ష్మణ దేవాలయం మరియు ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఖజురహో డాన్స్ ఫెస్టివల్ చాలా పెద్ద ఆకర్షణ.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 2 వరకు జరుగుతుంది. వారమంతా జరిగే ఈ పండుగకు భారతదేశంలోని అనేక కళాకారులు మరియు ప్రదర్శకులు వొస్తారు. ఖజురహో-వారసత్వానికి చిహ్నం ఖజురహోలోని దేవాలయాలను క్రి.శ. 950-1050లలో ఇండియా మధ్యభూభాగాన్ని పరిపాలించిన చందేల పాలకులు కట్టించారు.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఖజురహోలో ఉన్న 85 దేవాలయాలలో కేవలం 22 దేవాలయాలు మాత్రం కాలగమనంతో పాటు జీవించి ఉన్నాయి. మానవ భావోద్వేగాలను రాతిమీద మరియు అందమైన శిల్పాల రూపాలలో నమ్మలేనివిధంగా మలిచి, ప్రపంచ ఊహాత్మక శక్తిని ఆకర్షింపచేశారు. ఈ దేవాలయాలను 1986లో యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఖజురహో-ఎ సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఖజురహో కళ మరియు శిల్పాలు, ఇవి జీవిత సారాంశాలు. ఇక్కడ ఉన్న నిర్మాణశైలి మరియు శోభ అంతా మానవు సృజనాత్మకత మరియు జీవిత సంతోష చాయలకు ప్రతిరూపాలు. ఈ దేవాలయాలలో ఉన్న శిల్పకళ అంతా శృంగారభరితమైనదిగా పరిగణించినా, వాస్తవానికి ఇవి హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి. వీటిని భారతదేశంలో ఉన్న ఏడు వింతలలో ఒకటిగా భావిస్తారు.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఖజురహో-రాతి మీద వైవిధ్యం ఉన్న సృజనాత్మకత ఖజురహో దేవాలయాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి తూర్పు, పడమర మరియు దక్షిణం. పడమటి గ్రూపులో మొత్తం హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ అత్యుత్తమ నిర్మాణ శోభకు ప్రతీకగా నిలిచాయి.

వీటిలో అద్భుతమైనది మరియు పెద్దది కండారియ మహాదేవ ఆలయం. తూర్పు గ్రూపులో హిందూ మరియు జైన దేవాలయాలు ఉన్నాయి. ఇవి పశ్చిమదేవాలయాల వలె ఎక్కువ శిల్పకళతో లేకపోయినా, వాటి సొంతమైన కళ మరియు శోభతో అలరారుతున్నాయి. ఇందులో పార్శ్వనాథ్ జైన దేవాలయం పెద్దది.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఇక దక్షిణ గ్రూపులో కేవలం రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దులడియో దేవాలయం మరియు చతుర్భుజ్ దేవాలయం. ఈ దేవాలయాలలో పునరుద్ధరించబడిన శిల్పాలు కాని మరియు మిగతా దేవాలయాలలో ఉన్న నిర్మాణశైలి కాని కనపడవు.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఖజురహో సందర్శనకు ఉత్తమ సమయం

శీతాకాలం, అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలమైన సమయం.

దీనిని దర్శించటానికి అక్టోబర్ మరియు మార్చి నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ జరిగే డాన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఖజురహో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి,దీనిని దర్శించాలంటే శీతాకాలం అనుకూలంగా ఉంటుంది.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ఖజురహో ఎలా చేరుకోవాలి?

ఖజురహోకు అన్ని మార్గాల ద్వారా అనుసంధాన వ్యవస్థ ఉన్నది. ఈ పట్టణంలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ మరియు బస్సు-స్టాండ్ ఉన్నాయి. పట్టణమంతా తిరిగి చూడటానికి టాక్సీలు, రిక్షాలు మరియు సైకిళ్ళు అందుబాటులో ఉన్నాయి.

PC:youtube

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

రోడ్ మార్గం

ఖజురహో బస్సు సేవలు ద్వారా అనేక పెద్ద మరియు చిన్న నగరాలు మరియు మహోబా, జబల్పూర్, భూపాల్, ఝాన్సీ, ఇండోర్, గౌలియార్, మొదలైన పట్టణాలకు అనుసంధించబడి ఉన్నది. ఖజురహో నుండి ఈ ప్రదేశాలకు ప్రైవేటు మరియు రాష్ట్ర రవాణా బస్సులు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు ఖజురహో నుండి సాధారణ, AC, నాన్ AC, డీలక్స్ మరియు సూపర్ డీలక్స్ బస్సుల సౌకర్యాలను పొందవచ్చు.

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

రైలు మార్గం

ఖజురహో రైల్వే స్టేషన్ ఝాన్సి అనే చిన్న గ్రామానికి మరియు కొన్ని నగరాలకు అనుసంధించబడి ఉన్నది. ఖజురహో నుండి 73 కి.మీ. దూరంలో పెద్ద రైల్వే స్టేషన్, మహోబా ఉన్నది. మహోబా నుండి ఖజురహోకు టాక్సి ద్వారా చేరుకోవటానికి రూ.1200/- అవుతుంది.

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

ప్రపంచాన్నే తమవైపు తిప్పుకున్న దేవాలయం !

విమానమార్గం

ఖజురహోలో విమానాశ్రయం ఉన్నది. పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఈ విమానాశ్రయం ఉన్నది. ప్రధాన విమానయాన సంస్థలు దేశంలోని ప్రధాన నగరాలకు ప్రజలను ఈ విమానాశ్రయం నుండి రవాణా చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న సౌకర్యాలు మరియు నిర్మాణం అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X