Search
  • Follow NativePlanet
Share
» »మెదక్ - పండుగల పట్టణం !

మెదక్ - పండుగల పట్టణం !

తెలంగాణా రాష్ట్రంలో మెదక్ ఒక మునిసిపల్ టవున్. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ కు సుమారు 100 కి. మీ. ల దూరంలో కలదు. మెదక్ చరిత్ర చాలా ఆసక్తి కరంగా వుంటుంది. కాకతీయ రాజులు పాలించే కాలంలో ఈ పట్టణం పూర్తి అభివృద్ధి లో కలదు. శత్రువుల దాడులు నిలిపేందుకు కాకతీయ రాజు మెదక్ చుట్టూ ఒక పెద్ద కోట నిర్మించాడు. ఈ కోట ఒక కొండపై నిర్మించారు. దీనిని మేతుకూర్ దుర్గం అని పిలిచే వారు. స్థానికులు దీనిని మెతుకు సీమ అని కూడా పిలిచే వారు. 'మెతుకు' అంటే తెలుగు భాషలో వండిన బియ్యపు గింజ అని అర్ధం చెపుతారు.

మెదక్ పట్టణం లో అనేక పండుగలు నిర్వహిస్తారు. కనుక ఈ పట్టణ పర్యటన పర్యాటకులకు ఆసక్తి కరంగా కూడా వుంటుంది. ఈ ప్రాంతంలో తెలంగాణా ప్రజల పండుగలు అన్నీ ఎంతో అట్టహాసంగా చేస్తారు. అన్నిటిలోకి అతి వైభవంగా నిర్వహించేది బతుకమ్మ పండుగ. మెదక్ లో అనేక పర్యాటక ప్రదేశాలు కూడా కలవు. ఏడుపాయల దుర్గ భవాని గుడి, మెదక్ కోట, పాపికొండలు, పోచారం అభయారణ్యం మొదలైనవి ప్రధానమైనవి.

మెదక్ ఎలా చేరాలి ?

మెదక్ ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం
మెదక్ టవున్ నుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 100 కి. మీ. ల దూరం కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సేవలు కలవు.
ట్రైన్ ప్రయాణం
మెదక్ లో రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ 60 కి. మీ. ల దూరంలో కల కామా రెడ్డి టవున్ లో కలదు. ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.
రోడ్డు ప్రయాణం
మెదక్ నుండి ఇతర నగరాలకు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కలవు. హైదరాబాద్ మరియు వైజాగ్ ల నుండి డీలక్స్ మరియు వోల్వో బస్సు లు కూడా మెదక్ కు నడుస్తాయి. రోడ్డు మార్గం చక్కగా వుంటుంది కనుక ప్రయాణం సౌకర్యవంతంగా వుంటుంది.

Photo Courtesy: ShashiBellamkonda

ఏడుపాయల దుర్గ భవాని గుడి

ఏడుపాయల దుర్గ భవాని గుడి

ఈ గుడిలో మాత దుర్గా భవాని కొలువై వుంటుంది. ఈ ప్రాంతం లో దేవాలయమే కాక మీరు అనేక ఇతర సహజ రాతి నిర్మాణాలు చూడవచ్చు. ఈ ప్రాంతంలో మంజీరా నది ఏడు ప్రవాహాలుగా చీలి ప్రవహిస్తూ వేరొక చోట మరల కలసి పోతుంది.
Photo Courtesy: Msurender

మెదక్ కోట

మెదక్ కోట

మెదక్ లో చూడవలసిన మరో పర్యాటక ప్రదేశం మెదక్ కోట. పురాతనమైన ఈ కోటను కాకతీయ రాజులు శత్రువుల బారి నుండి రక్షించుకునేందుకు నిర్మించారు. దీనిని మహారాజ ప్రతాప రుద్రుడు 12 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ కోటలో సుమారు 17 వ శతాబ్దం కు చెందిన ఒక పెద్ద ఫిరంగి వుంటుంది. కోట నుండి పర్యాటకులు పట్టణ అందాలు చూడవచ్చు.
Photo Courtesy: Varshabhargavi

పాపి కొండలు

పాపి కొండలు

మెదక్ లో కల పాపి కొండలను పాప హిల్స్ అని కూడా పిలుస్తారు. ఈ పర్యాటక ప్రదేశం అధిక సంఖ్యాకులను ఆకర్షిస్తుంది. ఈ పర్వత శ్రేణులను మొదట్లో పాపిడి కొండలు అనేవారు. పాపిడి అంటే తెలుగు భాషలో వేరు పరచుట అని అర్ధం చెపుతారు. ఈ కొండలు గోదావరి నదిని వేరు పరుస్తాయి కనుక వీటికి ఈ పేరు వచ్చింది. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఒక జలపాతం కూడా ఇక్కడ కలదు. ఇక్కడ కల ఒక అభయారణ్యంలో వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు.

Photo Courtesy: Bruce McAdam

మెదక్ చర్చి

మెదక్ చర్చి

మెదక్ లో తప్పక చూడవలసిన ప్రదేశం మెదక్ చర్చి. ఈ చర్చి ని మెథడిస్ట్ క్రిస్టియన్ అఫ్ ఇండియా 1924 లో నిర్మించారు. ఈ చర్చి యొక్క శిల్ప శైలి గోతిక్ శైలి లో వుంటుంది. దీనిలో సుమారు 5,000 మంది ఒకేసారి ప్రార్ధనలు నిర్వహించవచ్చు. ఈ చర్చి లో జీసస్ జీవిత అంశాలను అనేకం చూడవచ్చు. అనేక మంది భక్తులు టూరిస్ట్ లు దీని శిల్ప కళ చూసి ఆనందించేందుకు కూడా వస్తారు.
Photo Courtesy: David Marchant

పోచారం

పోచారం

పోచారం అభయారణ్యం మెదక్ లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ అభయారణ్యం ఒకప్పుడు హైదరాబాద్ పాలించిన నిజాం నవాబులకు వేట ప్రదేశంగా వుండేది. ఇక్కడ కల పోచారం సరస్సు పేరుతో దీనికి ఈ పేరు వచ్చింది. ఆలేరు డాం నిర్మాణ సమయంలో ఈ సరస్సు కూడా నిర్మించారు. ఈ అభయారణ్యంలో మీరు వివిధ రకాల జంతువులు చూడవచ్చు. ఈ ప్రదేశానికి అనేక వలస పక్షులు కూడా వస్తాయి.

Photo Courtesy: Golo

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X