అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

మేఘమలై తమిళనాడులోని తేని జిల్లాలో దాగియున్న సంపద

Written by: Venkatakarunasri N
Updated: Thursday, February 16, 2017, 12:50 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మేఘమలై అనేది తమిళనాడు తేని జిల్లాలో గల చల్లని మరియు ఎత్తైన పర్వతాల మధ్య సముద్ర మట్టానికి 1500మీటర్ల ఎత్తులో వున్న చాలా ఆకర్షణీయమైన, అందమైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ ప్రదేశాన్ని పచ్చ కుమచి లేదా "గ్రీన్ పీక్" అని పిలుస్తారు.

మేఘమలై చుట్టుపక్కల ఉన్నటువంటి పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు మేఘమలై వన్యప్రాణుల అభయారణ్యం ట్రెక్కింగ్ కు, పక్షులను వీక్షించడానికి, బాహ్య ప్రపంచానికి దూరంగా గడపటానికి అనువైన ప్రదేశంగా చెప్పవచ్చును.

ఈ ప్రాంతంలో టీ, కాఫీ, ఏలకులు తోటలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వుడ్ బ్రియర్ టీ ఎస్టేట్ ఉంది. ఇక్కడ 6000 ఎకరాలు టీ తోటలు ఉన్నాయి. ఇది ఆసియాలో అతిపెద్ద తేయాకు కర్మాగారాలలో ఒకటి.

అటవీ ప్రాంతంలో అనేకంగా ఆవాసం వుంటున్న ఏనుగులను చూడవచ్చును. ఇక్కడ ఏనుగులే కాకుండా చిరుత, నీలగిరి థార్, ఆడవి దున్నలు, వివిధ రకాల జింకలు, ఎలుగుబంట్లు, పులులు మొదలైన వివిధ జంతువులకు నిలయం.

మేఘమలై తమిళనాడులోని తేని జిల్లాలో దాగియున్న సంపద

PC: wikipedia.org

ఎలా చేరుకోవాలి:

తేని నుండి చిన్నమనూర్ మీదుగా "మేఘమలై" చేరవచ్చు. ఇది ఒక సుందరమైన అనుభవాన్ని మీకు అందిస్తుంది.

తేని మాలాయి నుంచి 76 కి.మీ. దూరంలో ఉంది మరియు మధురై నుండి 120 కి.మీ. ఉంది. దిండిగల్ నుండి మొదలయ్యే బస్సులు ఇక్కడకు ఉన్నాయి.

మధురైలోని తిరుమలై నాయక్కర్ ప్యాలెస్:

మధురైలో విమానాశ్రయం మరియు రైల్వేస్టేషన్ దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ రహదారులు అందంగా ఉంటాయి అంతేకాకుండా నిర్దిష్ట ఆకృతిలో ఉండవు. కోడై రహదారి మీదుగా బెంగుళూరు నుండి మేఘమలై దూరం 501 కి.మీ ఉంటుంది. తెక్కాడి మార్గం మీదుగా అయితే 578 కి.మీ ఉంటుంది.

మేఘమలై తమిళనాడులోని తేని జిల్లాలో దాగియున్న సంపద

PC: wikipedia.org

మేఘమలైలో గల వసతులు:

కొంతమంది సిఫార్సులు మేరకు క్లౌడ్ మౌంటైన్ బంగళా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కొన్ని పరిమితులు ఉంటాయి. మనలార్ ఎస్టేట్ లో గల శాండ్ రివర్ వసతి గృహం. బస్టాండ్ కు దగ్గరగా ఇంకా కొన్ని వసతి గృహాలు ఉన్నాయి.

ఇక్కడ వసతిగృహాలలోని గదుల కొరకు ముందుగానే బుక్ చేసుకోమని సలహా ఇవ్వబడింది.

మేఘమలై తమిళనాడులోని తేని జిల్లాలో దాగియున్న సంపద

PC: wikipedia.org

ఇక్కడి వాతావరణం మరియు సందర్శించడానికి ఉత్తమ సమయం:

శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమసమయం. అక్టోబర్ నుండి మే వరకు సందర్శించవచ్చు. ఇక్కడ వేసవి కాలంలో సాధారంగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో సందర్శనకు వెళ్లకపోవటం మంచిది.

మేఘమలైలో సందర్శించవలసిన స్థలాలు:

1. మేఘమలై క్రూరమృగాల సంరక్షణా కేంద్రం (వైల్డ్ లైఫ్ సంక్చురి) :

600 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ స్థలం అత్యంత ముఖ్యమైన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. టీ మరియు కాఫీ తోటలు పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. మీ శెలవులు సరదాగా సంతోషంగా గడపడానికి ఇది ఒక మంచి స్థలం.

2. మేఘమలైలోని జలపాతాలు:

'క్లౌడ్ ల్యాండ్ ఫాల్" అనేది ఇక్కడ ఒక ప్రఖ్యాత జలపాతం. ఈ జలపాతంలో నీరు ఏడాది పొడవునా 190 అడుగుల ఎత్తు నుంచి చాలా వేగంగా పడుతుంది.

మేఘమలై తమిళనాడులోని తేని జిల్లాలో దాగియున్న సంపద

PC: wikipedia.org

3. వెల్లిమలై:

దీనిని మేఘమలై యొక్క గుండెగా పరిగణిస్తారు. ఎవరైతే ఇక్కడి శాస్త్రీయ టీ తోటలు, అడవి జంతువులను సందర్శిస్తారో వారికి ఇక్కడ నిష్కల్మషమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తుంది.

ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేకుండా చుట్టూ తిరుగి చూడగల ఒక మంచి ప్రదేశం. ఇక్కడి కొండలపై గల టీ తోటలు మరియు వివిధ జంతువుల అరుపులు మీకు ఎంతో అందమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఎటువంటి ఆందోళనలు లేకుండా హాయిగా విశ్రాంతిగా గడిపే ప్రదేశం.

తేనికి ఎలా చేరుకోవాలి?

English summary

Meghamalai The Hidden Paradise

Meghamalai is one of the hidden treasures of Theni district in Tamil Nadu. Here's an elaborate guide to this place.
Please Wait while comments are loading...