Search
  • Follow NativePlanet
Share
» »దెయ్యాలను వదిలించే దేవాలయం - రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ దేవాలయం

దెయ్యాలను వదిలించే దేవాలయం - రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ దేవాలయం

కొంతమందికి దెయ్యాలు, భూతాలూ, గాలి పట్టిందని కొన్నిరకాల ప్లేస్ లకు తీసుకువెళ్ళి అక్కడ భూతవైద్యులతో వదిలిస్తూ,ఏవేవో మంత్రాలు వేస్తూ కనిపిస్తుంటారు.ఇవి కొన్ని ప్లేస్లలోనే వుంటాయి.

By Venkatakarunasri

కొంతమందికి దెయ్యాలు, భూతాలూ, గాలి పట్టిందని కొన్నిరకాల ప్లేస్ లకు తీసుకువెళ్ళి అక్కడ భూతవైద్యులతో వదిలిస్తూ,ఏవేవో మంత్రాలు వేస్తూ కనిపిస్తుంటారు.ఇవి కొన్ని ప్లేస్లలోనే వుంటాయి. కానీ ఎటువంటి దేవాలయాలలో గానీ, గుళ్ళలోగానీ ఇలాంటి తంతు జరగదు.

కానీ భారతదేశంలోనే అదీ కాకుండా మొత్తం ప్రపంచంలోనే భూతాలను వదలగొట్టే ఒకే ఒక హిందు దేవాలయం. ఈ వ్యాసంలో నేను మీకు రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో మెహందీపూర్ బాలాజీ దేవాలయం గురించి వివరించాబోతున్నాను.

మామూలుగా బాలాజీ దేవాలయం అంటే ఏ వెంకటేశ్వరస్వామిదో అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ బాలాజీ అని ఆంజనేయస్వామిని పిలుస్తూవుంటారు. ఆంజనేయస్వామిని ఇక్కడ పూజిస్తూ వుంటారు.

ఈ గుడిలోకి గానీ మీరు వెళ్ళారంటే భయంతో మీ వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి గుడి ఏంటి ? దీని యొక్క ప్రత్యేకత ఏంటి ? ఎందుకు ఈ గుడిలోకి అందరూ వెళ్ళటానికి భయపడతారో ఆ విశేషాలని ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

దెయ్యాలను వదిలించే దేవాలయం - రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ దేవాలయం

 ప్రత్యేకమైన దేవాలయం

ప్రత్యేకమైన దేవాలయం

మామూలుగా మనం ఏ హిందు దేవాలయాన్ని చూసినా సరే చాలా ప్రశాంతంగా దేవుని యొక్క స్తోత్రాలతో, దేవుని యొక్క పాటలతో, భక్తులతో మనస్సుకు ప్రశాంతతనిస్తూ ఆ గుడ్లో వుండే దేవుడ్ని కొలిచే భక్తులను చూస్తుంటాం.కానీ ఈ మెహందీపూర్ బాలాజీ దేవాలయం మాత్రం ఒక ప్రత్యేకమైంది. మనం చాలా సార్లు చూసేవుంటాం.

PC: youtube

ఎక్కడా లేని తంతు

ఎక్కడా లేని తంతు

కొంతమందికి దెయ్యాలు, భూతాలూ, గాలి పట్టిందని కొన్నిరకాల ప్లేస్ లకు తీసుకువెళ్ళి అక్కడ భూతవైద్యులతో వదిలిస్తూ,ఏవేవో మంత్రాలు వేస్తూ కనిపిస్తుంటారు.ఇవి కొన్ని ప్లేస్లలోనే వుంటాయి. కానీ ఎటువంటి దేవాలయాలలో గానీ, గుళ్ళలోగానీ ఇలాంటి తంతు జరగదు.

PC: Seoduniya,pramod kumar gupta

 భూతాలను వదలగొట్టే ఒకే ఒక హిందు దేవాలయం

భూతాలను వదలగొట్టే ఒకే ఒక హిందు దేవాలయం

కానీ భారతదేశంలోనే అదీ కాకుండా మొత్తం ప్రపంచంలోనే భూతాలను వదలగొట్టే ఒకే ఒక హిందు దేవాలయం.ఈ పవిత్రమైన శ్రీమెహందీపూర్ బాలాజీ దేవాలయం.

గుడి ఆవరణ ఎలా వుంటుంది

గుడి ఆవరణ ఎలా వుంటుంది

ఈ గుడి ఆవరణలో చూసారంటే దెయ్యాలతో,భూతాలతో పీడించబడి ఎన్నో బాధలు పడుతున్న కొంతమంది ఈ గుడి చుట్టూ మీకు కనిపిస్తూనే వుంటారు.

గుడి ఎక్కడ వుంది?

గుడి ఎక్కడ వుంది?

అలాంటి భయంకరమైన ఈ గుడి రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో వుంది. ఈ విధంగా ఇండియాలోనే దుష్టశక్తులను వదలగొట్టే ఆంజనేయస్వామి బాలాజీ అనే పేరుతో కొలవబడుతూ ఈ ఆలయంలో పూజలని అందుకొంటూ వున్నారు.

ఆశ్చర్యకరమైన దృశ్యాలు

ఆశ్చర్యకరమైన దృశ్యాలు

ఈ ఆంజనేయస్వామి విగ్రహం కూడా చాలా వింతగా వుంటుంది.అలాగే చాలా మహిమ గలిగిన దేవుడిగా ఇక్కడ ఎంతో ఖ్యాతిగాంచినది.ఈ బాలాజీ ఆంజనేయస్వామే స్వయంగా భూతవైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలుగా ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది.

పరిశోధనలు

పరిశోధనలు

ఈ విధంగా మనదేశంలోనే హిందు దేవాలయంలో వింతగా భూతాల్ని వదలగొట్టే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం గురించి తెలుసుకోవడానికి ఇతరదేశముల నుండి కొంత మంది పరిశోధనలు చేయటానికి కూడా అక్కడకు వచ్చారంట.

భూతాలను తరిమిగొట్టే శక్తికలిగిన దేవతామూర్తి

భూతాలను తరిమిగొట్టే శక్తికలిగిన దేవతామూర్తి

మనం చాలా ప్రాంతాలలో ఆంజనేయస్వామి విగ్రహాల్ని, గుడుల్ని చూసేవుంటాం. కానీ వాటి అన్నిటికీ కూడా భిన్నంగా భూతాలను తరిమిగొట్టే శక్తికలిగిన దేవతామూర్తిగా ఈ గుడిలోని ఆంజనేయ స్వామి పూజలనందుకుంటున్నాడు.

 గుడి యొక్క వాతావరణం

గుడి యొక్క వాతావరణం

ఈ గుడి యొక్క వాతావరణం చాలా భయంగా వుంటుంది. కొత్తవాళ్ళు ఎవరైనా ఇక్కడకు వెళ్ళడానికి ఎంతో భయపడుతూ వుంటారు.ఎందుకంటే ఈ దేవాలయానికి తమకి పట్టిన దుష్టశక్తులు వదిలించుకోవటానికి, వాటి వల్ల బాధపడుతున్న ఎంతోమంది ఈ గుడికి వస్తూవుంటారు.

వేల మంది భక్తులు

వేల మంది భక్తులు

అలాంటివారితో ఈ గుడి చుట్టు ప్రక్కల ప్రాంతాలు కనిపిస్తూ వుండటం వల్ల కొత్తవారికి చాలా భయంగా వుంటుంది.ఈ గుడికి ప్రతిరోజూ కొన్నివేల మంది వస్తూవుంటారు.

దుష్టశక్తులు,తంత్రాలతో బాధపడుతున్న వారు

దుష్టశక్తులు,తంత్రాలతో బాధపడుతున్న వారు

రాజస్థాన్ లో ఉండేవారే కాకుండా దేశంలో చాలా మంది దుష్టశక్తులు,తంత్రాలతో బాధపడుతున్న వారు ఈ గుడికి వచ్చి ఈ ఆంజనేయస్వామి దర్శనం చేసుకుంటూ వుంటారు. జాతి,మత బేధాలు లేకుండా గూడా చాలా మంది ఈ స్వామివద్దకు వచ్చి దర్శనం చేసుకుంటారు.

పర్వతం పైన గుడి

పర్వతం పైన గుడి

ఇది ఆ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో ఒక పర్వతం పైన ఈ గుడి వుంటుంది. ఈ గుడి వున్న పల్లెటూరి ప్రాంతం అంతగా అభివృద్దిచెందకపోయినా ఈ గుడి మాత్రం ఎంతో ఫేమస్సయింది.

భయాన్ని గొలిపే అరుపులు, గోలలు

భయాన్ని గొలిపే అరుపులు, గోలలు

ఈ గుడిలోకి అడుగుపెట్టినవెంటే మన వెన్నులో వణుకుపుట్టించే విధంగా ఒక రకమైన అరుపులు, గోలలు, ఏడుపులు మనకు వినిపిస్తూ వుంటాయి. అవి కొత్తవాళ్ళకి చాలాభయాన్ని గొలుపుతాయి.

ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామి

చాలామంది ధైర్యం చేసి ఆ గుడిలోకి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని వస్తారు. ఎందుకంటే ఈ అరుపులు, గోలలు ఇవన్నీ కూడా అక్కడ దుష్టశక్తులతో ఇతరమనుషులవే. వారు వారికున్న ఆ రోగాల్ని నయం చేసుకోటానికే ఈ ఆంజనేయస్వామి గుడికి వస్తూవుంటారు.

పూజారులు

పూజారులు

ఈ గుడిలో ముఖ్యంగా ఇద్దరు పూజారులు వుంటారు.వీరు ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. ఇంతకూ ముందు ముఖ్య పూజారిగా గణేష్ పుర్జీ మహారాజ్ పూజారి వుండేవారు.అతని తర్వాత ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా శ్రీ కిషోర్ పుర్జీ మహారాజ్ వున్నారు. ఇద్దరు పూజారులు గూడా భక్తితో,నిష్ఠతో అక్కడ ఆ గుడ్లో పూజలు చేస్తూ వుంటారు.

 ప్రసాదాలు

ప్రసాదాలు

ఈ బాలాజీ హనుమాన్ గుడి ముందే శ్రీరాముని యొక్క ఇంకొక చిన్నదేవాలయం కూడా వుంది.భూతాలను వదిలించే బాలాజీ హనుమంతుణ్ణి దర్శించుకొనేవాళ్ళు తమకున్న భూతాలను నిర్మూలన చేసుకోటానికి ఆరోజీ స్వామిని దరకష్ట్,భుంది అనే రకరకాల కానుకల్ని,ప్రసాదాల్ని ఈ బాలాజీ ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా సమర్పించుకుంటూవుంటారు.

ముఖ్యమైన దినాలు

ముఖ్యమైన దినాలు

ఈ ఆలయం లోపల భాగంలో భైరవబాబా అనే ఒక బాబాను కూడా దర్శించుకోవచ్చు.ఈ బాబాకి భక్తులు అన్నాన్ని కానుకగా ఇస్తూ వుంటారు. ఈ గుడిలో మిగతారోజుల కంటే మంగళవారం, శని వారం మాత్రమే అక్కడకు వచ్చేవాళ్లకి భూతాల్ని,దెయ్యాల్ని వదలగొట్టే మంచి రోజులుగా చెప్తూవుంటారు. ఎవరైతే ఈ విధంగా దెయ్యాలతో,భూతాలతో పీడించబడుతూ వున్నారో వారు మంగళవారం,శనివారం ఎక్కువగా ఈ గుడికి వస్తూ వుంటారు.

చుట్టుపక్కన ఆలయాలు

చుట్టుపక్కన ఆలయాలు

బాలాజీదేవాలయానికి దగ్గరలో అంజనా మాతాదేవాలయం, కాళీమఠం, పంచముఖీ హనుమాన్ జీ దేవాలయం,సమాధివాలే బాబా ఇలాంటి చాలా గుళ్ళుగోపురాలు గూడా ఈ బాలాజీదేవాలయానికి చుట్టుపక్కల్లో మీకు కనిపిస్తూనేవుంటాయి.

పరిశోధనలు

పరిశోధనలు

ఈ విధంగా భూతాలని మంత్రశక్తులని వదిలించే బాలాజీ గురించి రీసెర్చ్ చేయటానికి జర్మనీ అలాగే నెదర్లాండ్స్ అలాగే న్యూఢిల్లీ నుంచి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు 2013లో ఈ గుడి దగ్గరకు వచ్చి ఈ స్వామి పైనా,ఇక్కడ గుడి పైనా,ఇక్కడి వాతావరణం పైన కొన్ని పరిశోధనలు కూడా చేసారంట.

నిష్టలునియమాలు

నిష్టలునియమాలు

ఈ గుడికి రావాలంటే కొన్ని నిష్టలునియమాలు కూడా అక్కడి భక్తులు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది భక్తులు ఎవరైతే ఈ గుడికి రావాలనుకుంటే వాళ్ళు మాంసం,మద్యం అస్సలు సేవించకూడదంట.

ప్రత్యేక స్థలం

ప్రత్యేక స్థలం

ఎవరయితే భూత ప్రేతాలతో పీడించబడుతూ వున్నారో అలాటి వారిని ఈ ఆలయంలో ఒక ప్రత్యేక స్థలంలో పూజచేసిన తర్వాత ఒంటరిగా విడిచిపెడతారంట.అలాగే ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఎవరు కూడా ఇంటికి తీసుకువెళ్లకూడదంట.

ప్రసాదం

ప్రసాదం

ప్రసాదాన్ని మొత్తం ఈ గుడి యొక్క ఆవరణలో వుండగానే తినేయాలంట. ఒక వేళ అలా కాదని ప్రసాదాన్ని ఎవరైనా ఇక్కడ నుంచి తమ ఇళ్ళకు తీసుకువెళ్తే వారికి కీడు జరుగుతుందని భక్తుల యొక్క అభిప్రాయం.

గుడి తెరిచే వేళలు

గుడి తెరిచే వేళలు

ఈ గుడి వారంలో అన్ని రోజులు తెరిచే వుంటుంది. కాకపోతే ఉదయం 6 నుంచి 9 గం ల వరకు ఉదయం చాలా మంది దర్శనం చేసుకోటానికి వస్తూవుంటారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

మెహందీపూర్ బాలాజీ దేవాలయం కు హైదరాబాద్ నుండి చింద్వర మీదుగా 24 గంటలు పడుతుంది.

pc:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X