Search
  • Follow NativePlanet
Share
» »ప్రతి ఏటా ఋతుచక్రం ఆచరించే దేవత !

ప్రతి ఏటా ఋతుచక్రం ఆచరించే దేవత !

ఒక్క రాత్రిలో ఊరు మొత్తం ఖాళీ...ఒక్క రాత్రిలో ఊరు మొత్తం ఖాళీ...

మహిళలు నెలసరి రుతు స్రావం ఆచరించటం ఎంతో సాధారణం. అయితే, మనం అంతా ఎంతో భక్తి ప్రపత్తులతో కొలిచే దేవత సైతం ఋతుచక్రం ఆచరించటం అనే మాటను ఎక్కడైనా విన్నారా ? అవును...ఇది అక్షరాలా నిజం.

ఈ వేడుకను "అంబా బుఛి మేళ " అనే పేరుతో పిలుస్తారు. ఈ వేడుక ఎక్కడో కాదు, మన దేశంలోని అస్సాం రాష్ట్రంలో పెద్ద పట్టణం అయిన గౌహతి లోని ప్రసిద్ధ కామాఖ్య దేవి దేవాలయంలో ఆచరిస్తారు. ఈ దేవాలయానికి హిందువులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రత్యేకించి తంత్ర విద్యలలో సాధన చేసేవారు ఈ మాతను కొలుస్తారు. నగరంలోని దేవాలయాలలో ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

ఇక్కడ కామాఖ్య దేవి తో బాటు, భువనేశ్వరి, బాగల ముఖి, త్రిపుర సుందరి, తార, కాళి, భైరవి, ధూమావతి, మాతంగి మరియు కమలా దేవి మొదలైన దేవాలయాలను కూడా ఇక్కడ చూడవచ్చు.
సంవత్సరానికి ఒకసారి ఋతుచక్రం ఆచరించే దేవాలయం

అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
కామాఖ్య దేవాలయం లో జరిగే ప్రసిద్ధ అంబా బుఛి ఉత్సవం అస్సాం లో వర్షాకాల సమయం అంటే జూన్ నెల మధ్యలో ఆచరిస్తారు. దీనిని కామాఖ్య దేవి రుతు మాసం గా పిలువబడుతూ అతి వైభవంగా నిర్వహించ బడుతోంది. చిత్ర కృప : Kunal Dalui

అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
ఈ దేవి సంవత్సరంలో ఒకే సమయంలో రుతు చక్రం అనుభావిస్తున్నట్లు నమ్ముతారు. అంతే కాదు, ఈ సమయంలో ఈ దేవి శక్తి అధికం అవుతుందని నమ్ముతారు. భక్తి శ్రద్ధలతో పూజించే వారికి ఈ దేవి దయ తప్పక ఉంటుందని చెపుతారు. చిత్ర కృప : Gitartha Bordoloi

అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
ఆసక్తి కర విషయం ఏమంటే, ఈ దేవాలయంలో దేవి విగ్రహం బదులుగా "యోని" ఆకారంలో కల ఒక రాతి నిర్మాణం కలదు. దాని పై సహజంగా కొంత నీటి చెమ్మ ఆవర్భవించటం చూడవచ్చు.

అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
కాళికా పురాణం మేరకు, ఈ దేవాలయం శివ, సతి ప్రాణ త్యాగం తర్వాత ఆమె దేహమును భుజం పైకి ఎత్తుకుని తాండవం చేసే సమయంలో ఆ మాత యొక్క యోని భాగం ఈ ప్రదేశంలో పడినదని నమ్ముతారు. దేవీ భాగవతంలో పేర్కొనిన 108 శక్తి పీఠాల లో సతీ దేవి యొక్క ఈ దేహ భాగం గురించిన వివరణ ఉన్నప్పటికీ, తర్వాతి అనుబంధ రచనలలో కామాఖ్య దేవి గురించి పేర్కొనటం జరిగినది. చిత్ర కృప: chandrashekharbasumatary

 అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం

తంత్ర విద్యల ఆవాహన లో కేంద్ర బిందువు అయిన ఈ దేవాలం, అంబా బూచి ఉత్సవం లో అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. చిత్ర కృప : Vikramjit Kakati

 అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం

సామాన్యంగా పుష్పం మొదలైన వాటితో పూజిస్తున్నప్పటికి అపుడపుడూ జంతు బలులు సైతం ఇక్కడ సాధారణం. అయితే బలులు సమయంలో నియమానుసారం ఆడ జంతువులను బాలి ఇవ్వాల్సినప్పటికి, అధిక సంఖ్యా బలులప్పుడు ఈ నియమం పాటించరు.

 అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
ఇంకనూ ఈ దేవాలయం గురించి చెప్పాలంటే, దేవాలయంలో మొత్తంగా నాలుగు గదులు చూడవచ్చు. ఒకటి గర్భం కాగా, ఇతర మూడు మంటపాలను, కాలంత, పంచరత్న, మరియు నట మందిర అని పిలుస్తారు. చిత్ర కృప : Subhashish Panigrahi

 అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
గర్భాలయం లోకి వెళ్ళాలంటే, చిన్న చిన్న మెట్ల పై వెళ్లి చేరాలి. ప్రధాన దేవత కల పీఠం కల స్థలంలో కొన్ని అంగుళాల లోతు యోని ఆకారం చూడవచ్చు.
చిత్ర కృప : Raymond Bucko, SJ

 అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
దేవాలయ వెలుపలి గోడలు అందమైన చిత్రాలతో నిండి చూసేందుకు ఆనందంగా వుంటుంది. చిత్ర కృప: Manabendra Ray

 అస్సాం లో రుతు మాస వేడుకలు !

అస్సాం లో రుతు మాస వేడుకలు !

కామాఖ్య దేవాలయం
అంబా బూచి వేడుకలే కాక ఏటా ఇతర పూజలు కూడా జరుగుతాయి. నవరాత్రి సమయంలో దుర్గా పూజ కూడా చేస్తారు. అయిదు రోజుల పాటు నడిచే ఈ ఉత్సవం కు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. చిత్ర కృప: Vikramjit Kakati

 అస్సాం లో రుతు మాస వేడుకలు

అస్సాం లో రుతు మాస వేడుకలు

కామాఖ్య దేవాలయం

దేవాలయ పూజలు నిర్వహించే అర్చకులు

చిత్రక్రుప: kulasundari

 అస్సాం లో రుతు మాస వేడుకలు

అస్సాం లో రుతు మాస వేడుకలు

కామాఖ్య దేవాలయం

దేవాలయంలో ఎంతమంది భక్తులు వస్తున్నప్పటికీ తన పనిలో నిమగ్నం అయిన ఒక సాధువు Warlock D

 అస్సాం లో రుతు మాస వేడుకలు

అస్సాం లో రుతు మాస వేడుకలు

కామాఖ్య దేవాలయం

దేవి కృప కోరుతూ తనదైన విశిష్ట భంగిమలో శంక నాదం చేస్తున్న ఒక భక్తుడు. చిత్రక్రుప : Ankur Jyoti Das

 అస్సాం లో రుతు మాస వేడుకలు

అస్సాం లో రుతు మాస వేడుకలు

కామాఖ్య దేవాలయం

గౌహతి పట్టణం విమానం, రైలు, మరియు బస్సు లో చేరవచ్చు.

చిత్రక్రుప: Jyoti Prakash Bhattacharjee

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X