Search
  • Follow NativePlanet
Share
» »గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్ ను మీరెప్పుడైనా చూసారా?

గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్ ను మీరెప్పుడైనా చూసారా?

ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు వున్నాయి. ఒక్కోసారి కొన్ని వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటిది శివుడి గుడి అయితే అది మహాద్భుతమే. అదే ఈ అద్భుతశివలింగం.

By Venkatakarunasri

ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు వున్నాయి. ఒక్కోసారి కొన్ని వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటిది శివుడి గుడి అయితే అది మహాద్భుతమే. అదే ఈ అద్భుతశివలింగం.

అరేబియాసముద్రంలో వుందంటే నమ్మగలమా?నమ్మితీరాల్సిందే. కానీ ఆ గుడిలోకి వెళ్ళాలంటే సాహసయాత్రే అవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం సముద్రపు అలలు వుప్పొంగినా, సమయం దాటిపోయినా,మనం శివుడిలో ఐక్యం అయిపోతాం.

మరి ఈ అరేబియా సముద్రంలో వున్నటువంటి లింగేశ్వరుని ఆలయం గురించి తెలుసుకోవాలని వుందా?

అరేబియా సముద్రంలో ఉన్న ఆ శివాలయం గురించి మీకు తెలుసా ?

1. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

1. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

గుజరాత్ అహమ్మదాబాద్ కి దగ్గరలో బాలానగర్ సమీపంలో వున్న అరేబియా సముద్రపు ఒడ్డున ఈ ఆలయం మనకు కనిపిస్తుంది.

2. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

2. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

కుళియాక్ అనే గ్రామం ద్వారా వెళ్లి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. సముద్రంలో సుమారు 2కి.మీ ల లోపలి ఈ ఆలయం నిర్మితమై వుంది.

3. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

3. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

సముద్రపు అలలు తగ్గుముఖం పట్టే మధ్యాహ్నపు వేళల్లోనే మనం ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి.ఇక్కడ 5 లింగాలు వుంటాయి.

4. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

4. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ఇక్కడ శివుడికి నిత్యం అభిషేకం జరుగుతూనే వుంటుంది.మధ్యాహ్నం 2 గంటలు దాటినతర్వాత మనం ఈ గుడిలోకి ప్రవేశించవచ్చు.

5. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

5. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

మళ్ళీ సాయంకాలం 8 గంటలు దాటుతున్న సమయంలో తిరిగి వెనక్కి వచ్చేయాలి. లేదంటే మాత్రం ఈ గుడితో పాటు మనం కూడా సముద్రంలో కలిసిపోతాం.

6. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

6. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

కేవలం దూరం నుంచి మనకు ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. అలలు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద రూఫ్స్ సహాయంతో మనము ఈ గుడిలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి.

7. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

7. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ఇక్కడ ప్రధానమైన శివలింగానికి పూజ చేస్తే మనస్సులో కోరికలన్నీ తీరతాయి.ఎందుకంటే ఈ లింగాలను పంచపాండవులు ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతుంది.

8. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

8. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ధర్మరాజు ప్రతిష్టించిన లింగేశ్వరుడిని ఇక్కడ భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో కొలుస్తారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా ఇక్కడ లింగాలను ప్రతిష్టించారు.

9. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

9. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

అందుకే ఇక్కడ మనకి 5 లింగాలు దర్శనమిస్తాయి. ఇక ఈ గుడి పున్నమికాంతిలో చూసి తీరాల్సిందే. చంద్రుని కాంతి ఈ లింగంపై బడి అద్భుతంగా కనిపిస్తుందని అది ఖచ్చితంగా చూసితీరాల్సిందేనని ఇక్కడి ప్రజలు చెప్తారు.

10. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

10. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ఇక్కడ పూజారులు ఎవరూ వుండరు. కేవలం భక్తులతో పాటే వచ్చి భక్తులతో బయటకు వచ్చేస్తారు. వారితో పాటు మనం వెళ్లి పూజను ముగించుకొని తిరిగి వచ్చేయాలి.

 11. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

11. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ముఖ్యంగా ఈ గుడికి చిన్న పిల్లలను అనుమతించరు. ఎందుకంటే వారు సముద్రంలో నడువలేరు.కేవలం 10సంలు దాటితేనే అనుమతిస్తారు.

12. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

12. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

తాళ్ళసహాయంతో మెల్లగా అడుగులోఅడుగు వేసుకుంటూ అలలను దాటుకుంటూ ఈ గుడిలోకి భక్తులు ప్రవేశిస్తారు. గుడి మొత్తం నాచుతో కప్పబడి పోయివుంటుంది. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే జారి పడి పోయే ప్రమాదం వుంది.

13. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

13. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

సముద్రంలో ఇలాంటి ఆలయం వుండటం నిజంగా భారతదేశంలో అద్భుతమనే చెప్పాలి. గుజరాత్ పర్యాటకులకు ఈ గుడి గురించి చెప్పి వారికి ఇష్టమైతే ఈ గుడి దగ్గరకు తీసుకునివెళతారు.

14. భావ్ నగర్ కు దగ్గరలో చూడాల్సిన పర్యాటక స్థలాలు

14. భావ్ నగర్ కు దగ్గరలో చూడాల్సిన పర్యాటక స్థలాలు

బ్రహ్మ కుంట

గుజరాత్ లోని భావ నగర్ జిల్లలో సిహోర్ నగరం లో బ్రహ్మ కుండ్ లేదా బ్రహ్మ కుంట కలదు. ఇది ఒక మెట్ల బావి. ఎన్నో అందమైన హిందూ దేవతల శిల్పాలు కలిగి వుంది. రానక్ దేవి చే శపించబడిన రాజు సిద్ధరాజ్ తన చర్మ వ్యాధుల నుండి ఈ బావి నీటిచే నయం చేయబడ్డాడని చెపుతారు. ఈ బావికి గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలదు. బ్రహ్మ కుండ్ మధ్య యుగం నాటి శిల్ప కళల తో అనేక మెట్లు, చిన్న టెంపుల్స్, విగ్రహాలు, దేవతలు వంటి వాటితో అందంగా నిర్మించ బడింది.

15. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

15. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

గాంధీ స్మ్రితి భవనం

గాంధీ స్మ్రితి భవనాన్ని 1955 లో మహాత్మా గాంధి కి స్మారకంగా నిర్మించారు. ఇక్కడ మహాత్మా గాంధి ఉపయోగించిన వస్తువుల సేకరణ తో పాటు, వివిధ రకాల పుస్తకాలను కూడా ఉంచారు. గాంధి గారి జీవిత విశేషాలను చూపుతూ అనేక ఫోటో గ్రాఫులు కూడా ప్రదర్శిస్తారు. కాల క్రమేణా గాంధీ స్మ్రిత్ గొప్ప పర్యాటక ప్రదేశంగా రూపు దిద్దుకొంది. సిటీలోని ఏ ప్రాంతం నుండి అయినా సరే తేలికగా ఇక్కడకు చేరవచ్చు.

16. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

16. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

గౌరీ శంకర్ లేక్ మరియు విక్టోరియా ఫారెస్ట్

దివాన్ శ్రీ గౌరీ శంకర్ ఓజా పేరుతో ఈ లేక్ ను మరియు విక్టోరియా ఫారెస్ట్ ను సుమారు 381 హెక్టార్ ల భూమిలో నిర్మించారు. దీనిని బోర్ తాలాబ్ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు ను 1872 లో ఒక నీటి రిజర్వాయర్ గా తాగు నీటి కొరకు ఏర్పరచారు. సిటీలో చక్కటి పిక్ నిక్ స్పాట్ గా పేరు పడింది. దీనికి సమీపంలో ఒక లక్ష చెట్ల పైగా కల ఒక చిన్న అడవి కూడా కలదు. దీనిలో ఎన్నో వృక్షాలు, జంతువులు కూడా కలవు. ఈ అడవి లో మొక్కల పెంపకానికి అవసరమైన రెండు నర్సరీ లు కూడా కలవు.

 17. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

17. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

నీలంబాగ్ పాలస్

నీలం బాగ్ పాలస్ లో ప్రస్తుతం రాజ కుటుంబ సభ్యులు వుంటున్నారు. ఈ పాలస్ లో రాజ కుటుంబం నిర్వహిస్తున్న ఒక అయిదు నక్షత్ర హోటల్ కలదు. ఈ పాలస్ ను క్రి. శ. 1859 లో సుమారు 10 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీనిని ఒక జర్మన్ శిల్పి రూపొందించి నప్పటికీ, ఆనాటి భారతీయ శిల్ప కళ కూడా ఈ నిర్మాణం కలిగి వుంది.

18. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

18. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

పాళీ తానా జైన్ టెంపుల్స్

పాళీ తానా టెంపుల్స్ జైనులకు ఎంతో పవిత్రమైనవి. ఇవి సుమారు 3000 కు పైగా ఇక్కడ కల శత్రున్జయ కొండల పై భాగం లో కలవు. చక్కగా మార్బల్ నిర్మాణం కలిగి వుంటాయి. ఇక్కడి టెంపుల్ ను జైనుల మొదటి తీర్థంకరుడు అయిన ఆది నాధుడికి అంకితం ఇచ్చారు. మిగిలిన టెంపుల్స్ సుమారు 900 సంవత్సరాల కాలంలో వివిధ జైన మతస్తులచే నిర్మించ బడ్డాయి. వీటిలో కుమార్పాల్, విమల్ షా మరియు సంప్రితి రాజా ప్రధానమైనవి. జైనుడు అయిన ప్రతి ఒక్కరూ కొండ ఎక్కి ఇక్కడి మందిరాలను తమ జీవిత కాలంలో ఒక్క సారి దర్శించి జన్మ ధాన్యం చేసుకోవాలని వాన్చిస్తారు. ఈ కొండ దర్శనం వారికి మోక్షం ప్రసాదిస్తుందని భావిస్తారు.

19. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

19. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ఇక్కడకు ఎలా చేరాలి

మరి ఇక్కడకు వెళ్లాలనుకునేవారు అహమ్మదాబాద్ చేరి అక్కడి నుంచి బాలానగర్ కు వెళ్లి ఈ గుడిలో ప్రతిష్టించిన లింగేశ్వర స్వామిని దర్శించుకోవాలి.

రోడ్డు ప్రయాణం

భావ నగర్ నుండి అహ్మదాబాద్, వదోదర, సూరత్ ల లోని వివిధ ప్రదేశాలకు బస్సు లు కలవు. చార్జీలు అధికమైనప్పటికీ బస్సు లు ఎయిర్ కండిషన్ కావున సౌకర్య వంతంగా వుంటుంది. రాజ్ కోట్ , జామ్ నగర్ ల నుండి రెగ్యులర్ బస్సు లు కలవు.

20. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

20. గుజరాత్ లోని నిష్కళంక్ మహదేవ్ టెంపుల్

ఇక్కడకు ఎలా చేరాలి

రైలు ప్రయాణం

భావనగర్ రైలు స్టేషన్ కు గుజరాత్, అహ్మదాబాద్, వదోదర వంటి ప్రధాన నగరాల నుండి రైళ్ళు కలవు.

విమాన ప్రయాణం

భావ నగర్ లోని స్థానిక విమానాశ్రయం నుండి విమానాలు ముంబై వంటి ప్రధాన నగరాలకు కలవు. ప్రధాన విమాన సర్వీస్ లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మరియు జెట్ ఎయిర్ వేస్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి సేవలు అందిస్తారు. భావ నగర్ చేరాలంటే, ఇది సౌకర్య వంతమైన ప్రయాణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X