Search
  • Follow NativePlanet
Share
» »కేరళ లో చిరు జల్లుల ప్రదేశాలు

కేరళ లో చిరు జల్లుల ప్రదేశాలు

ప్రస్తుతం కేరళ రాష్ట్రం వర్షాలు పొందనుంది. మందు వేసవి తర్వాత వచ్చే వర్షాలు ప్రతి ఒక్కరికి ఆహ్లాదం కలిగిస్తాయి. సాధారణంగా వర్షం పడితే ప్రదేశాలు తడితో అసౌకర్యంగా వ్లున్తాయని భావిస్తాము. రోడ్లు బురద మాయం అవుతాయని భావిస్తాము.

అదే సమయంలో వర్షాల ఆనందాలు కూడా అపరిమితంగా వుంటాయి. వేసవి తర్వాత సరైన సమయంలో కేరళ లో వచ్చే చిరు జల్లులు ప్రతి ఒక్కారిని ఆనందపరచి తాజా అనుభూతులు ఇస్తాయి.

కేరళ అక్కడ కల హౌస్ బోటు లకు మంచి డిస్కౌంట్ ధరలు కూడా ఇస్తుంది. ఒక నదిపై కల ఆనందాలు అమోఘం. కనుక కేరళ లో కల బ్యాక్ వాటర్స్ పై కల బోటు లలో వేడి వేడి కాఫీ తాగుతూ చిరు జల్లుల ఆనందాలు అనుభవించండి. ఇక్కడ కొన్ని ప్రదేశాలలో ఆయుర్వేద చికిత్సాలు కూడా కలవు. ఇవి మీలోని అనారోగ్యాన్ని తొలగించి మరో మారు తాజా గా ఉండేలా చేస్తాయి.

మరి రుతుపవనాలు ఇండియా లో మొదటగా వచ్చే కేరళ లో కల ఏ ప్రదేశాలకు పర్యటిస్తే బాగుంటుంది అనేది పరిశీలిస్తే....

అష్టముడి

అష్టముడి

అష్టముడి తిరువనంతపురం నుండి 76 కి. మీ. ల దూరం. ఇక్కడ ఆక్టోపస్ ఆకారంలో ఒక సరస్సు కలదు. వర్ష సెలవులకు చక్కని ప్రదేశం. బ్యాక్ వాటర్స్ లో పడే వర్షాలు అబ్బుర పరుస్తాయి. మరి ఈ సమయంలో హౌస్ బోటు రైడ్ చేస్తూ ప్రియమైన వారితో ఆనందిస్తే అంతకు మించినది ఏముంటుంది.

Photo Courtesy: Kerala Tourism

మట్టుపెట్టి

మట్టుపెట్టి

మట్టుపెట్టి ఒక కొండ నగరం. ఇది ఇడుక్కి ప్రాంతం లో కలదు. వర్శభారిత శృంగారానికి చక్కటి విహారం. ఇక్కడ వర్షాల తో పాటు ఉరుములు, మెరుపులు కూడా వుంటాయి. కనుక ప్రియమైన వారితో తప్పక ఇంటి లోపలి ఆనందాలు కూడా పొందవచ్చు. సరస్సు ఒడ్డున షికార్లు కొట్టి ఆనందించవచ్చు.
Photo Courtesy: Raj

కోవలం

కోవలం


కోవలం కేరళ లోని ప్రసిద్ధ బీచ్ లలో ఒకటి. ఇది కూడా వర్ష రుతువు పర్యాటక ప్రదేశమే. బీచ్ లో సుదీర్ఘ నడకలు, తాజా సముద్రపు ఆహారాలు, వంటివి అద్భుతంగా వుంటాయి. ఫిషింగ్ బోటు లనుండి తాజా చేపలు దొరుకుతాయి. ఈ చేపలు తీసుకు వెళితే అక్కడి చిన్న హోటల్లు మీకు కావలసిన రీతిలో డిష్ లు తయారు చేస్తాయి. ఇక్కడ మీరు ఆయుర్వేద ఆయిల్ మసాజ్ లు చేయిన్చుకోనవచ్చు. ఇవి మీకు చక్కని అనుభూతి కలిగించి విశ్రాంతినిస్తాయి.
Photo Courtesy: Roberto Faccenda

అలప్పుజ

అలప్పుజ

అలప్పుజ ను కేరళలో ని బ్యాక్ వాటర్ టూరిజం రాజధానిగా చెపుతారు. ఈ పట్టణాన్ని 'తూర్పు దేశ వెనిస్ నగరం' అని కూడా పిలుస్తారు. హౌస్ బోటు లలో తిరుగుతూ టవున్ అందాలు ఆనందించండి. మీ అదృష్టం బాగుంటే, ఒక ఫిషర్ మాన్ బోటు దొరకవచ్చు. టూరిస్ట్ లు ఇక్కడ తాజా చేపలు కొని అక్కడే వండుకోనవచ్చు. హౌస్ బోటు లో వేడి వేడి భోజనం చేస్తూ పడుతున్న వర్షపు జల్లులు ఆనందించవచ్చు.
Photo Courtesy: Thejas

హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X