Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో 1000 సంవత్సరాల పురాతన దేవాలయాలు ఇవే !!

భారతదేశంలో 1000 సంవత్సరాల పురాతన దేవాలయాలు ఇవే !!

భారతదేశంలో వెయ్యేళ్ళకు పైబడిన ఆలయాలు గురించి సంక్షిప్తంగా

By Super Admin

హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయం కీసర గుట్ట చరిత్రహైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయం కీసర గుట్ట చరిత్ర

హిందూ మతం ('సనాతన ధర్మం' గా కూడా వ్యవహరిస్తారు) ప్రపంచములో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం తర్వాత మూడవ అతి పెద్ద మతం ఇది. క్రీస్తు పూర్వం నుండి భారతదేశంలో హిందూ మతం కలదు. చరిత్రలోకి వెళితే వేదాలు, ఉపనిషత్తులు వంటి అమూల్యమైన సంపదల నుండి హిందూ మతం మనుగడలోకి వచ్చిందని సారాంశం. భారతదేశంలో ఎంతో మంది రాజులు హిందూ మతాన్ని స్వీకరించారు.

భారతదేశ ప్రసిద్ద ఆలయాల యాత్ర : చార్‌ ధామ్‌ !భారతదేశ ప్రసిద్ద ఆలయాల యాత్ర : చార్‌ ధామ్‌ !

మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు ఉచ్చ స్థాయి లో ఉన్నదంటే దానికి కారణం దేవాలయాలు. ఈ దేవాలయాలు నాటి పురాతన సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనాలు. చారిత్రకంగా కూడా దేవాలయాలు ప్రాముఖ్యతను కలిగిఉన్నాయి. క్రీ.శ. 1 వ శతాబ్దం నుండి నిర్మించిన కట్టడాలు అనేకం మన భారతదేశంలో కనిపిస్తాయి. వీటివలన హిందూ యుగపు చరిత్రపై అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి.

దక్షిణ భారతదేశంలో సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు !

భారతదేశంలో వెయ్యి సంవత్సరాల పైబడి ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇవి ఇంతకూడా కదలకుండా, మెదలకుండా, వన్నె తగ్గకుండా ప్రకృతివైపరీత్యాలకు తట్టుకొని ఇంకా యాత్రికులను ఆకర్షిస్తున్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు. వీటిని చూస్తే అప్పట్లోనే అంతటి అద్భుత కట్టడాలు ఎలా కట్టరబ్బా ?? అని అనిపిస్తుంది. ఇప్పుడున్నాయి ఎందుకు ?? ... అలా కడుతుంటే ... ఇలా కూలిపోతుంటాయి.

ప్రస్తుత వ్యాసం భారతదేశంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పైబడి ఆలయాల గురించి. ఇక్కడ పేర్కొన్నవి వాటిలో కొన్ని మాత్రమే. మరి వాటిని చూసొద్దాం పదండి (మీకు మరిన్ని 1000 సంవత్సరాల ఆలయాల గురించి తెలిసిఉన్నట్లయితే మాకు తెలుపగలరు) !!

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

అంబర్నాధ్

అంబర్నాధ్

మహారాష్ట్రలోని అంబర్నాధ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. దీనిని క్రీ.శ.1060 లో శిలహర రాజు చిత్తరాజ నిర్మించాడు. ఆతర్వాత దీనిని అయన కొడుకు ముమ్ముని పునర్నిర్మించారు. అయితే పురాణాల ప్రకారం పాండవులు ఒక్కరాతిశిలతో దీనిని నిర్మించినట్లు చెబుతారు.

చిత్రకృప : Rachna 13

బృహదీశ్వర

బృహదీశ్వర

తమిళనాడులో శివునికి అంకితం చేయబడిన ఆలయాల్లో తంజావూర్ ఆలయం ప్రధానమైనది. ఈ ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయం రాజేశ్వరం అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని మొదటి రాజరాజచోళుడు క్రీ.శ. 1010 లో పూర్తిచేసాడు.

చిత్రకృప : Adityashashtri

కైలాస గుహ

కైలాస గుహ

భారతదేశంలో ఉన్న రాతి కట్టడాల నిర్మాణంలో కైలాస ఆలయం అతిపెద్దది. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా లో కలదు. ఇందులోని ఒక రాయి పల్లవుల కాలాన్ని తెలుపుతుంది. అంటే బహుశా దీని నిర్మాణం క్రీ.శ. 8 వ శతాబ్దంలో చేపట్టి ఉండవచ్చని అంచనా.

చిత్రకృప : Ms Sarah Welch

షోర్ టెంపుల్

షోర్ టెంపుల్

షోర్ టెంపుల్ తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం) లో బంగాళాఖాతం తీరాన ఉన్నది. దీనిని క్రీ.శ. 700 లో పల్లవుల రాజు రెండవ నరసింహవర్మన్ కాలంలో నిర్మించారు. దక్షిణ భారతదేశంలో పురాతన కట్టడాలలో ఇది ఒకటి.

చిత్రకృప : Namrta Rai

సోమనాథ

సోమనాథ

ఈ ఆలయం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మహమ్మద్ గజినీ దండయాత్రలు. ఈయన ఇక్కడ సంపదను కొల్లగొట్టి, దేవాలయాన్ని నాశనం చేసాడు. జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో కలదు. దీనిని సేయున వంశీయులు శివుని మీద ఉన్న భక్తితో క్రీ.శ. 7 వ శతాబ్దంలో నిర్మించారు.

చిత్రకృప : Anhilwara

బేలూరు

బేలూరు

కర్ణాటక రాష్ట్రంలో, బేలూరు వద్ద యాగాచి నది తీరాన విష్ణువుకు అంకితం చేయబడిన చెన్నకేశవ ఆలయం కలదు. ఈ గుడిని హొయసల రాజవంశీయులు క్రీ.శ. 10 - 11 మధ్య నిర్మించినారు.

చిత్రకృప : Gayatri Krishnamoorthy Follow

కేదార్నాథ్

కేదార్నాథ్

జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో కలదు. పర్ఫెక్ట్ డేట్, టైం తెలీదు కానీ ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత దేవాలయాన్ని క్రీ.శ. 8 వ శతాబ్దంలో కట్టారని చెబుతారు. కేదార్నాథ్ చేరుకోవటానికి 14 కి. మీ. ట్రెక్కింగ్ చేయాలి.

చిత్రకృప : Shaq774

ఆది కుంభేశ్వరర్ ఆలయం

ఆది కుంభేశ్వరర్ ఆలయం

చోళుల కట్టడం ఆది కుంభేశ్వరర్ ఆలయం తమిళనాడులోని కుంభకోణం లో కలదు. ఈ దేవాలయంలో శివుడు కొలువై ఉంటాడు. దీని నిర్మాణం క్రీ.శ. 9 వ శతాబ్దంలో జరిగింది. ప్రస్తుతం ఇది 30,181 చ. అ. విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది.

చిత్రకృప : Arian Zwegers

పుష్కర్

పుష్కర్

భారతదేశంలో బ్రహ్మ దేవునికి ఉన్న అతి కొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లో ఈ దేవాలయం కలదు. ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు.

చిత్రకృప : V.Vasant

కాంచీపురం

కాంచీపురం

వరదరాజ పెరుమాళ్ దేవాలయం భగవంతుడు విష్ణువుకు అంకితం చేయబడింది. క్రీ.శ. 11 వ శతాబ్దంలో ఈ గుడిని చోళులు కాంచీపురం లో కట్టించారు.

చిత్రకృప : Ssriram mt

బాదామి

బాదామి

కర్ణాటకలోని బాదామి బాగల్ కోట జిల్లాలో కలదు. ఇక్కడ అద్భుతమైన రాతిగుహాలయాలను చూడవచ్చు. ఇవి చాలా వరకు బౌద్ధ, జైన మతాలకు చెందినవి. చాళుక్యులు వీటిని 6 వ శతాబ్దంలో నిర్మించారు. వీరిలో రెండవ పులకేశి అగ్రగణ్యుడు.

చిత్రకృప : mertxe iturrioz

బద్రీనాథ్

బద్రీనాథ్

ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం లార్డ్ విష్ణువుకు అంకితం చేయబడినది మరియు చార్ ధామ్ యాత్రలో ఒకటి. చారిత్రక ఆధారాల ప్రకారం ఇదివరకు ఈ ప్రదేశం బుద్ధ సైట్ లలో ఒకటి కానీ క్రీ.శ. 8 వ శతాబ్దంలో శంకరాచార్య సందర్శించిన తర్వాత ఇది హిందూ క్షేత్రం గా మారిపోయింది.

చిత్రకృప : Atarax42

భువనేశ్వర్

భువనేశ్వర్

లింగరాజ ఆలయం ఓడిశాలోని భువనేశ్వర్ లో అతిపెద్దది మరియు పురాతమైనది. కళింగ రాజులు దేవాలయాన్ని క్రీ.శ. 6 వ శతాబ్దంలో నిర్మించారు. ఇందులో శివుడు కొలువై ఉంటాడు.

చిత్రకృప : Nitun007

హంపి

హంపి

విరూపాక్ష ఆలయం హంపిలోని తుంగభద్రా నదిఒడ్డున కలదు. దీనిని క్రీ.శ. 7 వ శతాబ్దంలో నిర్మించారు. ఇందులోని ప్రధాన దైవం శివుడు. ఆయనను విరూపాక్ష రూపంలో భక్తులు కొలుస్తారు.

చిత్రకృప : SOMA PAUL DAS

ద్వారకాధీశ్ టెంపుల్

ద్వారకాధీశ్ టెంపుల్

ద్వారకాధీశ్ ఆలయం గుజరాత్ లో అరేబియా సముద్రం ఒడ్డున ద్వారకలో కలదు. ఈ దేవాలయానికి 2500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇది చార్ ధామ్ యాత్రల్లో ఒకటి.

చిత్రకృప : Scalebelow

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచములోనే అతిపెద్ద దేవాలయం. దీని విస్తీర్ణం 156 ఎకరాలు. మహావిష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్య క్షేత్రాలలో కూడా ఒకటి. దీనిని క్రీ.శ. 6 - 9 శతాబ్దాల మధ్య నిర్మించినట్లు చెబుతారు.

చిత్రకృప : Jean-Pierre Dalbéra

మదురై

మదురై

మీనాక్షి అమ్మన్ ఆలయం - ఇదే మదురై మీనాక్షి దేవాలయం గా ప్రసిద్ధి చెందినది. గుడిని క్రీ.శ. 6 వ శతాబ్దంలో నిర్మించారు మరియు ఇందులో ప్రధాన దేవత పార్వతీ దేవి.

చిత్రకృప : Emmanuel DYAN

కైమూర్

కైమూర్

బీహార్ లోని ముండేశ్వరి మాతా ఆలయం కైమూర్ లో కలదు. ఇందులో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. ఆర్కియలాజికల్ సర్వే ఆధారాల ప్రకారం ఇది క్రీ.శ. 108 లో నిర్మించినట్లు తెలుస్తుంది.

చిత్రకృప : Lakshya2509

ఐహోళే

ఐహోళే

దుర్గా ఆలయం నార్త్ కర్నాటక లోని ఐహోళే కు చెందినది. ఈ దేవాలయం విష్ణువుకు అలాగే శివుడికి అంకితం చేయబడింది. చాళుక్యులు గుడిని క్రీ.శ. 7-8 శతాబ్దాల మధ్య నిర్మించారు. 'దుర్గా' అంటే 'రక్షించే తల్లి' అని అర్థం.

చిత్రకృప : Arian Zwegers

లాడ్ ఖాన్

లాడ్ ఖాన్

దుర్గా ఆలయానికి దక్షిణంగా ఐహోళే లో క్రీ.శ. 5 వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన శివాలయం ఇది. లాడ్ ఖాన్ ఆలయం అని పేరురావటానికి కారణం లాడ్ ఖాన్ అనే పేరుగల వ్యక్తి ఇక్కడ నివశించడమే. ఇది ఐహోళే లోని పురాతన దేవాలయం.

చిత్రకృప : Meesanjay

తిరుమల

తిరుమల

తిరుమల తిరుపతి లో మొదటి దేవాలయాన్ని నిర్మించింది తొండైమాన్ అనే తమిళరాజు. ఈయన 'తొండైమండలం' అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు విష్ణువు కలలో కనపడి దేవాలయం నిర్మించమని అడిగాడట. వెనువెంటనే రాజు దేవాలయం నిర్మించాడట. ఒరిజినల్ గోపురాన్ని మరియు ప్రాకారాన్ని క్రీ.శ. 8 వ శతాబ్దంలో నిర్మించారు.

చిత్రకృప : ShashiBellamkonda

శ్రీశైలం

శ్రీశైలం

శ్రీశైలం చరిత్ర పురాతనమైనది. దీని గురించి మొదటిసారి ప్రస్తావనలోకి వచ్చింది క్రీ.శ. 2 వ శతాబ్దంలో పులోమావి నాసిక్ లో వేయించిన శాశనంలో . అంటే ఈ క్షేత్రం క్రీ.శ. 2 వ శతాబ్దం పూర్వమే వెలిసిందని చెప్పవచ్చు. ఈ కొండ ను మల్లన్న కొండ అని పేరుపెట్టింది మల్లన్న శాతకర్ణి. ఇక్ష్వాకులు, విష్ణుకుండులు ఇలా ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించినారు.

చిత్రకృప : Vedamurthy.j

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X