Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మెట్లమార్గం ఎక్కడుందో మీకు తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మెట్లమార్గం ఎక్కడుందో మీకు తెలుసా?

మీలో ధైర్యసాహసాలు ఎక్కువగా ఉన్నాయా? ఏదైనా కొండప్రాంతాన్ని దర్శించాలన్నా వాటి మీద ఎక్కాలన్నా, సాహసాలు చేయాలన్న కోరికఉందా? అయితే ఇక్కడున్నా వంతెనను సందర్శిస్తే చాలు.మీ ధైర్యం ఏపాటిదో తెలిసిపోతుంది.

By Venkatakarunasri

మీలో ధైర్యసాహసాలు ఎక్కువగా ఉన్నాయా?

ఏదైనా కొండప్రాంతాన్ని దర్శించాలన్నా వాటి మీద ఎక్కాలన్నా, సాహసాలు చేయాలన్న కోరికఉందా?

అయితే ఇక్కడున్నా వంతెనను సందర్శిస్తే చాలు.మీ ధైర్యం ఏపాటిదో తెలిసిపోతుంది.

కొండఅంచుల్లో నిర్మించిన ఈ చెక్కవంతెన ఎక్కటానికి నిజంగా దమ్ముండాలంట.

నిజంగా మీ దగ్గర దమ్ముంటే ఈ ప్రాంతాన్ని తప్పకుండా దర్శించండి.

ఈ మెట్ల మార్గం నుండి వెళ్ళాలంటే ధైర్యం వుండాలి.. అది

మీకు ఉంటే ట్రై చేయండి...

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

ఇదెక్కడో కాదు ఇండియాలోనే వుంది.

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో భారత్-చైనా సరిహద్దుల్లో వున్న జామ్ గంగా వ్యాలీలో వుంది.

 దాదాపు 5దశాబ్దాలు

దాదాపు 5దశాబ్దాలు

దాదాపు 5దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తీసుకొస్తుంది.

గత్లాంగి

గత్లాంగి

గత్లాంగి అనే ప్రాంతంలో గల ఎత్తైన పర్వతం మీదకు దాదాపు 300మీల వరకు ఈ మెట్టుమార్గం వుంటుంది.

మెట్లమార్గం

మెట్లమార్గం

పెషావర్ కు చెందిన పటాన్ లు 17వ శతాబ్దంలో ఈ మెట్లమార్గం నిర్మించారు.

ఇండియా-చైనా యుద్ధం

ఇండియా-చైనా యుద్ధం

ఇండియా-చైనా యుద్ధానికి ముందు పూలు,లెదర్, ఉప్పు తదితరాలను ఉత్తరకాశీకి తరలించేందుకు వ్యాపారవేత్తలు ఈ మార్గం అవలంభించేవారు.

సైన్యం

సైన్యం

సైన్యం కూడా కొన్నాళ్ళు ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంది.

1975

1975

1975నుంచి ఆ మార్గాన్ని మూసేసారు.దీంతో మెట్లమార్గం కాలక్రమేణా ధ్వంసం అయ్యింది.

 26లక్షలు

26లక్షలు

దీనిని పునరుద్దరించేందుకు తాజాగా ప్రభుత్వం 26లక్షలు కేటాయించింది.

పూర్వరూపం

పూర్వరూపం

ఇటీవల జిల్లా పర్యాటక శాఖాఅధికారి ఈ ప్రాంతాన్ని సందర్శించి మళ్ళీ మెట్లమార్గానికి పూర్వరూపం తీసుకురావాలని నిర్ణయించారు.

పర్యాటకులు

పర్యాటకులు

పర్యాటకుల కోసం ఈ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పనులు మొదలుపెట్టారు.

మెట్ల మార్గం

మెట్ల మార్గం

అయితే ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు ఈ మార్గాన్ని అలాగే ఉంచితే మంచిదని అది చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా వుందని తెలుస్తుంది.

అత్యంత ప్రమాదకర మెట్లమార్గం

అత్యంత ప్రమాదకర మెట్లమార్గం

ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మెట్లమార్గంలో ఇది చేరుతుంది.

భద్రతాసదుపాయాలు

భద్రతాసదుపాయాలు

మరామత్తులు పూర్తయ్యేవరకు ఇక్కడికి ఎవరికీ ప్రవేశం లేదు.మెట్ల సామర్ధ్యం పరిశీలించి భద్రతాసదుపాయాలూ కల్పించిన తరువాతే పర్యాటకులకు అనుమతిస్తామని అధికారులు తెల్పుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X