Search
  • Follow NativePlanet
Share
» »ఇంకా మిస్టరీ వీడని ఈ ఐదు దేవాలయాలు !

ఇంకా మిస్టరీ వీడని ఈ ఐదు దేవాలయాలు !

మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది. కానీ కొన్ని ఆలయాలలో జరిగే సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

By Venkatakarunasri

మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది. కానీ కొన్ని ఆలయాలలో జరిగే సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ సంఘటనలు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలు మిస్టరీలుగానే వుండిపోయాయి.

కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !

భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు ! భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. రాజరాజేశ్వరీ బాలాత్రిపుర సుందరి ఆలయం

1. రాజరాజేశ్వరీ బాలాత్రిపుర సుందరి ఆలయం

ఈ ఆలయం బీహార్ రాజధాని పాట్నాలో వుంది. ఈ ఆలయాన్ని 400 సంవత్సరాల పూర్వం నిర్మించినట్లు అక్కడి శాసనాలను బట్టి తెలుస్తుంది అయితే ఈ ఆలయంలో రాత్రి పూట ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపిస్తుందట. అప్పట్లో ఈ ఆలయాన్ని మంత్రవిద్యలు నేర్చుకునే వారు నిర్మించినట్లు అక్కడి స్థలపురాణం చెబుతుంది.

ఇది కూడా చదవండి:బుద్ధగయ ... బౌద్ధ మతం పరిఢవిల్లిన పుణ్య క్షేత్రం !!

pc:youtube

2. శక్తిస్వరూపాలు

2. శక్తిస్వరూపాలు

అప్పటి వారి మంత్రసిద్ధుల ప్రభావం చేత కొన్ని శక్తిస్వరూపాలు ఈ ఆలయంలో ఏర్పడి అవి రాత్రిపూట అదృశ్యరూపంలో అక్కడ తిరగటం వల్ల ఇలాంటి శబ్దాలు వినిపిస్తాయని కొంతమంది చెపుతుంటే ఆ ఆలయ పూజారులు మాత్రం ఈ మాటలు అమ్మవారి విగ్రహం నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయంపై ఎంతోమంది పరిశోధనలు చేసినా అది ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇది కూడా చదవండి:ms ధోని జీవితంతో ముడిపడివున్న ప్రదేశాలు !

pc:youtube

3.జగన్నాథ ఆలయం

3.జగన్నాథ ఆలయం

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జగన్నాథ ఆలయం ఒకటి వుంది. ఈ ఆలయం కొన్ని శతాబ్దాలుగా ఒక వింతను మోస్తుంది. అది ఏమిటంటే ఈ ఆలయం ప్రతి సంవత్సరం వర్షాలు ఎప్పుడు పడతాయి,ఎలా పడతాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెపుతుందట.

ఇది కూడా చదవండి:రాత్రిపూట ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతుంది !

pc:youtube

4. మాన్ సూన్ టెంపుల్

4. మాన్ సూన్ టెంపుల్

అందుకే ఈ ఆలయాన్ని మాన్ సూన్ టెంపుల్ గా పిలుస్తారు. అసలు ఒక ఆలయం వర్షాల గురించి ఎలా చెప్పగలదు అని మీరనుకుంటే ఒకసారి అక్కడివారు చెపుతున్న కథన్నాని వినాలి మరి. అక్కడివారి కథనం ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలానికి 7 రోజుల ముందు ఆ గుడిలో నీటిబిందువులు పడతాయట.

ఇది కూడా చదవండి:శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా ?

pc:youtube

5.వర్షాలు

5.వర్షాలు

అలా ఆ నీటి బిందువులు పడటం మొదలైన సరిగ్గా ఏడు రోజులకి ఆ ప్రాంతంలో వర్షాలు పడతాయట. అంతేకాదు ఆ గుడిలో పడే నీటిబిందువుల శాతం బట్టి ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడతాయా? తక్కువగా పడతాయా? అనే విషయం కూడా తెలుస్తుందట.

ఇది కూడా చదవండి:బారాబంకి - పారిజాత చెట్టుకు పుట్టినిల్లు !!

pc:youtube

6. శాస్త్రవేత్తలు

6. శాస్త్రవేత్తలు

ఈ గుడిపై పరిశోధనలు చేసిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు 7 రోజులు నిజంగానే ఆ గుడిలో పడుతున్నాయని చెప్పగా దాని వెనుక వున్న రహస్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

pc:youtube

7.ఛాయా సోమేశ్వరాలయం

7.ఛాయా సోమేశ్వరాలయం

ఈ ఆలయం తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పానగల్లులో వుంది. ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించినట్లు అక్కడి శిలాఫలకాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ అక్కడ శివలింగంపై పడే నీడ. ఈ ఆలయంలోని శివలింగంపై సూర్యుడు యొక్క గమనంతో సంబంధం లేకుండా సరిగ్గా మధ్యలోకి ఒక నీడ పడుతుంది.

ఇది కూడా చదవండి:తెలంగాణలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

pc:youtube

8. మనోహర్ అనే ఫిజిక్స్ లెక్చరర్

8. మనోహర్ అనే ఫిజిక్స్ లెక్చరర్

ఆ నీడ అలా పడటానికి గల కారణం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అయితే మనోహర్ అనే ఫిజిక్స్ లెక్చరర్ ఎన్నో సంవత్సరాలు ఈ నీడపై పరిశోధనలు చేసి ఒక థియరీ చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం సూర్యుడి కిరణాలు గర్భగుడికి ముందు వున్న నాలుగు స్తంభాలపై పరివర్తనం చేసి అక్కడి నుంచి ఒక నీడ ఒకే చోట నిలబెట్టేలా ఆలయ నిర్మాణం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి:టాలీవూడ్ కమెడియన్లు - పుట్టిన ప్రదేశాలు !!

pc:youtube

9. శిల్పకళాకారుల యొక్క నైపుణ్యం

9. శిల్పకళాకారుల యొక్క నైపుణ్యం

ఆయన చెప్పిన ఈ థియరీపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన అప్పటి శిల్పకళాకారుల యొక్క నైపుణ్యం ఎంత గొప్పదో అర్థం జేసుకోవచ్చు.

pc:youtube

10. జ్వాలాదేవీ ఆలయం

10. జ్వాలాదేవీ ఆలయం

ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రా జిల్లాలో జ్వాలాముఖీ అనే ఆలయంలో వుంది. ఈ ఆలయం మన దేశంలో వున్న శక్తిపీఠాలలో ఒకటిగా వుంది. ఈ గుడిలోని అమ్మవారు జ్వాలారూపంలో వుంటారు. ఈవిడకు ప్రత్యేక రూపం లేదు.

pc:youtube

11. జ్వాలాముఖి

11. జ్వాలాముఖి

భూమిలో నుంచి వచ్చే చిన్నమంటనే జ్వాలాముఖిగా కొలుస్తున్నారు. ఈ జ్వాల కొన్ని వేల సంవత్సరముల నుండి విరామం లేకుండా అఖండ జ్యోతిగా వెలుగుతుంది. అయితే కొంతమంది వాదన ప్రకారం అక్కడ భూమిలో లావా వుండివుంటుందని అందువల్లే అక్కడ అగ్ని వస్తుందని చెప్పినా దానికి తగిన శాస్త్రీయ నిర్వచనం ఇవ్వలేకపోయినారు. అందువల్ల ఈ జ్వాలాముఖీ ఆలయంలోని జ్వాల ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

pc:youtube

12. ఒరిస్సా పూరీ జగన్నాథ్ ఆలయం

12. ఒరిస్సా పూరీ జగన్నాథ్ ఆలయం

ఒరిస్సా పూరీ జగన్నాథ్ ఆలయానికి ఘన చరిత్ర వుంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం రెండవరోజున జరిగే రథయాత్ర యొక్క గొప్పతనం యావత్ ప్రపంచానికీ తెలుసు. అయితే పూరీ జగన్నాథుడి ఆలయనిర్మానణశైలి అందరికీ ఆశ్చర్యంతో పాటు ఒక మిస్టరీని కూడా ఇస్తుంది.

pc:youtube

13. శిఖరం యొక్క నీడ

13. శిఖరం యొక్క నీడ

అదేంటంటే పూరీ ఆలయంపై నున్న సుదర్శన చక్రాన్ని ఎటు వైపు నుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లనిపిస్తుందంట. అంతేకాదు సూర్యుడు ఏ దిశలో తిరిగినా ఆ ఆలయ శిఖరం యొక్క నీడ కొద్దిగా కూడా భూమి మీద పడదట.

pc:youtube

14. గొప్ప రహస్యాలు

14. గొప్ప రహస్యాలు

ఈ రెండూ పూరీ ఆలయంలో వున్న గొప్ప రహస్యాలుగా వుంటే ఈ ఆలయంలో వుండే మరో వింత వంటశాల. ఈ వంటశాలలో వండే భోజనం ఎంత మంది భక్తులు వచ్చినా అంతమందికీ సరిగ్గా సరిపోతుందట. అక్కడ భోజనం కూడా వృధా అవదని అక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

pc:youtube

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలుశ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X