Search
  • Follow NativePlanet
Share
» »రొమాంటిక్ ప్రదేశాలు- అద్భుత ఆనందాలు !!

రొమాంటిక్ ప్రదేశాలు- అద్భుత ఆనందాలు !!

వర్షాకాలం రానే వచ్చేసింది. ప్రేమ పక్షులకు, కొత్తగా పెళ్ళయిన జంటలకు కొత్త కొత్త ప్రదేశాలు కావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రేమ పక్షులు, కొత్తగా పెళ్ళైన జంటలు స్వేచ్ఛగా విహరించేందుకు కొన్ని అనువైన ప్రదేశాలను అందిస్తున్నది తెలుగు నేటివ్ ప్లానెట్. కొత్త రుచులతో, కొత్త కొత్త వెరైటీలతో మీ జీవితంలో ఆనందాన్ని పొందండి. అలాగే మీ లవర్ తో కూడా మరుపురని అనుభూతిని పంచుకోండి. ప్రస్తుతం మేము కొన్ని ప్రదేశాలను మీకు ఇక్కడ అందిస్తున్నాము. అవి ఏమిటంటే....

షిల్లాంగ్

షిల్లాంగ్

షిల్లాంగ్ పట్టణం ఒక మంచి రొమాంటిక్ ప్రదేశం. ఈ పట్టణం విశ్వకవి రవీంద్ర నాథ్ టాగోర్ కు సైతం, ఉల్లాసం, ఆనందం కలిగించి ఆయనచే 'శేషార్ కవితా' అనే కావ్యం వ్రాయించినది. ఇక్కడ కల పైన్ వృక్షాలు, గాలితో డాన్స్ చేస్తూ వుంటాయి. అప్పుడపుడూ ఆహ్లాదకర వర్షపు జల్లులను మీకు, మీ ప్రేయసికి చిలకరిస్తాయి. ఈ ప్రదేశం వేడి వేడి సమోసాలు, లేదా మామో లు వంటివి, కాఫీ , టీ లు కూడా లభిస్తాయి. బయట తిరుగేందుకు ఈ చిన్న టవున్ మీ స్వంత పట్టణం వలే వుంటుంది.

డిబ్రు సైకోవా నేషనల్ పార్క్, అస్సాం

డిబ్రు సైకోవా నేషనల్ పార్క్, అస్సాం

ఈ నేషనల్ పార్క్, నగర గందర గోళ జీవితానికి దూరంగా వుంది. మీ లోని ఉత్సాహాన్ని మరో సారి జాగృతం చేస్తుంది. బ్రహ్మపుత్రా నది ఒడ్డు శబ్దాల కంటే అద్భుతమైనది మిమ్మల్ని నిద్ర లేపెటందుకు ఏమి వుంటుంది. ఇక్కడ నదిలో కల డాల్ఫిన్స్ తో ఆటలు ఆడుతూ బోటు రైడ్ చేయండి లేదా ఇసుక ఒడ్డున కూర్చుని వాటిని చూసి ఆనందించండి. సమయం మీకు తెలియకుండానే గడిచి పోతుంది.

Pic credit: Rupkamal Sarma

ముస్సూరీ , ఉత్తరాఖండ్

ముస్సూరీ , ఉత్తరాఖండ్

పర్వత రాణి గా చెప్పబడే ముస్సూరీ ఒడిలో నిద్ర లేచి, ఎదురుగా కనపడే అద్భుత శివాలిక్ పర్వత శ్రేణులను మరియు దూన్ వాలీ లను చూసి ఆశ్చర్య చకితులు కండి. ఇక్కడే కల కొన్ని పురాతన టెంపుల్స్, అందమైన హిల్స్, వాటర్ ఫాల్స్ , వైల్డ్ లైఫ్ సాన్క్చురి లతో ప్రేమ లో పడి ఆనందించండి.
Pic credit: nandadevieast

మండు,మధ్య ప్రదేశ్

మండు,మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ లోని మండు ప్రదేశం ఆనందాల నిలయం అంటారు. అయితే దీని వెనుక కల చారిత్రక ప్రేమ కధ అయిన రూప మతి మరియు బాజ్ బహదూర్ లది వింటే మాత్రం కొంచెం విచారం కలుగుతుంది. కనుక వినకండి. ఇక్కడ కల హోశాంగ్ షా టూమ్బ్, ఇండియా లోనే మొదటి మార్బుల్ నిర్మాణం. దీనిని చూసే తాజ్ మహల్ మార్బుల్ రాతి తో నిర్మించారు. నర్మదా నది ఒడ్డున కూర్చుని సూర్యాస్తమయం చూడండి. ఇక్కడ కల పురాతన పాలస్ లో సమయం మీకు తెలియకుండా నే గడిచి పోతుంది.
Pic credit: varunshiv

కన్యాకుమారి, తమిళనాడు

కన్యాకుమారి, తమిళనాడు

నిద్రించేందుకు, నిద్ర లేవగానే ఆనందించేందుకు కన్యాకుమారి ప్రదేశం ఒక రెడీ మేడ్ ప్లేస్. కన్యాకుమారిలో సూర్యోదయాలు, సూర్యాస్తమయాల దృశ్యాలు ప్రసిద్ధి. వివిధ రంగుల సూర్య కిరణాలు భూమిని తాకుతూ వుంటే మీ కన్నులు విందు చేసుకుంటాయి. పక్కనే మీ ప్రేయసి వుంటే ఆనందాలు పంచుకోవటానికి అంతకంటే ఏమి కావాలి ?

Pic credit: flickrPrince

కూర్గ్ - కాఫీ వాసనలు

కూర్గ్ - కాఫీ వాసనలు

ఎగుడు దిగుడు పర్వత శ్రేణులు, ఉవ్వెత్తున లేచి ఎగిసే పడే జలపాతాలు కల ఈ హిల్ స్టేషన్ మీలోని సోమరి తనాన్ని పూర్తిగా తొలగించి, ఉత్సాహాలను నింపుతుంది.

హోద్కా విలేజ్, రాన్ అఫ్ కచ్, గుజరాత్

హోద్కా విలేజ్, రాన్ అఫ్ కచ్, గుజరాత్

ఇండియా - పాకిస్తాన్ దేశాలకు సరిహద్దుగా కల ఈ ప్రదేశం ఒక చిన్న గ్రామం, ఇది గుజరాత్ యొక్క చివరి భాగమైన రాన్ అఫ్ కచ్ లో కలదు. ఇది ఒక తెల్లటి ఉప్పు తయారయ్యే ఎడారి ప్రదేశం. ఈ ప్రదేశంలోని భున్గా అనబడే ఒక చిన్న గుడిసెలో అన్ని వసతులతో నిద్రించి అక్కడి ఎడారి ప్రదేశం ఎంత విశాలమైనదో గుర్తించండి. ఒంటరి తనాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఊహకు అందని ప్రకృతి దృశ్యాలతో మమేకమై మీ లోని ధీరత్వం నిద్ర లేపండి.

హావ్ లాక్ ఐలాండ్, అండమాన్స్

హావ్ లాక్ ఐలాండ్, అండమాన్స్

నిశ్శబ్ద ప్రదేశంలో తెల్లవారు ఝామున సముద్రపు అలలు చేసే అద్భుత ధ్వనిలో హావ్ లాక్ ఐలాండ్ ప్రదేశంలో నిద్ర లేవండి. గాలులకు కొబ్బరి చెట్ల ఆకులు చేసే ధ్వనులు అద్భుతంగా వుంటాయి. తెల్లని బీచ్ లు, ఆసియా లోనే ఉత్తమైన డైవింగ్ సౌకర్యాలు కల హావ్ లాక్ ఐలాండ్ ఆనందాలు పొందండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X