Search
  • Follow NativePlanet
Share
» »ముడుమలై , ప్రకృతి యొక్క స్వర్గం !

ముడుమలై , ప్రకృతి యొక్క స్వర్గం !

కర్నాటక, తమిళనాడు, కేరళ మూడు రాష్ట్రాలు కలిసే ప్రదేశంలో కల ముడుమలై నీలగిరి కొండలలోని దట్టమైన అడవుల మధ్య కలదు. ఇక్కడ కల వైల్డ్ లైఫ్ సాన్క్చురి ప్రసిద్ధి చెందినది. దక్షిణ భారత దేశంలోని సాన్క్చురి లలో అతి పుష్కలమైన జంతు సంపద కలిగిన అభయారణ్యంగా కీర్తి గాంచినది. ఇక్కడకు దేశీయ పర్యాటకులు మాత్రమే కాదు, విదేశీ పర్యాటకులు సైతం వచ్చి ఆనందిస్తారు.

1940 లో స్థాపించిన ముడుమలై అభయారణ్యం దేశంలోని విస్తృతమైన వృక్ష, జంతు జాలాలను సంరక్షించే ప్రధాన సాన్క్చురి లలో ఒకటిగా ప్రసిద్ధి కెక్కింది. ముడుమలై సందర్శనలో తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణలు, పైకారా సరస్సు, కల్లట్టి జలపాతాలు, తెప్పకాడు ఎలిఫెంట్ కెంప్, మోయార్ నది వంటి వాటితో పాటు వన్య జంతువుల స్వేచ్చా విహార ఆనందాలను చూసి ఆనందించేందుకు అనేక ఇతర ప్రాంతాలు కూడా కలవు. ప్రకృతి అందాలు, పర్యాటక ఆకర్షణలు, అనేక ట్రెక్కింగ్ మార్గాలు కల ముడుమలై కుటుంబ సమేత విహారాలకు, అడ్వెంచర్ ట్రిప్ లకు,ల వన్ డే విహారాలకు ఎంతో అనువుగా వుంటుంది.

Photo Courtesy: L.vivian.richard

ముడుమలై అభయారణ్యంలో మీరు వివిధ జాతుల జతువులను మరియు వృక్షాలను చూడవచ్చు. దక్షిణ దేశపు ఉష్ణమండల వాతావరణం కలిగిన అనేక ఆటవీ భూములు కలవు. పక్షుల పట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రాంతంలో సుమారు రెండు వందలకు పైగా పక్షి జాతులను చూసే అవకాశం కలదు. ఈ ప్రాంతానికి అనేక వలస పక్షులు కూడా వస్తాయి. ప్రశాంతమైన, పచ్చని వాతావరణంలో ఇక్కడి జంతువులు కలసి మెలసి జీవనం సాగిస్తాయి. అడవి బల్లులు, హయనాలు, నక్కలు, లేడి, చిరుత పులి, నాలుగు కొమ్ముల జింకలు మొదలైనవి చూసి ఆనందించవచ్చు. ముడుమలై లో ఒక టైగర్ రిసర్వ్ కూడా కలదు. ఇండియా లోని ఈ ప్రాంతంలో పులుల సంఖ్య అధికంగా వుంటుంది. సుమారు ఏడు వందలకు పైగా భారత దేశ ఏనుగులు ఈ అభయారణ్యంలో స్వేచ్చగా విహరిస్తాయి. ఇక్కడి ఫారెస్ట్ డిపార్టుమెంటు జంగల్ సఫారీలు నిర్వహిస్తుంది. ఇవి తప్పక ఆనందించ దగినవి.

Photo Courtesy: Rakesh Kumar

మోయర్ నది

ముడుమలై లో మరొక పర్యాటక ఆకర్షణ మోయర్ నది. ఈ నది భవాని నదికి ఉప శాఖ. మోయర్ పట్టణంలో పుట్టి , మాసినగుడి - ఊటీ రోడ్ కు సమానంతరంగా ప్రవహిస్తుంది. ఈ నది ప్రవాహం ముడుమలై సాన్క్చురి ని మరియు కర్నాటక లోని బండి పూర్ లను సహజంగా వేరు చేస్తుంది. ఈ నదిలో నీరు తాగేందుకు అనేక జంతువులు ఇక్కడకు వస్తాయి. మోయర్ లోయ ఇక్కడ సుమారు 20 కి. మీ. లోతు వుంటుంది. మోయర్ నది ప్రవాహం దీనిలో పడుతూ మోయర్ జలపాతాలు సృష్టించినది. నది కి సమీపంలో అనేక పిక్నిక్ స్పాట్ లు కలవు. ఈ ప్రాంతాలలో టూరిస్ట్ లు అధికంగా తిరగటం గమనించవచ్చు. ఎలేఫేంట్ ఫీడింగ్ క్యాంపు సమీపంలో ముడుమలై మ్యూజియం కలదు. మ్యూజియం లో ముడుమలై చరిత్ర కొంత మేరకు తెలుసుకొనవచ్చు. మ్యూజియం ప్రదేశం గురించిన గతంలోని, ప్రస్తుత చరిత్రలను పోల్చి చూపుతుంది.

Mudumalai, Nature's Paradise

తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంపు

Photo Courtesy: Marcus334

తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంపు ముడుమలై లో ఒక గొప్ప టూరిస్ట్ ఆకర్షణ. ఈ ప్రదేశం పర్యాటకులకు జంతువులతో కలిసే లా చేస్తుంది. ఇక్కడి ఏనుగులు శిక్షణ పొంది వాటి చేష్టలతో పర్యాటకులను ఆనందింప చేస్తాయి. ప్రతి రోజూ రెండు ఏనుగులు అక్కడ కల ఒక వినాయక విగ్రహానికి పూజలు చేస్తాయి. ఎలిఫెంట్ సఫారీ లు ఉదయం మరియు సాయంత్రాలలో నిర్వహిస్తారు. సాయంత్రాలు ఎలిఫెంట్ లకు తిండి పెట్టటం ఒకపర్యాటక వినోదంగా వుంటుంది. తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంపు ప్రధానంగా పర్యావరణ టూరిజం, వన్య సంరక్షణ, మానవ - ఏనుగు ల మధ మంచి అవగాహన కలిగించుటకు ఏర్పాటు చేయబడినది.

Mudumalai, Nature's Paradise

Photo Courtesy: L.vivian.richard

ముడుమలై ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం

ముడుమలై కి సమీపంలో అంటే 130 కి. మీ. ల దూరంలో కల కోయంబత్తూర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కలదు. దేశం లోని ప్రధాన నగరాల నుండి కోయంబత్తూర్ విమానాశ్రయానికి సర్వీస్ లు కలవు.

ట్రైన్ ప్రయాణం

ముడుమలై కి సమీప రైలు స్టేషన్ నీలగిరి మౌంటెన్ రైల్వే సర్వీస్ కల ఉదగమండలం. ఇది ముడుమలై కి 40 కి. మీ. ల దూరంలో కలదు. బ్రాడ్ గేజ్ రైలు స్టేషన్ అయిన కోయంబత్తూర్ రైలు స్టేషన్ ముడుమలై కి 82 కి. మీ. ల దూరంలో కలదు.

రోడ్డు ప్రయాణం

ముడుమలై కు కల చక్కనైన రోడ్డు మార్గం దానిని అన్ని పట్టణాలకు తేలికగా అనుసంధానం చేసింది. ఒక సీసన్ అనేది లేకుండా సంవత్సరం పొడవునా ముడుమలై పర్యటన చేయవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X