Search
  • Follow NativePlanet
Share
» »మున్నార్ - ప్రకృతి ప్రియుల స్వర్గం !

మున్నార్ - ప్రకృతి ప్రియుల స్వర్గం !

కేరళ రాష్ట్రంలో మున్నార్ ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఇండియా లోని వివిధ ప్రాంతాలనుండి టూరిస్ట్ లు ఈ ప్రదేశానికి వస్తారు. విదేశీయులు సైతం ఈ పర్యాటక ప్రదేశాన్ని బాగా ఇష్టపడతారు. మరి అందరూ ఇష్టపడే ఈ ప్రాంత ఆకర్షణలు ఏమిటి ? ప్రతి పర్యాటకుడు మరల మరల సందర్శించే మున్నార్ ప్రదేశ ఆకర్షణల రహస్యం ఏమిటి ?

టీ తోటలు

టీ తోటలు

మున్నార్ లో ప్రపంచంలోని అత్యుత్తమ తేయాకు తోటలు, ఎస్టేట్ లు కలవు. ఇండియా లో అత్యధిక తేయాకు వ్యాపారం జరగటం చేత ఈ ప్రదేశాన్ని టాటా కంపెనీ వారు తీసుకున్నారు. టీ అన్నా ప్రకృతి అన్నా ఇష్టపడే వారు ఈ గార్డెన్ లను, ఎస్టేట్ లను తప్పక సందర్శిస్తారు.

Photo Courtesy: Rameshng

టాప్ స్టేషన్

టాప్ స్టేషన్

టాప్ స్టేషన్ అనేది ఒక అందమైన పశ్చిమ కనుమలలోని ప్రదేశం. మున్నార్ యొక్క గ్రీనరి ఇక్కడ బాగా చూడవచ్చు. మరిన్ని అధిక మున్నార్ ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి.

మట్టుపెట్టి లేక్, మరియు డాం

మట్టుపెట్టి లేక్, మరియు డాం

మున్నార్ లో కల మట్టుపెట్టి సరస్సు ఇక్కడ కల మంచి ప్రకృతి దృశ్యాలలో ఒకటి. మున్నార్ లోని పచ్చటి టీ తోటల మధ్యకాల ఈ ప్రదేశం ప్రకృతి ప్రియులకు అమిత ఆనందం కలిగిస్తుంది.

Photo Courtesy: Shanmugamp7

దేవికులం

దేవికులం

మున్నార్ కు సమీపంలో కల ఒక అందమైన హిల్ స్టేషన్ దేవికులం. ఇది మున్నార్ కు 5కి. మీ. ల దూరంలో కలదు. ప్రకృతి ఒడిలో సేద దీరెందుకు ఇది ఒక మంచి ప్రశాంత ప్రదేశం.

ఎరావికులం నేషనల్ పార్క్

ఎరావికులం నేషనల్ పార్క్

వైల్డ్ లైఫ్ మరియు అడ్వెంచర్ లు అంటే ఇష్టపడే వారికి ఎరావికులం నేషనల్ పార్క్ ఒక మంచి ఆకర్షణీయ ప్రదేశం. ఇండియా లో ఒక మంచి జీవ వైవిధ్యం కల ప్రదేశం. నీలగిరి థార్ వంటి అరుదైన జంతువులు ఇక్కడ అనేకం కలవు.

అనయిరంకాల్

అనయిరంకాల్

మున్నార్ కు సుమారు 22 కి. మీ. ల దూరంలో అనయిరంకాల్ కలదు. ఈ ప్రదేశం ఇక్కడ కల డాం, సరస్సు, టీ తోటల కారణంగా ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశంలో టూరిస్ట్ లు వసతి పొందేందుకు అనేక రిసార్ట్ లు, ప్రకృతి దృశ్యాల మధ్య కలవు.


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X