Search
  • Follow NativePlanet
Share
» »సంగీత స్వరాలూ పలికే అద్భుత ఆలయాలు

సంగీత స్వరాలూ పలికే అద్భుత ఆలయాలు

మనదేశంలోని ఆలయాలలో రాళ్ళను కదిలించినా సంగీతస్వరాలు వినిపిస్తాయి. అందుకు సాక్ష్యం హంపిలోని సంగీతస్వరాలు పలికించే స్థంభాలు.

By Venkatakarunasri

భారతదేశంలో ఈ రాతి స్థంభాలు భారతీయ కళలకు, సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి రాతి స్థంభాలను సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వీటిని చూడవచ్చు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఎంతో మంది రాజులకు సంగీతం అంటే మహా ఇష్టం. వీరికెప్పుడు కాలక్షేపం దొరికినా సంగీతాన్ని వినేవారు, ఆస్వాదించేవారు. సంగీతం ను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంలో అప్పటి రాజులు కంకణం కట్టుకొని యాత్రికులు ఎక్కువగా దర్శించే ఆలయాలలో మ్యూజికల్ పిల్లర్స్ ను ఏర్పాటుచేశారు. ఎప్పుడైనా రాజులు దేవాలయానికి వెళితే గుడి మధ్యలో కూర్చొని ఈ స్థంభాల దగ్గర విద్వాంసులు చేసే కచేరీ లను, అందుకు తగ్గట్టు నాట్యం చేసే నర్తకీమణుల నృత్యాలను చూస్తూ ఉండేవారట.

సంగీతం గురించి భారతదేశానికి తెలిసినంతగా మరే దేశానికి తెలిసిఉండదు. సంగీతం ఆది ప్రణవనాదం నుండి ఉద్భవించింది అని అందరికీ విదితమే. సినిమా సంగీతానికి, భారతీయ సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది వినటంలోనూ, ప్రదర్శించడంలోనూ..! సంగీతం అంటే శబ్దాన్ని కాలంతోపాటు మేళవించి వినసొంపుగా వినిపించే అద్భుత ప్రక్రియ. సంగీతవాయిద్యాలతో చేసే సంగీత సాధనే కష్టంరా దేవుడా అనుకుంటే ... రాతిని తాకితే సరిగమపదనిస స్వరాలు వచ్చే స్థంభాలు భారతదేశంలో నిజంగా అద్భుతమనే చెప్పాలి.

మనదేశంలోని ఆలయాలలో రాళ్ళను కదిలించినా సంగీతస్వరాలు వినిపిస్తాయి.అందుకు సాక్ష్యం హంపిలోని సంగీతస్వరాలు పలికించే స్థంభాలు.కేవలం హంపిలోనే కాకుండా దేశంలోని అనేక ఆలయాలలో కూడా సప్తస్వరాలు పలికించే సంగీత స్థంభాలు అనేవి వున్నాయి. అంతేకాకుండా ఇనుమును కూడా బంగారంలా మార్చే అద్భుత శివలింగం వున్న ఆలయం గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం

ఇక వరంగల్ జిల్లా రామప్ప దేవాలయంలో ఆలయ మండపంలో కుడివైపు సప్తస్వరాలు పలికించే సంగీత స్థంభం అనేది వుంది.

PC:youtube

మధుర మీనాక్షిఆలయం

మధుర మీనాక్షిఆలయం

తమిళనాడులోని మధుర మీనాక్షిఆలయంలో అమ్మవారి దేవాలయ మండపంలో కూడా సప్తస్వరాలు పలికించే స్థంభం అనేది వుంది.

PC:youtube

స్థాయేశ్వర దేవాలయం

స్థాయేశ్వర దేవాలయం

తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర సుచింద్రంలోని స్థాయేశ్వర దేవాలయంలోనూ, తమిళనాడులోని కాంతిమతి అంబాల్ దేవాలయ మండపం దగ్గర కూడా సప్తస్వరం పలికే స్థంభం అనేది వుంది.

PC:youtube

తిరునగర్

తిరునగర్

తమిళనాడులోని ఆళ్వార్ తిరునగర్ లో ఆధినాథ స్వామి ఆలయంలో కూడా నాదస్వరం పలికే సంగీత స్థంభం వుండటం విశేషం.

PC:youtube

తంజావూరు

తంజావూరు

తంజావూరులోని బృహదీశ్వరఆలయంలో, కుంభకోణం దగ్గర సుబ్రమణ్యస్వామి ఆలయంలో కూడా సప్తస్వర స్థంభాలు వున్నాయి. కర్ణాటక హంపిలో వున్నది మనందరికీ తెలిసిందే.

PC:youtube

రాజ్ మహల్

రాజ్ మహల్

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో రాజ్ మహల్ లో సంగీత సప్తస్వర స్థంభాలు వున్నాయి.

PC:youtube

ఎల్లోరా

ఎల్లోరా

మహారాష్ట్రలోని ఎల్లోరా జైనదేవాలయంలో కూడా ఈ సప్తస్వరాలు పలికించే స్థంభాలు వుండటం విశేషం.

PC:youtube

అద్భుత శివలింగం వున్న ఆలయం

అద్భుత శివలింగం వున్న ఆలయం

మరిప్పుడు ఇనుమును కూడా బంగారంలా మార్చే అద్భుత శివలింగం వున్న ఆలయం గురించి తెలుసుకుందాం.

PC:youtube

హనుమకొండ

హనుమకొండ

వరంగల్ జిల్లా హనుమకొండలోని శ్రీ శంభులింగేశ్వర ఆలయం. 1162లో కాకతీయులు రెండవరాజు ప్రోలరాజు కట్టించాడు.

PC:youtube

 హనుమకొండ

హనుమకొండ

ఈ రాజు పరిపాలించే సమయంలో ఒకసారి రైతులు ధాన్యపుబస్తాలు బండ్లపై తీసుకునివెళ్తుండగా చక్రం అనేది భూమిలో దిగబడి ఎంతో కష్టపడితే గాని పైకి రాలేదు.

PC:youtube

హనుమకొండ

హనుమకొండ

అయితే పైకి తీయబడిన ఆ చక్రం బంగారు కాంతితో ధగధగ మెరిసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

PC:youtube

హనుమకొండ

హనుమకొండ

ఈ విషయం తెలుసుకున్న రాజు అక్కడికివచ్చి తవ్వగా బంగారు కాంతులీనే శివలింగం కనిపించింది. ఆ లింగాన్ని తీసి తన రాజధాని హనుమకొండలో ప్రతిష్టించాలి అనుకుంటాడు.కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు.

PC:youtube

హనుమకొండ

హనుమకొండ

అప్పుడు అతడి గురువైన శ్రీరామానుజాచార్యుల వారు అది ఎంతో మహిమాన్వితమైన శివలింగం అని, దాన్ని పైకి తీయరాదని ఆ శివలింగానికి ఇనుముకూడా బంగారంగా మార్చే శక్తి వుందికాబట్టి అక్కడ్నుండి తీయవద్దని అక్కడే గుడిని కట్టించి ఆలయంచుట్టూ 12కిమీ ల మేరలో కోటలు నిర్మించమంటాడు.

PC:youtube

హనుమకొండ

హనుమకొండ

రాజు ఆవిధంగానే కోటను కట్టించాడు.అందుకే దానిని ఓరుగల్లు కోట అంటారు. కోటలు శిధిలం అయినా ఆ రాజులు, రాజ్యాలు లేకపోయినా స్వయంభుగా వెలసిన లింగేశ్వరఆలయం ఈ సంఘటనకు సజీవసాక్ష్యంగా నిలుస్తూ,భక్తులను ఆ ఆలయానికి రాప్పిస్తూ వారు కోరుకున్న కోరికలను తీరుస్తూవుంది.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X