అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !

Written by:
Published: Thursday, June 2, 2016, 18:11 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

భారతదేశంలో స్వర్ణ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ? అవి ఎక్కడ ఉన్నాయో, దానిని నిర్మించటానికి ఎంత బంగారం ఉపయోగించారో తెలిస్తే ముక్కున వేలు వేసుకుంటారు. మన ఇండియాలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ స్వర్ణ దేవాలయాలు కేవలం కొన్నే వేళ్ళమీద లెక్క పెట్టేంతగా ఉన్నాయి.

భారతదేశంలోని స్వర్ణ దేవాలయాలు రెండు. అందులో ఒకటేమో ఉత్తరం వైపు, మరొకటేమో దక్షిణం వైపు ఉన్నాయి. ఉత్తరం వైపు ఉన్న ఆలయం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో, దక్షిణం వైపు ఉన్న ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లో ఉన్నాయి. రెండు ఆలయాలు స్వర్ణ దేవాలయాలే అయినప్పటికీ అందులో ఉండే దేవుళ్ళు వేరు. మరి ఈ రెండు ఆలయాల గురించి ఒకసారి తెలుసుకుందాం పదండి ..!

స్వర్ణ దేవాలయం, అమృత్ సర్

అమృత్ సర్ కు ఆ పేరు గోల్డెన్ టెంపుల్ కల అక్కడి పవిత్ర సరోవరం నుండి వచ్చింది. అమృత్ సర్ స్వర్ణ దేవాలయం సిక్కుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ప్రతి రోజూ వేలాది సిక్కు మత ప్రజలు ఇక్కడకు వచ్చి తమ ప్రార్ధనలు చేసుకుని వెళతారు. సందర్శకులు లేదా పర్యాటకులు సరస్సు మధ్యలో నిర్మించిన ఈ దేవాలయ వైభవం చూసేందుకు వస్తారు.

అమృత్ సర్ స్వర్ణ దేవాలయం విశాలమైనది. సిక్కు మతస్థుల చరిత్ర, సంస్కృతిని తెలియచేస్తుంది. ఈ గురుద్వారా ను ' శ్రీ హరమందిర్ సాహిబ్' అని కూడా పిలుస్తారు. స్వర్ణ దేవాలయంలో ఒక సరస్సు కూడా ఉంటుంది. ఇది మానవనిర్మిత సరస్సు. సిక్కుల నాల్గవ గురువు అయిన గురు రాం దాస్ అధ్వర్యంలో ఈ సరస్సు నిర్మించబడిందని , అందులో 'పవిత్ర నీరు' తో నింప బడిందని చెపుతారు.

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !

                                                                   అమృత్ సర్ స్వర్ణ దేవాలయం

                                                                    చిత్ర కృప : Geetesh Bajaj

అమృత్ సర్ ఆలయంలో సిక్కుల పవిత్ర గ్రంధం అయిన ఆది గ్రంధం ఉంచుతారు. దీనిని ప్రతి రోజూ ఉదయం చదువుతారు. సరస్సు లోని ఒక వంతెన ద్వారా దీనిని చేరాలి. సాంప్రదాయ దుస్తులు ధరించిన రక్షక భటులు దీనిని కావలి కాస్తూ వుంటారు.

గురుద్వారా లోని పై అంతస్తులను 400 కిలోల బంగారం తో నిర్మించారు. అందుకనే దీనిని గోల్డెన్ టెంపుల్ లేదా స్వర్ణ దేవాలయం అంటారు. దీనిలో 'గురు గ్రంధ సాహిబ్' అనబడే ఒక పవిత్ర గ్రంధం వుంటుంది. ఈ భవనానికి ఎదురుగా సిక్కు మత చరిత్రను తెలిపే ఒక మ్యూజియం కలదు.

గురుద్వారా ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద విక్టోరియన్ క్లాక్ టవర్ ఉంటుంది. భక్తులు టెంపుల్ లోకి వెళ్ళే ముందు తమ పాదాలను ఇక్కడ కల ఒక నీటి మడుగు లో శుభ్రపరచు కుంటారు.

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !

                                     విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్న స్వర్ణ దేవాలయం, అమృత్ సర్

                                                       చిత్ర కృప : gags9999

గురుద్వారా లోని డైనింగ్ హాల్ ను 'లంగార్' అంటారు. భోజనం ఇక్కడ అందరికీ ఉచితం. ఈ భవన్ ప్రవేశంలోనే భక్తులకు ప్లేట్ లు స్పూన్ లు అందిస్తారు. అవి తీసుకొని వారు లోపలి వెళ్లి నేల మీద కూర్చుని వుంటే, వంటల వారు పెద్ద పెద్ద పాత్రలతో కల ఆహార పదార్ధాలు అంటే చపాతీ, రొట్టె మొదలైనవి తెచ్చి వడ్డిస్తారు. ఈ కార్యంలో అన్ని రకాల వారూ పాల్గొంటారు. డైనింగ్ హాల్ లోకి చెప్పులతో ప్రవేశం అనుమతించరు.

స్వర్ణ దేవాలయం, వెల్లూర్

శ్రీ పురం స్వర్ణ దేవాలయం వెల్లూర్ లోని మలై కొడి ప్రదేశంలో నిర్మించారు. దీనినే 'ది గోల్డెన్ టెంపుల్ అఫ్ వెల్లూర్' అని పిలుస్తారు. ఈ ఆలయం లోపల, బయట రెండు వైపులా బంగారు పూతతో మహాలక్ష్మి ఆలయం ఉంది. శ్రీ పురం స్వర్ణ దేవాలయంలో చేతితో చేసిన బంగారు షీట్ లు 9-15 పొరలుగా ఉన్నాయి. దీనిని 1500 కిలోల బంగారంతో కట్టించారని చెపుతారు.

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !

                                                               శ్రీ పురం స్వర్ణ దేవాలయం, వెల్లూర్

                                                                    చిత్ర కృప : Ag1707

భక్తులు ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు డ్రెస్ కోడ్ తప్పని సరిగా పాటించాలి. పొట్టి పాయింట్లు, మిడ్డీ లు పూర్తిగా నిషేధం. చీరలు, పంచలు కట్టుకొని లేదా సంప్రదాయ దుస్తులు ధరించి లోనికి వెళ్ళటం ఉత్తమం. మొబైల్ ఫోన్ లు, కెమరా, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు పొగాకు, మద్యం అలాగే మండే వస్తువులను లోనికి అనుమతించరు.

సందర్శించు సమయం : సంవత్సరం పొడవునా శ్రీ పురం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించవచ్చు. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు ఆలయం తెరిచే ఉంటారు. అభిషేకం ఉదయం 4 నుండి 8 గంటల వరకు, హారతి సేవ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తారు.

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !

                                                          శ్రీ పురం స్వర్ణ దేవాలయం వ్యూ

                                                             చిత్ర కృప : briejeshpatel

English summary

golden temples in india

You know how many Golden Temples in India ? There are Two golden Temples in india. Apart from one temple is located at amritsar (Punjab) and another Temple is located in Vellore (Tamil Nadu).
Please Wait while comments are loading...