అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రైలు మ్యూజియంలు !

Written by:
Updated: Wednesday, October 5, 2016, 11:56 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మ్యూజియం ... ఈ పేరు వింటే చాలు పాత జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతాయి. ఇది ఒక పాత జ్ఞాపకాల ఖజానా. ఇప్పటి వరకు వస్తుసముదాయానికి సంబంధించిన మ్యూజియాలనే చూసి ఉంటారు ఎందుకంటే అవే ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ చెప్పబోయే మ్యూజియం అలాంటి ఇలాంటి మ్యూజియం కాదు. మ్యూజియాలలోనే అరుదైనది ... రైల్ మ్యూజియం.

లైఫ్ లో ఒక్కసారైనా ఎక్కాలనుకునే రైలు !!

ఇండియన్ రైల్వే - ఆసక్తి కరమైన విషయాలు !

భారతదేశంలో మొట్టమొదటి రైలు బ్రిటీష్ హయాంలో 1951 వ సంవత్సరంలో రూర్కీలో కూతపెట్టింది. సామాన్య ప్రజలకు భారతదేశంలో రైల్వేలను మొదటిసారిగా ఏప్రియల్ 16, 1953 లో ప్రవేశపెట్టారు. ఆతరువాత 9 ఏళ్లకు ఏపీలో పుత్తూరు - రేణిగుంట మధ్య మొదటి రైలు నడిచింది. 1995 లో రైల్వే వ్యవస్థలో కంప్యూటరైజేషన్, 2000 లో వెబ్సైటు, 2005 లో ఈ - టికెటింగ్ సేవలు అందుబాటులో వచ్చాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే సిబ్బంది (14 లక్షలు) కలిగిన దేశం మనది.

భారత దేశంలో ప్రసిద్ధ రైలు వంతెనలు !!

కాలం గడుస్తున్నా కొద్దీ టెక్నాలజీ మారుతుంటుంది. కానీ రోజూ 2 కోట్ల మంది భారతీయులను గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే వ్యవస్థ యొక్క పాత్ర అద్వితీయమైనది. దశాబ్దాల కిందటి రైలు నమూనాలు, అప్పటి రైలు ఇంజన్ లు, బోగీలు మరియు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ రైలు మ్యూజియాలు జ్ఞాపకాల గని. మరి మీరు కూడా చూడాలనుకుంటే ఈ రైలు మ్యూజియాలకు పదండి.!

నేషనల్ రైల్వే మ్యూజియం

నేషనల్ రైల్వే మ్యూజియం ఢిల్లీ లో కలదు. ఢిల్లీ లోని చాణక్యపురి లో ఫిబ్రవరి 1, 1977 లో దీన్ని ప్రారంభించారు. భారతీయ రైల్వే చరిత్ర మరియు వైభవాన్ని ఈ మ్యూజియం ప్రతిబింబిస్తూ ఉంటుంది. మ్యూజియంలో సందర్శకులను తిప్పి చూపించటానికి టాయ్ ట్రైన్ సదుపాయం కలదు.

సందర్శన సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరుస్తారు.

చిత్రకృప : Bruno Corpet

మైసూర్ రైల్వే మ్యూజియం

మైసూర్ లో రైల్వే మ్యూజియం కలదు. దీనిని 1979 లో మైసూర్ లోని యాదవగిరి వద్ద స్థాపించారు. ఇందులో రైల్వే ల పురోగతిని సూచించే అంశాలు ఉంటాయి. శ్రీ రంగ మార్కీ లో రాజుల వాహనాలు చూడవచ్చు. ఇండియాలో నడిచిన మొదటి స్టీమ్ ఇంజన్ కూడా చూడవచ్చు. టాయ్ ట్రైన్ పిల్లలకు ఆసక్తిని కలిగిస్తుంది.

సందర్శన సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 : 30 వరకు తెరుస్తారు. పెద్దలకు 15/-, పిల్లలకు 10/- కెమెరాకు 20-30 రూపాయల వరకు మరియు టాయ్ ట్రైన్ కు 10 రూపాయలు వసూలు చేస్తారు.

చిత్రకృప : Ranjithsiji

 

జోషి రైల్వే మ్యూజియం

జోషి రైల్వే మ్యూజియం పూణే నగరంలోని కార్వే రోడ్ లో కలదు. ఇందులో రైళ్లలో వచ్చిన మార్పులు, డిజైనింగ్ మరియు వివిధ రకాలైన రైళ్ల మోడళ్ళ ను ప్రదర్శిస్తుంటారు.

సందర్శన సమయం : ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు తెరుస్తారు.

చిత్రకృప : www.minirailways.com

 

రీజనల్ రైల్వే మ్యూజియం

రీజనల్ రైల్వే మ్యూజియం చెన్నై సమీపంలోని పెరంబూరు వద్ద విల్లివక్కం లో కలదు. దీనిని 2002 లో స్థాపించారు. ఇందులో పాతకాలం నాటి స్టీమ్ ఇంజన్ లు, పురాతన కాలం నాటి రైలు నమూనాలు, ఫోటో గ్యాలరీలను ప్రదర్శిస్తుంటారు.

సందర్శన సమయం : సోమవారం తప్ప, మిగితా అన్ని రోజులలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 : 30 వరకు తెరుస్తారు.

చిత్రకృప : Pravinjha

రైల్వే హెరిటేజ్ కేంద్రం

రైల్వే హెరిటేజ్ కేంద్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి లో కలదు. దీనిని తిరుచిరాపల్లి లో రైల్ కల్యాణ మండపం (కమ్యూనిటీ హాల్) వద్ద 2014 లో స్థాపించారు. ఇందులో రైల్వే లకు సంబంధించిన పురాతన ఎయిర్ క్రాఫ్ట్స్, ఫోటోగ్రాఫ్స్, అరుదైన డాక్యుమెంట్లు, పరికరాలు మరియు దక్షిణ రైల్వే లో వచ్చిన పురోగతి అంశాలు ఉన్నాయి.

సందర్శన సమయం : ఉదయం 10 నుండి సాయంత్రం 5 : 30 వరకు

చిత్రకృప : Deepu051993

ఘుమ్ రైల్వే మ్యూజియం

డార్జిలింగ్ హిమాలయాస్ రైల్వే కు చెందిన మూడు రైల్వే మ్యూజియాల్లో 'ఘుమ్ రైల్వే మ్యూజియం' ఒకటి. దేనిని ఘుమ్ రైల్వే స్టేషన్ వద్ద 2000 వ సంవత్సరంలో స్థాపించారు. ఇందులో 1881 లో నడిచిన పురాతన టాయ్ ట్రైన్, పురాతన ఎయిర్ క్రాఫ్ట్స్ లు, ఫోటో ప్రదర్శన ను తిలకించవచ్చు.

సందర్శన సమయం : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరుస్తారు. ప్రవేశ రుసుము 20 రూపాయలు.

చిత్రకృప : PP Yoonus

తూర్పు రైల్వే మ్యూజియం

తూర్పు రైల్వే మ్యూజియం పశ్చిమ బెంగాల్ లోని హౌరా లో కలదు. మొదటి ఏసీ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. రైళ్లకు సంబంధించిన ఎన్నో చారిత్రక అంశాలను, ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించవచ్చు.

సందర్శన సమయం : 10:30 నుండి సాయంత్రం 5 : 30 వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరుస్తారు.

చిత్రకృప : Superfast1111

ఢిల్లీ మెట్రో మ్యూజియం

పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద 'మెట్రో మ్యూజియం' కలదు. ఇది దక్షిణ ఆసియా ఖండంలోని మొదటి మెట్రో మ్యూజియం గా ఖ్యాతి కెక్కింది. పానెల్స్, ఘనకార్యాలు, చారిత్రక ఫోటోగ్రాఫ్స్, అరుదైన రైల్వే సమాచారం మొదలైనవి ప్రదర్శిస్తారు.

సందర్శన సమయం : సోమవారం తప్ప, ప్రతి రోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరుస్తారు.

కాన్పూర్ రైల్వే మ్యూజియం

కాన్పూర్ లో కూడా రైల్వే మ్యూజియం కలదు. ఇక్కడ కూడా పురాతన రైళ్ల సమాచారం, ఫోటో ప్రదర్శన తిలకించవచ్చు.

సందర్శన సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరుస్తారు.

చిత్రకృప : Abhisheks 91

English summary

Railway Museums in India

This famous museum in India focuses on the rail heritage of India. It has the specimens of different evolution phases from the Indian Rail history.
Please Wait while comments are loading...