Search
  • Follow NativePlanet
Share
» »కొట్టాయం - ప్రకృతిలో ఒక అద్భుత ప్రదేశం !

కొట్టాయం - ప్రకృతిలో ఒక అద్భుత ప్రదేశం !

అందమైన పర్వతాలు, ప్రాచినమైన కొండలు, పచ్చని లోయలు, కళ్ళు తిప్పుకోలేని కొట్టాయం సొంతం.

By Mohammad

కొట్టాయం కేరళలో ఒక పురాతన నగరం. ఇది కొట్టాయం జిల్లాలో, దేవుని స్వంత భూమి యొక్క జిల్లాలో ఒకటి. తూర్పు మరియు పశ్చిమ కనుమలు సరిహద్దులు గల వెంబనాడ్ సరస్సు మంత్రముగ్దులను చేస్తుంది. ఇది ప్రకృతిలో ఒక అద్భుతమైన ప్రదేశం.

అందమైన పర్వతాలు, ప్రాచినమైన కొండలు, పచ్చని లోయలు, కళ్ళు తిప్పుకోలేని సౌందర్యం ఉంటుంది. రబ్బరు తోటల పెంపకం, స్థానికంగా ఉండే ఆకర్షణీయమైన సరస్సులు వంటివి కొట్టాయంలో ఉన్నాయి. కొట్టాయం నగరం సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్య పంటలకు, ప్రత్యేకించి రబ్బర్ కు ప్రధాన వ్యాపార కేంద్రం.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ... కుమారకోమ్ !!నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ... కుమారకోమ్ !!

కొట్టాయం భారతదేశం లో మొదటి పర్యావరణ నగరంగా పేరు పొందింది. దాని సహజ సౌందర్యం మరియు దాని గొప్ప సాంస్కృతిక వారసత్వ కారణంగా, కొట్టాయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు విశ్రాంతి మరియు కేరళ సంపన్నమైన సాంస్కృతిక విలువలు కోసం వస్తు ఉంటారు. కొట్టాయం సందర్శించటానికి శీతాకాలం ఉత్తమ సమయం.

కొట్ట తవళం

కొట్ట తవళం

కొట్టతవళం కొట్టాయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కురిసుమల వద్ద మురుగన్ కొండల సమీపంలో ఒక అద్భుతమైన గుహ లోఉంది. ఈ ప్రదేశం కొట్టాయంకు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది. స్వామి అయ్యప్ప, మురుగన్, మధురై మీనాక్షి మరియు కన్నకి యొక్క దేవుని బొమ్మలు కూడా చెక్కబడ్డాయి.

చిత్రకృప : kerala tourism

పూంజర్ ప్యాలెస్

పూంజర్ ప్యాలెస్

పూంజర్ ప్యాలెస్ కొట్టాయం నుండి పాల-ఎరాట్టుపెట్ట కు పూంజర్ కు వెళ్ళే దారిలో ఉంటుంది.ఈ ప్యాలెస్ కేరళ యొక్క గొప్ప చరిత్రకు ఒక నిదర్శనం. ప్యాలెస్ లో రాచరిక పురాతన వస్తువులు, సుందరమైన శిల్పాలు మరియు రాళ్ళ నుండి చెక్కబడిన దీపాలు చాలా ఉన్నాయి.

చిత్రకృప : Sajetpa

పూంజర్ ప్యాలెస్

పూంజర్ ప్యాలెస్

మీరు ప్యాలెస్ లో పురాతన కాలం నాటి విగ్రహాలు, శిల్పాలు నటరాజ విగ్రహం మరియు ఆయుధాలు,లలిత కళా నైపుణ్యంను చూడవచ్చు. గోడలపై ఉన్న శిల్పాలు మనకు పురాణ కధలను వర్ణిస్తాయి.

చిత్రకృప : telugu native planet

సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి

సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి

కొట్టాయం నుంచి 2 కి.మీ. దూరంలో సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి ఉంది. 1579లో తెక్కుమ్కుర్ రాజు తన క్రైస్తవ పౌరుల కొరకు దీనిని నిర్మించాడు. చర్చి నిర్మాణం పోర్చుగీస్ శైలి మరియు కేరళ శైలి లో కనపడుతుంది.

చిత్రకృప : telugu native planet

తజతంగడి జుమ మస్జిద్

తజతంగడి జుమ మస్జిద్

మీనచిల్ నది ఒడ్డున ఉన్న తజతంగడి జుమ మస్జిద్, భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి మరియు 1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైనది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడింది.

చిత్రకృప : Aryaabraham

తిరువేర్పు ఆలయం

తిరువేర్పు ఆలయం

తిరువేర్పు ఆలయం లో కృష్ణుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయం కొట్టాయం నుండి 7 కి.మీ. ప్రయాణం దూరంలో మీనచిల్ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం 1500 సంవత్సరాల క్రితం కట్టినదిగా భావిస్తున్నారు.

చిత్రకృప : Dvellakat

తిరువేర్పు ఆలయం

తిరువేర్పు ఆలయం

ఈ ఆలయం నకు అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నయి.

మొదటిది - వీ అవర్స్ పాయాసం రూపకల్పనపై పద్ధతి.

రెండవది - ఆలయ పూజారికి ఒక గొడ్డలి అలాగే ఆలయం తలుపు తెరవడానికి తాళం చెవి ఇవ్వబడుతుంది. ఏ కారణంగా అయినా సరే తలుపు కీ ద్వారా తలుపు తెరవబడదు అంటే , పూజారి గొడ్డలి ఉపయోగించి విరగ కొడతాడు.

మూడవది - ఆలయము గ్రహణం సమయంలో తెరిచే ఉంటుంది.

చిత్రకృప : Dvellakat

ఎలవీజాపూంఛిరా

ఎలవీజాపూంఛిరా

ఎలవీజాపూంఛిరా అందమైన వనభోజనా స్థలంగా సందర్శకులకు ప్రఖ్యాతమైనది. ఇక్కడ చిన్నకొండలు యొక్క కొనలు మరింత ఆకట్టుకొంటాయి .ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం చాలా మంది అధిరోహకులకు ఇష్టమైన ప్రదేశం.

చిత్రకృప : telugu native planet

ఎలవీజాపూంఛిరా

ఎలవీజాపూంఛిరా

కొట్టాయం నుండి మీరు ఎలవీజాపూంఛిరా చేరుకోవడానికి పాలై వైపు 55 కి.మీ. ప్రయాణం ఉంటుంది. ఇక్కడ మూడు ఆకర్షణీయమైన కొండలు ఉన్నాయి. అవి తోనిప్పర, మన్కున్ను మరియు కోడయతూర్మల్. ఇక్కడి నుంచి కొట్టాయం, ఇడుక్కి, పతనంతిట్ట, ఎర్నాకులం, త్రిసూర్ మరియు అలప్పుజ యొక్క అందాలను చూడవచ్చు.

చిత్రకృప : Jacob Jose

నట్టకం

నట్టకం

నట్టకం అనే గ్రామం కొట్టాయంలోని పల్లం తాలూకాలో ఉంది. కొట్టాయం నగరానికి నట్టకం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామం చుట్టూ పచ్చదనం తో ఉండుట వల్ల అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది.వేసవి కాలంలో అనేక రకాల వలస పక్షులు వస్తాయి.ఈ పక్షుల అరుపులు ఒక సంగీత వాతావరణాన్ని కలిగిస్తాయి.

చిత్రకృప : Innotata

నట్టకం

నట్టకం

కొట్టాయం పోర్ట్ మరియు కంటైనర్ టెర్మినల్ (KPCT) నట్టకంలో ఉన్నాయి.మీరు ఒకసారి తప్పకుండా నట్టకంను సందర్శించండి. ఇక్కడ ఆయుర్వేద మసాజ్ మరియు ఈత, ఫిషింగ్ మరియు బోటింగ్ వంటి ఇతర వినోదాలు కూడా ఉన్నాయి.మీకు ఫోటోగ్రఫి మీద ఆసక్తి ఉంటే సందర్శించడానికి ఇది ఒక మంచి ప్రదేశం.

చిత్రకృప : Gerard Primus

పల్లిప్పురతు కవు

పల్లిప్పురతు కవు

పల్లిప్పురతు కవు కోడిమత అనే ప్రదేశంలో కొట్టాయం యొక్క దక్షిణ భాగం లో ఉంది. ఈ ఆలయంలో దేవత భద్ర కాళి. విష్ణువు మరియు పతముదయం పల్లిప్పురతు కవు ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.

చిత్రకృప : Sivavkm

పంచికడు

పంచికడు

కొట్టాయం జిల్లాలో ఉన్న మరొక చిన్న గ్రామం పంచికడు. కొట్టాయం మరియు చంగనస్సేరి మధ్య ప్రధాన రోడ్ మీద ఉంది. పంచికడు కొట్టాయం కి 11km దూరంలో ఉంది. ఈ గ్రామంలో సరస్వతి ఆలయం ఉంది.

చిత్రకృప : Manojk

పంచికడు

పంచికడు

ఈ ఆలయం ను దక్షిణ మూకంబికగా కొలుస్తారు.ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా పూజలు చేస్తారు.ఇక్కడ ప్రకృతి దృశ్యాలు మనసును రంజింప చేస్తాయి.ఈ చిన్న గ్రామంలో మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.ఈ గ్రామం ప్రకృతి చిత్రీకరణకు అనువైన ప్రదేశం.

చిత్రకృప : Manojk

సరస్వతి ఆలయం

సరస్వతి ఆలయం

కొట్టాయం లో సరస్వతి ఆలయంలో దేవత సరస్వతి దేవి. ఇది కేరళలో మాత్రమే ఉన్న ఆలయం,మరియు దక్షిణ మూకాంబికా అని పిలుస్తారు.ఈ ఆలయం చిన్గావనం సమీపంలో ఉంది.

చిత్రకృప : Manojk

సరస్వతి ఆలయం

సరస్వతి ఆలయం

ఈ విగ్రహం దగ్గర అన్ని సమయాలలో వెలిగే రాయిదీపం ఉంది. పణతి కుతూ చెడి మొక్కలు తూర్పు ముఖంగా ఉన్న విగ్రహం చుట్టూఉంటాయి. ఈ సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి.ఆలయం ఉదయం 5.30 నుంచి 11.30 వరకు,మరియు సాయంత్రం 5 గం.నుండి 7,30 గం. వరకు తెరచి ఉంటుంది.

చిత్రకృప : Manojk

సుబ్రమణ్యస్వామి దేవాలయం

సుబ్రమణ్యస్వామి దేవాలయం

కొట్టాయం నుండి 20 కి.మీ.లదూరంలో సుబ్రమణ్య స్వామి ఆలయం ఉన్నది. సుబ్రమణ్య స్వామికి కేరళలో ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయం లోకి కుల,మతాలకు సంబంధం లేకుండా అందరు వెళ్ళే మొదటి ఆలయం. క్రీ.శ.753 నాటి చాలా పాత ఆలయం. ఆలయం విగ్రహం 6 అడుగుల పొడవు ఉంటుంది.సుబ్రమణ్య స్వామి చేతిలో ఒక ఈటె లాంటి ఆయుధం ఉంటుంది.

చిత్రకృప : Ashok Rajan

సుబ్రమణ్యస్వామి దేవాలయం

సుబ్రమణ్యస్వామి దేవాలయం

'పల్లిమెట్ట ఉత్సవ్'ను ఈ ఆలయంలో జరుపుకుంటారు,ఇది వార్షిక ఉత్సవం. ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది మరియు నవంబర్ మరియు డిసెంబర్ లలో వస్తుంది.ఈ పండుగ సమయంలో చేసిన ప్రధాన ఆచారము చాకిఅర్కూత్ ఉంది. సుబ్రమణ్యస్వామి ఆలయం ఉర్జమా దేవస్వామ్ బోర్డు చే నిర్వహించబడుతుంది. ఇది ఒక పురాతన దేవాలయం, ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.

చిత్రకృప : C C Prakash Chandran

తిరునక్కర మహాదేవ ఆలయం

తిరునక్కర మహాదేవ ఆలయం

తిరునక్కర మహాదేవ ఆలయం లార్డ్ శివకు అంకితం చేయబడింది. తేక్కుమ్కూర్ రాజు దీనిని 16 వ శతాబ్దం ప్రారంభంలోనిర్మిచారు. ఇది కొట్టాయం ప్రధాన నగరంలో ఉంది. ఇది కేరళ శైలిలో నిర్మించబడింది. .ఈ శివాలయం యొక్క గోడలపై కుడ్యచిత్రాలు ఉంటాయి, వాటి వల్ల మనకు పురాణాలు గురించి తెలుస్తున్నది.

చిత్రకృప : RajeshUnuppally

కొట్టాయం చేరుకోవడం ఎలా ?

కొట్టాయం చేరుకోవడం ఎలా ?

వాయు మార్గం : కొట్టాయం కు సమీపాన 90 కి. మీ ల దూరంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఎయిర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా టాక్సీలలో ప్రయాణించి కొట్టాయం చేరుకోవచ్చు.

రైలు మార్గం : కొట్టాయంలో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, త్రివేండ్రం, మంగళూరు, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళు స్టేషన్ లో ఆగుతాయి.

బస్సు మార్గం : చెన్నై, కోయంబత్తూర్, మంగళూరు, బెంగళూరు, కొచ్చి, త్రివేండ్రం మొదలైన ప్రాంతాల నుండి ఇక్కడికి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు వస్తుంటాయి.

చిత్రకృప : Challiyan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X