Search
  • Follow NativePlanet
Share
» »బీదర్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

బీదర్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

బీదర్ కోట చరిత్ర పురాతమైనది. మహాభారతకాలంలో దీనిని 'విదురానగర్' అని పిలిచేవారట ... కారణం విదురుడు ఇక్కడ నివసించడం. బిద్రీ కళ కారణంగా బీదర్ అన్న పేరొచ్చిందని చెబుతారు.

By Mohammad

బీదర్ ... కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లాలలో ఇది ఒకటి. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ అవతరణప్పుడు (నవంబర్ 1, 1956) మైసూర్ రాష్ట్రం (ఇప్పటి కర్ణాటక) లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో కన్నడ, తెలుగు తో పాటు మరాఠా భాష కూడా మాట్లాడుతారు. హైదరాబాద్ సంస్కృతి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది.

చరిత్ర

బహమనీ సుల్తాన్ అహ్మద్ షా బీదర్ ను రాజధానిగా చేసుకొని పాలించాడు. ఇక్కడ కోటను నిర్మించుకొని, నివాసం ఉండి బహమనీ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చారిత్రక ప్రదేశం. హైదరాబాద్ నుండి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి చేరుకోవటానికి పట్టే సమయం : 3 గంటలు. బెంగళూరు నుండి 700 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఉన్నది.

బీదర్ కు గల పేర్లు : విదురానగరం - మహాభారత కాలంలో, అహ్మదాబాద్ బీదర్ - అహ్మద్ షా పరిపాలన కాలంలో, బెడద కోట
నిక్ నేమ్ : ది సిటి ఆఫ్ విష్పరింగ్ మాన్యుమెంట్స్

బీదర్ కోట

బీదర్ కోట

బీదర్ కోట దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నది. బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ క్రీ.శ. 1427 లో గుల్బర్గా నుండి రాజధానిని బీదర్ కు మార్చాడు. ఆ కాలంలోనే కోటకు మరిన్ని మహమ్మదీయ నిర్మాణాలు చేపట్టి, మహమ్మదీయ కోట గా మార్చివేసాడు.

చిత్రకృప : Santosh3397

కోట నిర్మాణం

కోట నిర్మాణం

ప్రస్తుతం ఉన్న నిర్మాణం అహ్మద్ షా బహమనీ నిర్మించాడు. కోట పొడవు - 1. 21 కిలోమీటర్లు, వెడల్పు - 0. 80 కిలోమీటర్లు. కోటలోపల అనేక కట్టడాలు, మసీదులు, ఆర్చీలు, పెవిలియన్లు, ప్రవేశ ద్వారాలు మరియు తోటలు ఉన్నాయి.

చిత్రకృప : Santosh3397

చౌబారా

చౌబారా

చౌబారా ఒక పహారా గోపురం. ఇది కోట కు వెళ్తున్న మార్గంలో కనిపిస్తుంది. దీని ఎత్తు 80 అడుగులు. భటులు కోటకు రక్షణగా ఇక్కడి నుండే పహారా కాసేవారట.

చిత్రకృప : Santosh3397

సోలా కంభ్ మసీదు

సోలా కంభ్ మసీదు

ఈ మసీదును క్రీ.శ. 1423 లో నిర్మించారు. దీని మధ్య భాగంలో 16 స్తంభాలు ఉన్నాయి (సోలా - 16). అందుకే మసీదుకు ఆ పేరు. మసీదు చుట్టూ అందమైన తోట కలదు.

చిత్రకృప : Santosh3397

గగన్ మహల్

గగన్ మహల్

గగన్ మహల్ రాణీ నివాసం. చౌబారా కు సమీపంలో చౌవన్ మదరసా ఉండేది. ఇక్కడ మహమ్మదీయ విద్యార్థులకు చదువు చెప్పేవారు. అప్పట్లో ఇది మూడంతుస్తుల భవనం. దీనికి నాలుగు మినార్లు ఉండేవి. ప్రస్తుతం ఒకటేఉంది. దీనికి ఉపయోగించిన రాళ్ళు ఇరాన్ నుండి తెప్పించారు.

చిత్రకృప : Santosh3397

గురుద్వారా, అమృత్ కుండ్

గురుద్వారా, అమృత్ కుండ్

పూర్వం సిక్కుల గురువైన గురునానక్ ఇక్కడ ఉండేవారట. అయన మొదట అడుగువేసి ప్రాంతంలో ఇప్పటికీ నీళ్ళు సన్నని ధారవాలే వస్తూ ఉంటాయి. ఈ ధార ప్రవహిస్తూ ... ప్రవహిస్తూ ఒక కుండ వంటి నిర్మాణంలోకి వెళుతుంది. అప్పుడు 'అమృత్ కుండ్' గా పిలుస్తారు.

చిత్రకృప : Santosh3397

పాపవినాశనం, బసవ గిరి

పాపవినాశనం, బసవ గిరి

రావణుడిని చంపిన రాముడు, గొప్ప శివభక్తుడిని సంహరించిన దోషం పోగొట్టుకోవటానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు. అదే పాపవినాశనం.

వీర శైవ మతము క్లిష్ట పరిస్థుతులలో ఉన్నప్పుడు స్వయాన నంది బసవేశ్వరు ని గా అవతరించి భూలోకాన శైవ మతాన్ని వ్యాప్తి చేసాడట. ఆ బసవన్న ప్రార్ధనా మందిరమే బసవ గిరి.

చిత్రకృప : Santosh3397

జలా నరసింహస్వామి దేవాలయం

జలా నరసింహస్వామి దేవాలయం

ఈ గుహలో శివుడు తపస్సు చేసుకొంటుండగా 'జలాసురుడు' అనే రాక్షసుడు ఆయనను విసిగిస్తూ ఉండేవాడు. అప్పుడు నరసింహ స్వామి వచ్చి అతన్ని సంహరించాడు. జలాసురుడు కొద్దిగా పుణ్యం చేసుకున్నందుకు కోరిక కోరుకో అనగా, జలాసురుడు ఇక్కడ ఉండిపొమ్మని, నా పేరుతో కలిపి పిలవాలని కోరుకున్నాడట. అందుకే ఈ స్వామికి 'జలా నరసింహస్వామి అన్న పేరు వచ్చింది.

చిత్రకూప : Jaideep Rao

జలా నరసింహ స్వామి దేవాలయం

జలా నరసింహ స్వామి దేవాలయం

జలా నరసింహ స్వామి పాదాల నుండి నిత్యం నీరు గుహలో ప్రవహిస్తుంది. భక్తులు ఆ గుహలో 600 మీటర్లు నీటిలో నడుస్తూ వెళితేగానీ ఆ స్వామివారి దివ్య దర్శనం చేసుకోలేరు. ఇది కాస్త కష్టమైన దేవుణ్ణి దర్శించగానే ఆ కష్టం కనిపించదు.

బీదర్ ఎలా చేరుకోవాలి ?

బీదర్ ఎలా చేరుకోవాలి ?

బీదర్ పేరుకే కర్ణాటకలో ఉన్నప్పటికీ హైదరాబాద్ నుండి చక్కని రోడ్డు మార్గం కలిగి ఉన్నది. హైదరాబాద్ నుండి బీదకు డైరెక్ట్ గా బస్సులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుండి బీదర్ 140 కిలోమీటర్లు, 3 గంటల ప్రయాణం.

బీదర్ లో రైల్వే స్టేషన్ కూడా కలదు. ఇక్కడికి బెంగళూరు, గుల్బార్గా, హైదరాబాద్, షోలాపూర్, ముంబై తదితర ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

చిత్రకృప : Sscheral

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X